Tuesday, May 28, 2013

బీట్‌రూట్‌తో రక్తపోటు నియంత్రణ!



* బీట్రూట్తో రక్తపోటు నియంత్రణ!

మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా?

దానిని తగ్గించుకోవడానికి తంటాలూ పడుతున్నారా?

అయితే.. ఇకపై రోజూ రెం డు సార్లు బీట్రూట్ రసాన్ని తాగండి చాలు.. మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుందని ది బార్ట్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త అమృతా అహ్లువాలియా చెబుతున్నారు.

"
బీట్రూట్ వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయల వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 'నైట్రైట్' మారుతుంది. అనంతరం క్తంలో చేరి 'నైట్రిక్ ఆక్సైడ్'గా రూపొందుతుంది. ఇది రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి, రక్తం సాఫీగా సరఫరా అయ్యేందుకు తోడ్పడుతుంది. అంతిమంగా ఇది రక్తపోటును తగ్గిస్తుంది''
అని ఆమె పేర్కొన్నారు.

No comments:

Post a Comment