Monday, May 13, 2013

Drs Chandu



 
 
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా?

అయితే.. ఇకపై రోజూ రెండు సార్లు బీట్రూట్ రసాన్ని తాగండి చాలు. బీట్రూట్ వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయల వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 'నైట్రైట్' మారుతుంది. అనంతరం క్తంలో చేరి 'నైట్రిక్ ఆక్సైడ్'గా రూపొందుతుంది. ఇది రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి, రక్తం సాఫీగా సరఫరా అయ్యేందుకు తోడ్పడుతుంది. అంతిమంగా ఇది రక్తపోటును తగ్గిస్తుంది''
మలబద్దకమునకు # శొంటి, పిప్పిళ్ళు , మిరియాలు , కరక , తాడి , ఉసిరిక వీటిని సమముగా తీసుకొని కషాయము కాచి అందులో కొంచెము సైంధవ లవణము కలిపి తీసుకొంటూ వుంటే చక్కగా విరేచనము అగును,మలబద్దకము తగ్గును .
మొలల నివారణకు ( piles) # 1) అరటిదుంప మూడు ముక్కలు మూడు రాత్రులు మంచున వుంచి ఉదయం దంచి రసం తీసి అందులో కొంచెము జిలకర,కలబంద రసం కలిపి తీసుకుంటూ ఉంటే మొలలు తగ్గుతాయి .
2)
మజ్జిగతో ఉసిరిక రసము కలిపి త్రాగుతూ వుంటే రక్త మొలలు నివారణ అగును .
వేసవిలో వచ్చే మూత్ర దోషాలు తొలగటానికి # ఆవు పాలలో ఏలకులు , ఇంగువ , నెయ్యి కలిపి తాగితే మూత్ర దోషాలు (మంట,చురుకు,తెలుపు పోవటం) తగ్గిపోతాయి.
నెలసరి ఋతు చక్రం సక్రమంగా అవటానికి ( బహిస్టు ) # మామిడి వేరు చూర్ణం ఆవు పాలతో కలిపి సేవిస్తూ ఉంటే బహిస్టు సక్రమంగా అవుతుంది.
ఉబ్బసము ( ఆస్మా ) # మిరియాలు , 8 పొట్టు వొలిసిన తెల్లపాయలు , దుష్టపాకు రసంతో నూరి యిచ్చిన కఫం తెగి ఆయాసం నివారణ అగును.
చెమట కాయల వల్ల కలిగే బాధలకు # మంచి గంధపు చెక్కను అరగదీసి గంధాన్ని తులసి ఆకుల రసంలో కలిపి మిశ్రమాన్ని రాసుకుంటే తొందరగా చెమట కాయల వల్ల వచ్చే దురదలు,పొక్కులు తగ్గుతాయి. హాయిగా వుంటుంది
అధిక ఋతుస్రావమునకు # పెన్నేరు దుంపల చూర్ణం 2 గ్రాములు , పటిక బెల్లము 2 గ్రాములు కలిపి ప్రతిదినము ఉదయాన్నే మంచినీళ్ళ అనుపానంతో సేవిస్తూ వుంటే మందుకు తగ్గని అధిక ఋతుస్రావం క్రమబద్ధం అవుతుంది !
ఇంద్రియ పుష్టి , సంభోగ శక్తికి # 1) మినపప్పు నేతిలో వేయించి చూర్ణము చేసి ఆవుపాలలో వేసి కాచి పంచదార కలుపుకొని త్రాగవలెను.
2)
ప్రతిదినము ఉదయము, సాయంత్రం కాచిన ఆవుపాలు , కలకండ చేర్చి ఒక తులము శతావరి ( ఆయుర్వేద దుకాణం లో లభిస్తుంది) చూర్ణము కలిపి పుచ్చుకొంటే ఇంద్రియ పటుత్వం,సంభోగ శక్తి కలుగును.
తలలో పేలకు # వెల్లుల్లి రసం , వేపనూనె కలిపి కొద్దిగా వేడి చేసి తలకు రాచిన పేలు నశించును.
జీర్ణశక్తికి # అల్లము ముక్కలు చేసి దీనికి 4 వంతు సైంధవలవణము పొడి కలిపి వూరనిచ్చి ఆముక్కలను పూటకు 5 తింటువుంటే జీర్ణశక్తిని పొందవచ్చు.
కడుపులో మంటకు # అజీర్తి సమస్యలు, నిద్రలేమి, శరీర శ్రమ లోపాలు చాలామందిలో కడుపు ఉబ్బరం సమస్యలు కలిగిస్తాయి. ఎక్కువ కాలం సమస్య కొనసాగితే, కడుపులో మంట కూడా రావచ్చు. ఎన్నిమాత్రలు వేసుకున్నా మంట తగ్గకపోగా పెరిగే అవకాశం కూడా ఉంది. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున 200 మి.లీటర్ల పచ్చి క్యాబేజీ రసం తాగితే చాలు కొద్ది రోజుల్లోనే కడుపు ఉబ్బరం, మంట తగ్గిపోతాయి. రువాత రోజూ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రిండంతో పాటు రోజూ అరగంటయినా వ్యాయామం కోసం కేటాయించడం ఎంతో అవసరం.

No comments:

Post a Comment