Drs Chandu
బట్టతల నివారణకు # సీతాఫలం గింజ గంధం తీసి పలుచగా నెత్తిపై కోడిఈకతో రాసుకొని సాయంత్రం చల్లని నీటితో స్నానం చేయాలి, ఇలా కనీసం 5 నెలలు వాడాలి. (లేదా) mintop forte అనే అల్లోపతిక్ మందును కనీసం 3 నెలలు వాడాలి.
శరీర దుర్వాసన,చెమట వాసనకు # పసుపు కొమ్మలు వేయించి కొట్టిన చూర్ణంతో నలుగు పెట్టుకొని 15 నిముషాల తర్వాత స్నానం చేయాలి.
కాగిననూనె వల్ల కాగిన గాయాలకు # పాతసున్నాన్ని వేడిచేసి కొంచెం నీటితో నూరి గాయం పైన లేపనం చేయాలి.
నోటిలో కురుపులకు # మల్లెచెట్టు ఆకులు నమిలి ఉమ్మివేస్తూ వుంటే నోటిలో కురుపులు తగ్గుతాయి.
ధృడ శరీరానికి # జొన్నలను నీటిలో నానబెట్టి పొట్టు తీసి పరమాన్నం తయారుచేసి నిత్యం తింటే శరీరం బలంగా , ధృడంగా తయారవుతుంది.
నోటిపూతకు # ఏలక్కాయలు,పోకచెక్కలు నలగగొట్టి మూకుడులో వేసి మాడ్చి భస్మం తయారుచేసి ఆ భస్మాన్ని నాలుకపై రాసుకుంటూ వుంటే నాలుకపై ఏర్పడిన పుండ్లు తగ్గి ఆహారపదార్తాలు తినగలుగుతారు.
అరికాళ్ళ మంట తగ్గడానికి # పైపెచ్చుడు తీసిన ఆముదపు పప్పును పాలతో నూరి అరికాళ్ళకు,అరిచేతులకు పట్టించుకుంటూ వుంటే క్రమంగా తగ్గును.
రక్త శుద్ధికి # 1 కప్పు మేకపాలులో 2 చెంచాల తేనె కలుపుకొని నిత్యము తాగితే రక్తము శుద్ధి అగును.
శిరోజాలు పొడవుగా పెరగటానికి # నిమ్మరసంలో ఎండిన ఉసిరిక పెచ్చులను కలిపి మెత్తగా చేసి తలకు తట్టించి రుద్దుకుంటే తలలోని మురికి వదిలి,శిరోజాలు నల్లగా - పొడువుగా పెరుగుతాయి.
మూర్చకు # ఎవరైనా మూర్చకు గురై స్పృహ కోల్పోతే వారి ముక్కులో 4 - 5 చుక్కలు నీరుల్లి రసం వేస్తే మూర్చ తొలగిపోయి వారు స్పృహ లోకి వస్తారు.
శరీరం కాంతివంతంగా ఉండాలంటే # అవిశ పువ్వుల చూర్నాన్ని గేదెపాలలో కలిపి ముద్దగా చేసి ఆ మిశ్రమంలో వెన్న కలిపి శరీరానికి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే శరీరం చక్కగా కాంతివంతంగా వుంటుంది.ఇలా చేస్తే 15 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
గర్భస్రావం అయ్యేందుకు ( 1 నెల లోపు ) # నువ్వుల నూనెలో సైందవ లవణం కలిపి నూరి ఆ మిశ్రమాన్ని స్త్రీలు యోనిలో వుంచుకుంటే నెలరోజుల లోపు వున్న గర్భం గర్భస్రావం అవుతుంది. యిలా ఒక నెలలో మాత్రమే చేయాలి.
ముఖము పై చర్మము మడతలు రాకుండా # రోజు ముఖమునకు ఆలివ్ ఆయిల్ రాసుకుంటూ వుంటే ముఖముపై చర్మము మడతలు పడవు
బాలింతలకు పాలు పడుటకు # భూమిలో వుండే వానపాములను నూరి చక్కెర , నెయ్యి కలుపుకుని రోజుకు 3 సార్లు 7 రోజులు తినాలి. గ్యారంటీగా 10 రోజులలోనే ఫలితం చూస్తారు.
దంతాలు తెల్లగా ఉండటానికి # నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి తోమితే దంతాలు ముత్యాల్లా తళ తళ మెరుస్తాయి, రోజుకు 2 సార్లు 30 రోజుల్లోనే తేడా గమనిస్తారు
టాన్సిల్స్ తగ్గడానికి (ఆపరేషన్ లేకుండా ) # కాచు , తుమ్మజిగురు , పటిక బెల్లం , ఈ మూడింటిని సమభాగాలుగా కలిపి నీటితో నూరి రేగుపండు సైజు లో మాత్రలు చేసుకుని పూటకు 1 చొప్పున రోజుకు 2 సార్లు బుగ్గన పెట్టుకొని నోట్లో వూరిన రసం మింగుతూ వుంటే సుమారు 30 రోజుల్లోనే పూర్తిగా టాన్సిల్స్ తగ్గిపోతాయి.
ముఖము పై వచ్చిన మచ్చలు తగ్గడానికి # చిక్కుడు ఆకుల రసాన్ని ముఖానికి మర్దన చేస్తే క్రమంగా మచ్చలు తగ్గుతాయి.
పిల్లలు రాత్రిళ్ళు పక్క తడుపుతుంటే # సంపెంగ చెట్టు బెరడుతో తయారుచేసిన కషాయం తాగిస్తూ వుంటే పక్కలో మూత్ర విసర్జన చేసే వ్యాధి తగ్గుతుంది.
నపుంసకత్వం నకు ( vitality power ) # ప్రతిరోజూ నేతిలో వేయించిన వెల్లుల్లి పాయలను తింటూ వుంటే నపుంసకత్వం ఎన్నటికీ రాదు , ఆయుషు పెరుగును.
జీర్ణాశయం శుభ్రపడాలంటే # ఒక రాత్రంతా నానబెట్టిన సెనగలను మర్నాడు ఉదయాన్నే పరకడపున తిని ఇక ఆ రోజంతా మరేమీ తినకుండా వుంటే కడుపులోని క్రిములన్ని చచ్చిపోయి జీర్ణాశయం శుభ్రపడుతుంది .
హైపర్ టెంక్క్షన్ నివారణకు ( హై బిపి ) # వెల్లుల్లిని ప్రతిరోజూ తీసుకోవటం వల్ల ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, ఎ, బి, మరియు సి, సెలీనియం, ఐరన్, జింక్ మొదలగునవి ఫుష్కలంగా ఉండి. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తుంది.
చుండ్రును సహజంగా తగ్గించడానికి చిట్కాలు :
హాట్ ఆయిల్ మసాజ్: మీ తలను ప్రతి రోజు గోరువెచ్చని నూనెతో మర్దన చేయండి. మీ జుట్టును తాజాగా, మెరిసేలా చేయడంతో బాటు ఈ నూనెను తగినంతగా వాడటం వలన తలకు పోషణ అందటమే కాక ఎక్కువగా మర్దన చేయడం వలన రక్త ప్రసరణ ఉత్తమంగా ఉండి పొడి మృతచర్మాన్ని తొలగిస్తుంది.
ఎండలో ఎక్కువగా తిరగడం వలన జుట్టు పొడిబారిపోయి చుండ్రు ఏర్పడుతుంది. మీ జుట్టుకు శుభ్రతతో కూడిన పోషణ కలిగించి చుండ్రును అరికట్టవచ్చు. భయటకు వెళ్ళేటప్పడు గొడుగు లేదా హ్యాట్, క్యాప్ వంటివి ధరించడం మంచిది.
తేనె- పెరుగు: కొన్ని చుక్కల నిమ్మరసం, తేనే, పెరుగును కలపండి. దీనిని బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కొద్ది సేపు వదిలేయండి. తర్వాత తొలగించి గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగండి.
నిమ్మరసం: నిమ్మ రసాన్ని తలపై మర్దన చేయడం వలన కూడా మీరు చాల తేలికగా చుండ్రును పోగొట్టుకోగలరు. నిమ్మరసంతో తడిపిన మీ తలను, జుట్టును 30 నిమిషాల పాటు వదిలివేయండి, తర్వాత నీటితో కడగండి. రెండు మూడు సార్లు కడిగిన తర్వాత తేడాను మీరే గమనించగలరు. ఒక టీ స్పూన్ నిమ్మ రసాన్ని నీటితో కలిపి మీ జుట్టును దీనితో కడగండి. ఇది చుండ్రును తొలగిస్తుంది లేదా మీ తలపై రాకుండా చేస్తుంది. ఈ పద్ధతి మీ జుట్టును మెరిపిస్తుంది కూడా.
గుడ్డు: కోడిగుడ్డును జుట్టుకు పట్టించండి. ఇది మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఇది కూడా చుండ్రును తగ్గిస్తుంది.
బేబీ ఆయిల్: బేబీ నూనెను మీ తలకు పట్టించి, తలకు, జుట్టుకు బాగా పట్టేటట్టు చూడండి. ఉదయం గోరువెచ్చటి నీరు, తేలికపాటి షాంపూతో కడగండి. దీనిని క్రమపద్దతిలో చేయండి, మీ చుండ్రు పారిపోతుంది.
కూంబింగ్: క్రమంగా తలదువ్వడం వలన చుండ్రు పొలుసులు పోయి రక్త ప్రసరణ మెరుగౌతుంది. మీ జుట్టు దువ్వడానికి ముందు మరింత మెరుగైన రక్తప్రసరణ కోసం వెలి కొసలతో మర్దన చేయండి. దీని వలన కూడా చుండ్రును నివారించవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్: సెడార్ వేనిగార్ ను నీటితో కలిపి దూదితో మీ తలకు పట్టించండి. ఈ పద్ధతి కూడా మీ జుట్టునుండి చుండ్రును పోగొడుతుంది.
కొబ్బరినూనె: కొబ్బరి నూనెను మీ తలపై మీ వేలికొసలతో మర్దన చేయండి. తర్వాత 15 నిముషాల పాటు గోరువెచ్చని నీటితో కడగండి. ఇది ఖచ్చితంగా మీ తల నుండి చుండ్రును తొలగిస్తుంది.
ఉద్రేకం, ఒత్తిడి తరుచు చుండ్రును కలిగించవచ్చు. అందువల్ల చుండ్రును తప్పించుకోవడానికి చాలావరకు ప్రశాంతంగా ఉండండి. తగినంతగా నిద్రపోండి, మీరు మరింత ఎక్కువగా ఉద్రేకం, ఒత్తిడి కలిగించే విషయాల్లో కల్గచేసుకోకండి.
పెరుగు: పెరుగును వివిధ రకాల కురలు సమస్యలకు(చుండ్రు, చివరులు చిట్లడం, దురద, పొడిబారడం) ఉపయోగించి ఉంటారు. అంతే కాదు ఈ పెరుగుతో నేచురల్ గా కురులు సున్నితంగా తయారవుతాయి.
పైన చెప్పిన నివారణోపాయాలన్ని చుండ్రు సమస్యను అరికట్టి, మిమ్మల్ని చికాకు పుట్టించే పరిస్థితుల నుండి కాపాడతాయి. ప్రభావవంతమైన ఫలితాల కోసం మీరు ఈ పద్ధతులను కనీసం నెలకొకసారి ఉపయోగించాలి. అయితే అందరి విషయంలోనూ నియమాలు ఒకే రకంగా ఉండవు, అందువలన రెండు, మూడు రకాల పద్దతులను ఉపయోగించి ఏది మీకు ఉత్తమంగా ఉంటుందో తెల్సుకోవాలి.
కడుపులో మంటకు # అజీర్తి సమస్యలు, నిద్రలేమి, శరీర శ్రమ లోపాలు చాలామందిలో కడుపు ఉబ్బరం సమస్యలు కలిగిస్తాయి. ఎక్కువ కాలం ఈ సమస్య కొనసాగితే, కడుపులో మంట కూడా రావచ్చు. ఎన్నిమాత్రలు వేసుకున్నా మంట తగ్గకపోగా పెరిగే అవకాశం కూడా ఉంది. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున 200 మి.లీటర్ల పచ్చి క్యాబేజీ రసం తాగితే చాలు కొద్ది రోజుల్లోనే కడుపు ఉబ్బరం, మంట తగ్గిపోతాయి. ఆ త రువాత రోజూ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రిండంతో పాటు రోజూ అరగంటయినా వ్యాయామం కోసం కేటాయించడం ఎంతో అవసరం.
నా వయస్సు 26...నా కడుపు కింద బాగంలో ఎడమ ప్రక్కన నొప్పి వస్తుంది...ఎడమ టెస్టిస్ ఇబ్బందికరంగా ఉంది..స్కాన్ తీయిస్తే small varicocele అన్నారు..చిన్నగా ఉంది అన్నారు..ప్రస్తుతం ఆపరేషన్ అవసరం లేదు అన్నారు కాని నాకు ఎడమ కాలు బాగా లాగేస్తుంది...తోడ బాగంలో మరియు మోకాలు కింద వెనుక కండ బాగం విపరీతంగా లాగేస్తుంది, నమిలేస్తుంది... తగ్గకపోతే ఆపరేషన్ చేస్తాం అన్నారు...టెస్టిస్ నొప్పి లేకుండా మరియు కాలు లాగకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి సలహా చెప్పండి ప్లీజ్..నా కాలు విపరీతంగా లాగడం వలన కనీసం నిద్ర కూడా పట్టడం లేదు...ఆపరేషన్ లేకుండా తగ్గుతుందా...?
ReplyDelete