Tuesday, May 28, 2013

* టమోటో



* టమోటో

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది: టమోటోల్లో విటమిన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్ మరియు బీటాకెరోటిన్ యాంటీఆక్సిడెంట్స్ లా పనిచేస్తాయి . ఇవి శరీరంలోని రక్తనాలల్లోని హానికరమైన ఫ్రీరాడికల్స్ న్యూట్రిలైజ్ చేస్తుంది . ఫ్రీరాడికల్స్ వల్ల బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాధం ఉంది. టమోటోలను ఉడికించి తినడం కంటే పచ్చిది తినడం వల్ల ఎక్కువ ఆరోగ్యప్రయోజనం చేకూరుతుంది. ఉడికించడం వల్ల అందులో ఉండే విటమిన్ సి కోల్పోతుంది. టమోటోకున్న ఎరుపుదనం, బీటాకెరోటిన్ లెవల్స్ కు సంకేతం. కాబట్టి ఎరుపుదనం ఎక్కువగా ఉండే టమోటోలను ఎంపిక చేసుకోవడం వల్ల బీటాకెరోటిని పుష్కలంగా పొందవచ్చు .

గుండె ఆరోగ్యానికి: టమోటోలు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు టమోటోలో ఉండే విటమిన్ బి మరియు పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది . హార్ట్ అటాక్ ను, హార్ట్ స్ట్రోక్ ను మరియు గుండెకు సంబంధించి ఇతర సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన టమోటోను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఎంతైనా అవసరం.

కిడ్నీఆరోగ్యానికి: టమోటోలను మితంగా తీసుకోవడం వల్ల గాల్ స్టోన్ ప్రాబ్లెమ్ నుండి కిడ్నీలను కాపాడి. పనిచేసే విధానం చక్కగా ఉంచుతుంది. కాబట్టి మన రెగ్యులర్ డైట్ లో టమోటోలను చేర్చుకోవడానికి ఇది మరొక కారణంగా చెప్పుకోచ్చు.

క్యాన్సర్ నివారిణి: టమోటోల్లో ఉండి అధిక లైకోపిన్ అనే అంశం వివిధ రకాల క్యాన్సర్లనుప్రేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ మరియు కడు క్యాన్సర్'లను నివారించడానికి బాగా సహాయపడుతుంది. క్యాన్సర్ సెల్స్ అభివ్రుద్దిని నిరోధించగల నేచురల్ యాంటియాక్సిడెంట్ గా పనిచేస్తుంది.

ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది: టమోటోలోవిటమిన్ సి మరియు విటమిన్ కె' పుష్కలంగా ఉండటం వల్ల, రెండు పోషకాంశాలు ఎముకలను బలంగా ఉంచడానికి కావల్సి మరియు బోన్స్ టిష్యులను డ్యామేజ్ ను అరికట్టడానికి బాగా సహాయపడుతాయి.

కళ్ళకు: టమోటోల్లో ఉన్నవిటమిన్ ' కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు టమోటో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ లోపము వలన కలుగు రేచీకటి అభివృద్ధి నిరోధిస్తుంది.

మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది: టమోటో మన శరీరంలోని షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది అందువల్ల మధుమేహం కంట్రోల్ అవుతుంది. క్రెడిట్ టమోటోని మినిరల్స్ లో ఒకటైనక్రోమియం'దే. ఇది టమోటోని మంచి మన్నికైన పోషకాంశం.

ఎర్రగా పండుగా ఉండే టమోటోలను సలాడ్ రూపంలో తీసుకోండి. లేదా పచ్చివి తినండి. రెగ్యులర వంటకాల్లో ఉపయోగించుకోండి. కాబట్టి ఎర్రని టమోటో చూస్తూనే చటుక్కున లాగేసి కడిగే తినేసేయండి .....

No comments:

Post a Comment