Tuesday, June 11, 2013

జలుబు :














జలుబుకు వెల్లుల్లి ఔషధంలా పనిచేస్తుందంటారు. పెద్ద వెల్లుల్లిపాయను పై పొర తీసేసి నోట్లో ఉంచుకోవాలి.

అలా నోట్లో ఉంచుకున్న వెల్లుల్లిని మెల్లగా కొరుకుతూ దాని నుంచి వచ్చే రసాన్ని మింగుతుండాలి.

ఇలా మూడు నాలుగు గంటలకి సారి కొత్త వెల్లుల్లిపాయను నోట్లో ఉంచుకుని రసం మింగితే ఒక రోజులోనే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.


* జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

*
ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

*
పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

*
ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.

*
తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు మటుమాయం.

జలుబు సహజంగా 2 నుంచి 5 రోజుల మధ్య ఉంటుంది. విపరీతమైన జలుబు, దగ్గుతో కూడిన జలుబు వారం నుండి రెండు వారాల వరకు వుండవచ్చంటున్నారు వైద్యులు. జలుబు సోకిన వ్యక్తి ఎంతకాలము బాధ పడతారు అన్నది వారి వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తి పైన, జలుబుకు చెందిన వైరస్ రకాల పై ఆధారపడి వుంటుందంటున్నారు వైద్యులు.
--------------------------------------------------------------------------------------------

జలుబు తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం:

జలుబు ఉన్నప్పుడు, కొవ్వు పదార్ధాలు, మాంసము, పాల వుత్పత్తులు తక్కువగా తీసుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇలాంటి సమయంలో తాజా పళ్ళ రసాలను, కాయగూరలను ఆహారం రూపంలో అధికంగా తీసుకోవాలి.

మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకుంటే జలుబు నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది.

వేడి నీటి ఆవిరి పట్టడం వలన ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి. గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకొంటుంటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.










కాస్త చింతపండు గుజ్జు, టమోటో రసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.










చికిత్స చేస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది. చికిత్స చేయకపోతే ఏడురోజులకు తగ్గుతుంది... అనేది జలుబుకు సంబంధించి చెప్పే పాత సామెత. అంటే వైద్యం చేసినా, చేయకపోయినా జలుబుకానీ తగులుకుంటే వారం పాటు బాధపడక తప్పదు అనేదే సామెతలోని అంతరార్థం.

అంతా బాగానే ఉంది. మరి వారం రోజులపాటు జలుబు పెట్టే నరకయాతనతో భరించేదెలా... ? జలుబు బాధలు తగ్గేందుకు ఇంగ్లీషు వైద్యంలో ఇప్పుడు బేషైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే జలుబులాంటి కారణాలకు కూడా అదేపనిగా మందులు మింగుతూ కూర్చుంటే ఎలా... ? అని ప్రశ్నించేవారికోసం ఇవిగో కొన్ని చిట్కాలు...

వేడి పాలల్లో చిటెకెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త శొంఠి పొడి కలుపుకుని వేడి తగ్గకుండా చేస్తే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది. గిన్నెలో వేడి నీరు పోసి అందులో పసుపు కాస్త జంఢూబామ్ వేసుకుని ఆవిరిపడితే జలుబు వల్ల మూసుకుపోయిన ముక్కు వెంటనే తెర్చుకుంటుంది.

వీటితో పాటు తులసి, అల్లం రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే జలుబు తీవ్రత వెంటనే తగ్గుతుంది. గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితే జలుబు తగ్గుతుంది. ఇలా పైన చెప్పిన చిట్కాల్లో అవసరమైన వాటిని పాటిస్తే జలుబు తీవ్రత నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ వారం పదిరోజులు దాటినా జలుబు తీవ్రత తగ్గకుంటే వైద్యుని సమక్షంలో పరీక్షలు చేసుకోవడం మంచిది.




జలుబు చేయడం సర్వ సాధారణం. అయితే ప్రస్తుతం జలుబు అంటే స్వైన్ఫ్లూ లక్షణాలున్నాయోమోనని ఆందోళనకు గురికావడం సహజం. జలుబు చేసిన ప్రతివారికీ స్వైన్ఫ్లూ అనుకోవడం పొరపాటు. జలుబు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జలుబు వెంటనే మటుమాయమౌతుందంటున్నారు వైద్యులు.
-------------------------------------------------------------------------------------------------------

** జలుబుతో బాధపడుతుంటే యూకలిప్టస్ఆయిల్‌‌ను నుదుటిపైన, రొమ్ముపైన, వీపు, ముక్కుపైన రుద్దండి. తర్వాత కంటినిండా నిద్రించండి. దీంతో కాస్త ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

** జలుబుతో సతమతమౌతుంటే ప్రతి రోజూ విటమిన్‌-సి మాత్రలు ఒకటి చొప్పున వాడండి. రెండు వేసుకుంటేచాలు.

** మిరియాల చారు ప్రతి రోజూ ఉదయం రాత్రి త్రాగండి. జలుబుకు ఇది చాలా మంచిందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అలాగే విశ్రాంతి చాలా అవసరమంటున్నారు వారు.

** సొంఠి కాఫీ లేదా సొంఠి టీ సేవిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది.


* జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

*
ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

*
పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

*
ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.

*
తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు మటుమాయం.


** రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్నీటిలో రెండు నిమ్మకాయల రసం పిండి తగినంత పంచదార వేసుకుని త్రాగండి. ఇలా నాలుగు రోజులు సేవిస్తే జలుబు మటుమాయం అవుతుంది.

** అరకప్పు నీటిలో దాల్చిన చెక్క పౌడర్పావు చెంచా కలుపుకుని మరగబెట్టండి. ఇందులో చిటికెడు మిరియాలపొడి, ఒక చెంచా తేనె వేసి రోజూ రెండుమూడు సార్లు త్రాగండి. ఇలా సేవిస్తే జలుబు దూరమౌతుంది.

** అరలీటర్నీటిలో 100 గ్రాముల బెండకాయలు ముక్కలుగా తరిగి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటి ద్వారా వచ్చే ఆవిరిని పీల్చండి. జలుబు మటుమాయం అవుతుందంటు్న్నారు వైద్యులు.

** పసుపు కొమ్మును కాల్చి పొగ పీలిస్తే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.

** అరచెంచా మిరియాల పొడి, ఒక చెంచా బెల్లంపొడి కప్పునీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా సిప్చేయండి.

** కప్పు వేడి పాలలో అరచెంచా సుద్ధమైన పసుపు కలుపుకుని త్రాగండి. ఇలా ప్రతి రోజూ రెండు మూడుసార్లు త్రాగండి.


 * దాల్చిన చెక్కలో కరిగిపోయే పీచుతోపాటు ఇనుము, క్యాల్షియం, మాంగనీస్‌, సి, కె విటమిన్లు లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్సుగుణాలు ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతాయి. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాకుండా జలుబును కూడా దాల్చినచెక్క నివారిస్తుంది.* డయేరియా, పంటినొప్పి, కొలెస్ట్రాల్ను తగ్గించే శక్తీ దాల్చిన చెక్కకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయని వైద్యులు చెబుతుంటారు. అందుకే దీనిని కొన్నిరకాల అరోమా నూనెలు, రూం ఫ్రెషనర్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.* మహిళల్లో రుతు సంబంధ వ్యాధుల నివారణకు దాల్చిన దివ్య ఔషధంలా పని చేస్తుంది. దీన్ని తీసుకోవటంవల్ల రుతుస్రావం సరైన సమయంలో వచ్చేలా చేస్తుంది. గర్భదోషాలను కూడా మాయం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది మంచి ఔషధం. దాల్చిన చెక్కను ఉడికించి, పేస్టు చేసి దాంట్లో కాస్తనెయ్యి, పటికబెల్లం కలిపి తీసుకుంటే జిగట విరేచనాలను నియంత్రించవచ్చు.

** జలుబుతో ఇబ్బంది పడుతూ...శ్వాస పీల్చుతున్నప్పుడు ఛాతీలోనుంచి శబ్దం వస్తుంటే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో రెండు వెల్లుల్లి రేకులను చిదిమి వేసుకుని తాగండి. ఇలా మూడు రోజలు రెండుపూటలా సేవిస్తుంటే ఫలితం కనపడుతుందంటున్నారు వైద్యులు.

** దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి.

మిరియాలతో జలుబు పరార్








సాధారణంగా వర్షాకాలం లేదా చలికాలంలో జలుబు, దగ్గు రావడం సహజం.. దీని కారణంగా ఆయా కాలాల్లో ఒక్కోసారి శ్వాసను పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా అన్పిస్తుంది... అయితే మిరియాలతో సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

కొన్ని మిరియాలను పొడిగా దంచుకుని చక్కెరతో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతులో దరుదగా ఉన్నట్లు అనిపించడం గొంతు నెప్పి వంటి సమస్యలను నుంచి ఉపశమనం పొందవచ్చు... ఇలాగే మూడు పూటలా తీసుకంటే ఫలితం కనబడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు..

No comments:

Post a Comment