Drs Chandu
వర్షాకాలంలో పాటించవలసిన ఆరోగ్యం చిట్కాలు #
సాదారణంగా వర్షపు చినుకులు పడినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఈ
వర్షాల వల్ల వైరల్ జ్వరం, మెదడు వాపు, అలెర్జీలు వంటి పలు ఆరోగ్య సమస్యలు
పెరుగుతాయి. ఈ కాలంలో వైరస్ మరియు బాక్టీరియాలనుండి మనల్ని కాపాడుకుంటూ
ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించండి. ఈ చిట్కాలు పాటించుట వల్ల
మనము వర్షాకాలంను ఆస్వాదిస్తూ చాల వ్యాధులను నివారించుకోవచ్చు.
1)
కాచి చల్లార్చిన నీరు=ఈ వర్ష కాలంలో ఫిల్టర్ చేసిన మరియు బాయిల్డ్ చేసిన
వాటర్ ను మాత్రమే త్రాగటానికి ఉపయోగించాలి. క్రిముల దాడి నుండి
తప్పించుకోవటానికి టీ లేదా అల్లం టీ, నిమ్మకాయ టీ,వేడి కూరగాయల సూప్,మూలికా
టీ వంటి వాటిని త్రాగండి
2) ఆహారాల మీద ప్రత్యేక శ్రద్ద=పండ్లు మరియు
కూరగాయలు, ముఖ్యంగా ఆకు కూరలు తినే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఎందుకంటే వాటిమీద అనేక లార్వాలు , దుమ్ము మరియు పురుగులు ఉంటాయి. వీటిని
తొలగించుట కొరకు ఉప్పు నీటిలో 10 నిముషాలు ఉంచాలి. ఇలా చేయుట వలన
బాక్టీరియా నిరోధం జరుగుతుంది.
3)ఉడికించిన వాటికి ప్రాధాన్యత=ఈ కాలంలో పూర్తిగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా పచ్చి లేదా వండని ఆహారపు అలవాట్లు ఉంటే మీకు మీరే సమస్యలను ఆహ్వానిస్తున్నట్లే .
4) పండ్లు -కూరగాయలు=గరం-గరం బజ్జీలకు బదులుగా తాజాగా వండిన లేదా తాజా పండ్లు మరియు కూరగాయలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.
5) మసాలాలకు దూరం=వర్షాకాలం సమయంలో మన శరీరంనకు త్వరగా ఆహారం జీర్ణం
చేయడానికి కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మీ జీర్ణక్రియ మెరుగుపర్చే క్రమంలో
వెల్లుల్లి, మిరియాలు,అల్లం,పసుపు మరియు కొత్తిమీర వంటి ఆహారాలను
తీసుకోవాలి.
6) సూపులు=మాంసాహార ప్రేమికులు భారీ మాంసాహారం కాకుండా సూప్ మరియు తేలికపాటి భోజనం తీసుకోవాలి.
7) రోడ్డు పక్క తయారయ్యే వంటలు=వివిధ క్రిముల వల్ల అనేక వ్యాధులు
వస్తాయి. అందువలన ఈ కాలంలో సాధ్యమైనంతవరకు రోడ్డు మీద తయారయ్యే ఆహారాన్ని
తినటం మానాలి.
8) తాజాగా లేని లేదా మిగిలిపోయిన ఆహారాన్ని తినటం
మానివేయాలి., టాయిలెట్ సందర్శించిన తర్వాత, ఆహారం తీసుకున్నాక,ఆహారం
వండటానికి ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రత అవసరము.
9) దోమల నివారణకు= దోమలు, ఈగలు, బొద్దింకలు, చెదపురుగులు మొదలైన వాటిని
దూరంగా ఉంచటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిమి నిరోధకాలు,
క్రిమినాశకాలను ఉపయోగించండి. దోమల యొక్క ఉనికిని తగ్గించేందుకు వేప
,కర్పూరం లేదా లవంగాలను వాడండి.
No comments:
Post a Comment