Drs Chandu
వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు #
1) మీ జుట్టును పొడిగా ఉంచండి: సాధ్యమైనంత ఎక్కువ సమయం మీ జుట్టు పొడిగా
ఉంచేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మనం సుమారు 50-60 వెంట్రుకలను
కోల్పోతాము, కానీ వర్షాకాల సమయంలో మనకు తెలియకుండా 200 వెంట్రుకలను
కోల్పోతాము. ఇది అదనంగా జుట్టు రాలడ౦, చుండ్రు వంటి జుట్టు సమస్యలను
నివారించి మీ జుట్టు ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకోండి
2)
తేలికపాటి షాంపూ లను ఉపయోగించండి: మీరు చుండ్రు, జుట్టురాలడమే కాకుండా తల
జిడ్డుదనాన్ని కూడా కలిగిఉ౦డవచ్చు. అందువల్ల మీరు మీ జుట్టును ప్రతిరోజూ
తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి. ఆయిలీ జుట్టు కలవారు ప్రతిరోజూ షాంపూ
పెట్టడానికి వేరొక కారణం కూడా ఉంది, మీ జుట్టు వర్షాకాలంలో దెబ్బతినవచ్చు,
షాంపూ చేయడం వల్ల మాత్రమే మీ జుట్టు పరిమాణాన్ని పునరుద్దరించు కుంటుంది.
ప్రతిరోజూ మీ జుట్టు వర్షానికి తడిస్తే ప్రతిరోజూ షాంపూ పెట్టండి.
3)
ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన ఆహార పదార్ధం. అయితే, మీ
జుట్టు అందంగా కనిపించాలి అనుకుంటే, చేపలు, గుడ్లు, కారెట్లు, తృణధాన్యాలు,
ముదురు ఆకుపచ్చ కూరగయలు, చిక్కుళ్ళు, గింజలు, తక్కువ కొవ్వు ఉన్న పాలుత్పత్తుల వంటి ఎక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి.
4) కనీసం వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయడం : వారంలో ఒక సారి తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
5) పెద్ద పళ్ళ దువ్వేనను ఉపయోగించడం: పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనను
ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కలగ కుండా ఉంటుంది. చిక్కు సులభంగా
వస్తుంది.
6) జుట్టు తడిగా ఉన్నపుడు బిగి౦చకుండా ఉండడం: జుట్టు తేమగా
ఉన్నప్పుడు ముడి వేసుకోవడం వల్ల కేశాలు పెళుసుగా తయారవుతాయి. జుట్టు
రాలిపోవడానికి దారితీస్తుంది కనుక పూర్తిగా ఆరనివ్వండి.
No comments:
Post a Comment