Health
Thursday, June 27, 2013
గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమౌతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహాన్ని అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించ
ారు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడని, అందువల్లనే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు.
నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి నిరూపిస్తున్నారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి ఏర్పడుతుందని, దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగాలుగుతారని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.
గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది, గ్రహిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని, ఆవేశాలు, అరుపులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎంత మంచి మాటలు వింటూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగితే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుంది అని సూచిస్తున్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment