Drs Chandu
మీ శరీర చర్మం ప్రకాశవంతంగా , అందంగా కనిపించేందుకు చిట్కాలు #
1) ఒక చెంచా తేనెకు ఒక చెంచా విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేసి
ముఖానికి,శరీరానికి పట్టించాలి. అరగంట తర్వాత మసాజ్ చేస్తూ గోరు వెచ్చని
నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్నందిస్తుంది. అద్భుతమైన యవ్వనమైన
చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
2) అరటిపండు గుజ్జుకు, రెండు
చెంచాల ఓట్స్ పొడి మరియు రెండు చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి శరీరానికి
అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
3) ఒక
గుడ్డులోని సొన మరియు ఒక టేబుల్ స్పూన్ కివి జ్యూస్ మరియు ఒక చెంచా ఆలివ్
ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని
శుభ్రం చేసుకోవడం వల్ల విటమిన్ ఇ వల్ల మరింత ఎక్స్ ట్రా అందాన్ని
పొందవచ్చు.
4) మహిళల మేని మెరుగుకు ఈ విటమిన్ ఎంతో అవసరం. ప్రీరాడి
కల్స్ ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. లైటనింగ్ రాడ్‌గా పిలవ బడే ఈ
విటమిన్ అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. పొద్దుతిరుగుడు నూనె,
బాదం పప్పులు, పాలకూ,టమోటో, బొప్పా యి, ఆలివ్ నూనె వంటి వాటిలో ఈ విటమిన్
అత్యధికంగా లభిస్తుంది.
మూత్రాశయం
లో రాళ్ళు కరిగి పోవుటకు # మెంతి పిండి , ఉలవల చూర్నమ్ సమభాగాలలో
వేయించి ఒక స్పూను మోతాదు ప్రకారం ముల్లంగి ఆకు రసంతో రోజుకు 3 సార్లు
చొప్పున సేవిస్తే మూత్రాశయం లో రాళ్ళు కరిగి పోతాయి
పేను కొరుకుడు - బట్టతలకు # గురువింద గింజలను జీటి నూనెతో అరగదీసి పేనుకొరికిన ప్రాంతంలో మర్దన చేస్తే వెంట్రుకలు మొలుచును .
No comments:
Post a Comment