Thursday, September 26, 2013
Sunday, September 22, 2013
'పండ్లు తినండి. ఆరోగ్యంగా జీవించండి'
కొందరికి భోజనం చేస్తూనే పండ్లు తినడం అలవాటు. ఇది మంచిది కాదంటున్నారు
పోషకాహార నిపుణులు. కడుపు నిండుగా ఉన్నప్పుడు పండ్లు తింటే, అందులోని
పోషకవిలువలు శరీరానికి సరిగా అందవు. త్వరగా జీర్ణం కావు. అందుకే, భోజనానికి
కనీసం గంట ముందు పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. అప్పుడు పండ్లలోని పోషక
విలువలు పూర్తీగా శరీరానికి అందుతాయి. ఒకవేళ భోజనం చేశాక పండ్లు
తినాలనిపిస్తే.. రెండు గంటలు విరామం ఉండేలా చూసుకోవాలి.
పొద్దున్నే లేస్తూనే గ్లాసు మంచినీళ్లు తాగాక పండ్లు తింటే ఇంకా ఉత్తమం.
దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తి మరింత
మెరుగుపడుతుంది. మరికొందరు రకరకాల పండ్ల ముక్కల్ని సలాడ్‌లాగ కలుపుకు
తింటుంటారు.
జీర్ణశక్తి తక్కువగా ఉన్న
వాళ్లు, మధుమేహులు ఇలా చేయకపోవడమే మంచిది. ఇలాంటి సమస్యలేవీ లేకపోతే పండ్ల
ముక్కల మీద కాస్త ఉప్పు చల్లుకుని తినొచ్చు.
ఒక మనిషి వారంలో ఏ
రకమైన పండ్లు తినాలన్న సంగతికొస్తే - నాలుగు రోజుల్లో మూడు అరటి పండ్లు,
వారానికి ఒకసారి ఆపిల్, రెండు రోజులకు ఒకసారి సపోటా, బత్తాయి, బొప్పాయి
తినవచ్చు. ఏ సీజన్‌లో దొరికే పండును ఆ సీజన్‌లో తింటే బావుంటుంది.
వీటితోపాటు మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి
పడుకునే ముందు వీలైనంత వరకు పండ్లు తగ్గించడం మేలు.
Thursday, September 19, 2013
ఆలుతో ఆరోగ్యం
ఆలు తినేందుకు ఐదు కారణాలు...
- ఆలు అధిక పోషకాల్ని కలిగి ఉండడమే కాకుండా. సహజ శక్తిని అందిస్తుంది. సంక్లిష్ట కార్బొహైడ్రేట్‌ల (స్టార్చ్)ని అధికంగా కలిగి ఉంటుంది. ఆలులో తేలికగా శోషణమయ్యే కార్బొహైడ్రేట్‌లు ఉంటాయి. ఒకే బరువు ఉన్న బ్రెడ్‌తో పోలిస్తే ఆలూలో కార్బొహైడ్రేట్ రెండింతలు తక్కువగా ఉంటుంది. మినరల్స్, బి గ్రూప్ విటమిన్లు, బీటాకెరోటిన్, విటమిన్-సిలతో పాటు నాణ్యమైన ప్రొటీన్లతో నిండి ఉంటుంది ఆలు. ఇందులో ప్రొటీన్ ఏడు శాతం ఉండడమే కాకుండా ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమినో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరం తనంతట తానుగా తయారుచేసుకోలేనివి.
- ఆలూని ఉడికించిన పద్ధతి బట్టే కొవ్వు తయారవుతుంది. ఆలూని నూనెలో వేగించినపుడు, గ్రేవీల్లో వేసి ఉడికించినపుడు లేదా వెన్న, మీగడ వంటి వాటితో కలిపినప్పుడు మాత్రమే కొవ్వు పదార్థాల్ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఆలూని విడిగా ఉడికించుకుని తింటే కొవ్వు ఊసే ఉండదు.
- ఆలూ తినడం వల్ల హైపర్‌టెన్షన్ (అధిక రక్త పీడన సమస్యల్ని) తగ్గుతుంది. అరటిపండ్లతో పోలిస్తే ఆలూలో పొటాషియం మెండుగా ఉంటుంది. సోడియం చాలా తక్కువ ఉంటుంది. బ్రెడ్, అన్నంలతో పోలిస్తే ఆలూలో రక్తంలో చక్కెర శాతాన్ని పెంచే గుణం చాలా తక్కువ. అందుకని మధుమేహులు కూడా ఆలూని చక్కగా లాగించేయొచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలూని తినాలనుకున్నప్పుడు మీరు తీసుకునే ఆహారంలో తక్కువ కాలరీలు ఉండే ఇతర పదార్థాలు చూసుకోవాలి.
- పచ్చి బంగాళాదుంప రసంలో ఔషధ విలువలు మెండుగా ఉన్నాయి. ఈ రసం తాగితే జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తవు. అజీర్ణం, అల్సర్లు, కాలేయ సంబంధిత వ్యాధులు, మూత్రాశయంలో రాళ్లు, మల బద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఆలు మంచి యాంటాసిడ్‌గా పనిచేస్తుంది.
- విటమిన్ సి, బి6, ఐరన్, విటమిన్ల ప్యాకేజి ఆలు. ఇందులో యాంటాక్సిడెంట్‌లు కూడా బాగానే ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను మరమ్మత్తు చేయడమే కాకుండా నాశనం కాకుండా కాపాడతాయి కూడా'' అని చెప్పారు ఇషి.
ఆరోగ్యంగా తినేందుకు
ఆరోగ్యకరమైన పద్ధతిలో ఆలుని ఎలా తినాలి... అని ఆలోచిస్తున్నారా. అందుకు కొన్ని సూచనలు చేశారు న్యూట్రిషనిస్ట్ రాఖీ.
-ఆలుని నూనె, వెన్నల్లో వేసి లేదా వేరే కూరలతో కలిపి వండుకుని తినడాన్ని మానేయండి. నీళ్లలో లేదా ఆవిరికి ఉడికించో లేదా గ్రిల్, రోస్ట్, బేక్ చేసి తినండి.
- కారంకారంగా తినడాన్ని ఇష్టపడే వాళ్లు ఆలుని మొదట మసాలా దినుసులతో కలిపి నూనె వేయకుండా వేగించి తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుని తినొచ్చు.
- ఆలూని తొక్క తీయకుండా తినాలి. ఎందుకంటే తొక్కలో పీచు, ఫ్లేవనాయిడ్స్, ఇతర పోషకాలు ఉంటాయి. ఆలూ పైన టాపింగ్‌కి వాడే పదార్థాల్లో కొవ్వు, ఉప్పు, కాలరీలు తక్కువగా ఉండాలి. చిప్స్, ఫింగర్స్ వెంట పడడం ఆపేసి ఆమె చెప్పిన పద్ధతిలో ఆలు తిని ఆరోగ్యంగా ఉండండి.

కరివేపాకు
కరివేప లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ,
పులిహోరలోనూ కరివేప లేకపోతే రుచే రాదు. అయితే కరివేప వల్ల వంటకాలకు రుచి,
సువాసన మించి దానివల్ల ఉపయోగాలు లేవనుకుంటే అది పొరపాటు. కరివేపలో ఎన్నో
విధాలైన ఔషధ విలువలున్నాయి. అవి మనకెంతవరకు తెలుసో ఒకసారి చెక్ చేసుకుందాం.
1. కరివేపను కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయని తెలుసు.
2.కరివేప, వేప కలిపి ముద్దగా నూరి ఒక స్పూను ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.
3.బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపను విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుందని తెలుసు.
4.కరివేపను మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగానూ మానుతాయని చదివారు.
5.ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేప, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
6.కరివేప రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయని చదువుకున్నారు.
7.నీళ్లవిరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయని తెలుసు.
8.తేనెటీగ, తుమ్మెద వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి అవి కుట్టిన ప్రదేశంలో రాస్తే బాధ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుందని తెలుసు.
9.మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేప రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటూంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని తెలుసు

Monday, September 9, 2013
దంత సమస్యలు
సులభంగా నోట్లో మిగిలిపోకుండా పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా నేరుగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈ మధ్య అందరూ ఎక్కువగా తీసుకుంటున్న జంక్ఫుడ్ పంటిపైన, పంటి సందుల్లోనూ అతుక్కుపోతుంటుంది.
సాధారణంగానే
నోటిలో
ఉండే
బ్యాక్టీరియా
ఈవిధంగా
ఇరుక్కున్న
ఆహారంతో
కలిసిపోయి
హానికర
రసాయనాలను
విడుదల
చేస్తుంది.
దాంతోనే
అన్నిరకాల
దంత
సమస్యలూ
మొదలవుతాయి.
కాబట్టి
తీసుకునే
ఆహారంలో
పీచు
పదార్థాలు
ఎక్కువగా
ఉండేలా
జాగ్రత్త
పడాలి.
ఇక రెండవ విషయం... మన ఇంట్లో రోజువారీ శుభ్రత... మనం రోజూ చేసే బ్రషింగ్ గురించి. ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడిపోతున్నామని
ఫీలైపోతుంటారు.
కొంతమంది
అతిజాగ్రత్తకు
పోయి
పళ్లని
15 - 3 0 నిమిషాలపాటు
తోమేస్తుంటారు.
ఇది
కూడా
మంచిది
కాదు.
రోజూ
నిద్రలేవగానే,
ఆ తర్వాత పడుకునే ముందు రెండుసార్లు కేవలం నాలుగు నిమిషాలపాటు తప్పనిసరిగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగని పళ్లని అడ్డదిడ్డంగా తోమేయడం, బలంగా రుద్దడం సరికాదు. ఖరీదైన పేస్టు, చిత్రమైన బ్రష్‌ల మీద కాకుండా బ్రష్ చేసుకునే విధానంపైన దృష్టిపెడుతూ శాస్త్రీయపద్ధతిలో
వీలైతే
అద్దంలో
చూసుకుంటూ
బ్రష్
చేసుకుంటే
మంచి
ఫలితం
ఉంటుంది.
అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్ల మధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతో శుభ్రపరచుకోవాలి.
టూత్పిక్స్, పిన్నులు లాంటి వాటితో కెలక్కూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటుగా మౌత్వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కనీసం రోజుకొక్కసారి వాడాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచవచ్చు.
ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారి ఇంటిల్లిపాదీ డెంటిస్ట్ను కలిసి చెకప్ చేయించుకోవటం, డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకోవడం అవసరం. రెగ్యులర్గా చేసుకునే పంటి క్లీనింగ్ (స్కేలింగ్), పాలిషింగ్ లాంటి చికిత్సల వల్ల దంతసమస్యలను అరవై శాతం వరకు నివారించవచ్చు.
Thursday, September 5, 2013
కొలెస్ట్రాల్ ముప్పునకు చెక్ ....!
మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. మాంసాహారం బదులుగా చేపలు తీసుకోవచ్చు.
ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 5 నుంచి 10గ్రాముల ఫైబర్(పీచు పదార్థాలు) ఉండేలా చూసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో ఓట్మీల్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి.
కొలెస్ట్రాల్
ముప్పును
తప్పించుకోవాలంటే
క్రమం
తప్పకుండా
కొలెస్ట్రాల్
పరీక్షలు
చేయించుకోవాలి.
దీనివల్ల
కొలెస్ట్రాల్
ఏ స్థాయిలో ఉంది, కొలెస్ట్రాల్ వల్ల ముప్పు ఏర్పడే అవకాశం ఉందా అనే విషయాలు తెలుస్తాయి.
తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకుంటే కొవ్వు దరిచేరకుండా ఉంటుంది.
నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్శాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ను వాడితే మరీ మంచిది.
ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి
వ్యాయామం
బాగా
ఉపకరిస్తుంది.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి వారంలో రెండు, మూడుస్లార్లు చేపను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అదుపులో ఉండటానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది.
సాయంత్రం సమయంలో ఆకలిగా ఉన్నట్లయితే నట్స్ తీసుకోండి. మిర్చి బజ్జీకి బదులుగా నట్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవ కాశం తగ్గిపోతుంది. కడుపు కూడా నిండుతుంది.
బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉంటే కొలెస్ట్రాల్ స్థాయి నార్మల్గా ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఒబేసిటీతో బాధపడుతున్నట్లయితే
బరువు
తగ్గడానికి
వెంటనే
ప్రయత్నాలు
మొదలుపెట్టండి.
పై అంతస్తుకు వెళ్లాలనుకుంటే లిఫ్ట్ను ఉపయోగించకండి. మెట్లను ఉపయోగించండి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి ఇది మంచి మార్గం. శారీరక వ్యాయామం కోసం నడక చాలా మంచిది. చీటికి మాటికి టూ వీలర్ తీయకుండా నడక సాగించండి.
మీరు టీ ప్రియులా? రోజూ నాలుగైదు సార్లు టీ తాగుతారా? అయితే రెగ్యులర్ టీకి బదులుగా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది.
మెనూలో కూరగాయాల భోజనం ఉండేలా చూసుకోండి. వివిధ రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
అవిసెలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించుకోవచ్చు.
అవిసెల్లో(ఫ్లాక్స్ సీడ్) ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
రోజూ సరిపడా సమయం నిద్రపోవాలి. మంచి నిద్ర వల్ల శరీరం తిరిగి పునరుత్తేజం అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ముప్పు తప్పుతుంది.
కొలెస్ట్రాల్
సంబంధిత
సమస్యలతో
పాటు
అనేక
సమస్యలకు
మూల
కారణం
స్మోకింగ్.
పొగతాగడం
వల్ల
మంచి
కొలెస్ట్రాల్
తగ్గిపోతుంది.
ఫలితంగా
గుండె
జబ్బులు
వచ్చే
అవకాశం
పెరుగుతుంది.
కాబట్టి
స్మోకింగ్ను మానేయండి.
వెల్లుల్లిలో
ఆర్గనో
సల్ఫర్
అనే
పదార్థం
ఉంటుంది.
ఇది
రక్తంలో
చెడు
కొవ్వు
శాతం
పెరగకుండా
కాపాడుతుంది.
అంతేకాకుండా,
కొలెస్ట్రాల్ను కాలేయానికి రవాణా చేస్తుంది. అందుకే రోజు రెండు మూడు రెబ్బల వెల్లుల్లి తీసుకోండి.
రోజూ కార్డియో ఎక్సర్సైజులు చేయండి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కొలెస్ట్రాల్తో వచ్చే ముప్పుకు చెక్ పెట్టవచ్చనడంలో సందేహం లేదు!
Tuesday, September 3, 2013
కీళ్లనొప్పులకు సరైన విరుగుడు
ితాన్ని, ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తోంది. అందుకే జీవన విధానంలో వచ్చిన అనేక మార్పులే కీళ్ల నొప్పులకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలోని మార్పు. సరైన సమయంలో భోజనం చేయకపోవటం, ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినటం, పోషక విలువలున్న ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవటం, సరైన సమయంలో నిద్రపోకపోవడం(స్వప్న విపర్వం- అంటే పగలు నిద్రపోవడం, రాత్రి మేల్కోవటం) కూడా కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా కీళ్ల నొప్పులకు కారణాలుగా చెప్పుకోవచ్చు.
కీళ్ల నొప్పుల్ని ఆయుర్వేద వైద్య విధానంలో మూడు విధాలుగా వర్ణించారు. అవి సంధివాతం, ఆమవాతం, వాతరక్తం.
సంధివాతం: దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్గా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. త్రిదోష పరంగా చూసినట్టయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్ల నుండి శబ్దాలు వినిపిస్తాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేష కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వల్ల నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ఈ సమస్య 50-60 సంవత్సరాల వారికి వస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువ.
ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సొరియాసిస్ లాంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తుంటాయి. ఆహారంలో పోషక విలువల లోపం వల్ల కూడా(విటమిన్-డి, కాల్షియం) ఈ వ్యాధి వస్తుంది. ఎక్కువగా ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించడం, అధిక బరువులు మోయడం వల్ల, ఎక్కువ సమయం కంప్యూటర్స్ ముందు గడపడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఆమవాతం: రుమాటాయిడ్ ఆర్థరైటిస్ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ఆమ- వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది మానసిక ఒత్తిడి వల్ల, ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, వ్యాయామం చేయకపోవటం, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలు ఈ సమస్యకు దారితీస్తాయి.
ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు, నొప్పి, మందజ్వరం, కీళ్లు బిగుసుకుపోవటం, ఆకలి మందగించటం, మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలోనూ కనిపిస్తుంది.
వాతరక్తం: ఇది మధ్య వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మద్యం తీసుకోవడం, అతిగా మాంసాహారం తీసుకోవడం, పులుపు, ఉప్పు, మసాలాలు, ప్రిజర్వేటిస్, కెమికల్స్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అలాగే శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వంటి కారణాల వల్ల కూడా వాతం, రక్తం సమస్యలుత్పన్నమవుతాయి. ఈ రెండూ కలిసి వాతరక్త సమస్యగా మారుతుంది. క్లినికల్గా చూసినట్టయితే, ఈ సమస్యలో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి. లక్షణాలు: వాపు, నొప్పి కాలి బొటనవేలు నుండి ప్రారంభమై తర్వాత కీళ్లకు వ్యాపిస్తాయి. ఈ సమస్యలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. పరిష్కార మార్గాలు: - నిదాన పరివర్జనం - ఔషధ సేవన - ఆహార-విహార నియమాలు. ఈ మూడు పద్ధతుల ద్వారా వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. నిదాన పరివర్జనం: వ్యా«ధి కారణాలను పాటించకుండా ఉండటం ఇందులో ప్రధానమైనది. ఉదా: పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొవటం వంటివి వదిలిపెట్టటం. ఆహార-విహార నియమాలు: సరైన సమయానికి ఆహారం తీసుకోవటం. వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, వ్యాయామం, సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవటం లాంటి నియమాలు పాటించాలి. ఔషధ సేవన: ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఒకటి శమనం, రెండోది శోధనం. శమనం: వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. శోధనం: అంటే..పంచకర్మ. పంచకర్మలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు)తరువాత వమన, విరేచన, వస్తి(ప్రధాన కర్మలు). ఆ తరువాత పశ్చాత్కర్మలు చేయించవలసి ఉంటుంది. ఇవి కాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, ఓమ వస్తి, పత్రపోడలీ, వాలుకాస్వేద మొదలైన బాహ్య చికత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Subscribe to:
Posts (Atom)