ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి
ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా
ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి.
యాపిల్ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో
పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని
వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్, యాంటి మైక్రోబియల్
గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును
నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం
చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900
మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.
ఉసిరితో ఎంతో మేలు :
ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ
సమస్యలను తొలిగిస్తుంది.
ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.
లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
విటమిన్ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధితఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment