Sunday, September 22, 2013

'పండ్లు తినండి. ఆరోగ్యంగా జీవించండి'

కొందరికి భోజనం చేస్తూనే పండ్లు తినడం అలవాటు. ఇది మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. కడుపు నిండుగా ఉన్నప్పుడు పండ్లు తింటే, అందులోని పోషకవిలువలు శరీరానికి సరిగా అందవు. త్వరగా జీర్ణం కావు. అందుకే, భోజనానికి కనీసం గంట ముందు పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. అప్పుడు పండ్లలోని పోషక విలువలు పూర్తీగా శరీరానికి అందుతాయి. ఒకవేళ భోజనం చేశాక పండ్లు తినాలనిపిస్తే.. రెండు గంటలు విరామం ఉండేలా చూసుకోవాలి.
పొద్దున్నే లేస్తూనే గ్లాసు మంచినీళ్లు తాగాక పండ్లు తింటే ఇంకా ఉత్తమం. దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తి మరింత మెరుగుపడుతుంది. మరికొందరు రకరకాల పండ్ల ముక్కల్ని సలాడ్‌లాగ కలుపుకు తింటుంటారు.
జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్లు, మధుమేహులు ఇలా చేయకపోవడమే మంచిది. ఇలాంటి సమస్యలేవీ లేకపోతే పండ్ల ముక్కల మీద కాస్త ఉప్పు చల్లుకుని తినొచ్చు.
ఒక మనిషి వారంలో ఏ రకమైన పండ్లు తినాలన్న సంగతికొస్తే - నాలుగు రోజుల్లో మూడు అరటి పండ్లు, వారానికి ఒకసారి ఆపిల్, రెండు రోజులకు ఒకసారి సపోటా, బత్తాయి, బొప్పాయి తినవచ్చు. ఏ సీజన్‌లో దొరికే పండును ఆ సీజన్‌లో తింటే బావుంటుంది. వీటితోపాటు మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు వీలైనంత వరకు పండ్లు తగ్గించడం మేలు.

No comments:

Post a Comment