Sunday, September 1, 2013

ఆరోగ్యానికి రాగులు మంచి ఆహారం

మిల్లెట్ లేదా రాగులు అని సాధారణంగా రెగ్యులర్ గా పిలుస్తుంటారు. వీటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది మరియు బంక అనిపించదు. ఎవరైతే గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు.
రాగులను అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా ఉంది. రాగులు చాలా పుష్టికరమైన ధాన్యం మరియు ఒక మంచి ఆరోగ్య నిర్వహణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ద్రవయాసిడ్ ను పెంచుతుంది. అందువల్ల మూత్రపిండాల్లో రాళ్ళు (మూత్రమార్గంలో రాళ్ళు )ఉన్నవారికి వీటిని తినమని సలహా ఇవ్వలేదు.
రాగుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు తగ్గడానికి :
రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.
ఎముకల ఆరోగ్యం కోసం రాగి:
రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.
మధుమేహగ్రస్తులకు:
మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ జీర్ణప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.
హై కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి :
రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.
అనీమియా(రక్తహీనత):
రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం. రాగిని తీసుకోవడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది.
ప్రోటీన్/అమైనో ఆమ్లాల కోసం రాగులు:
రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
వయస్సును తగ్గిస్తుంది :
మిల్లెట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది.
రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు మరియు పరిణతి వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడుతాయి. అధిక రక్తపోటు నివారిణిగా: రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం,అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్ వంటిది.
గుండె ఆరోగ్యానికి :
కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.

No comments:

Post a Comment