Thursday, September 19, 2013

కరివేపాకు

కరివేప లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ, పులిహోరలోనూ కరివేప లేకపోతే రుచే రాదు. అయితే కరివేప వల్ల వంటకాలకు రుచి, సువాసన మించి దానివల్ల ఉపయోగాలు లేవనుకుంటే అది పొరపాటు. కరివేపలో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. అవి మనకెంతవరకు తెలుసో ఒకసారి చెక్ చేసుకుందాం.
1. కరివేపను కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయని తెలుసు.
2.కరివేప, వేప కలిపి ముద్దగా నూరి ఒక స్పూను ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.
3.బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపను విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుందని తెలుసు.
4.కరివేపను మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగానూ మానుతాయని చదివారు.
5.ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేప, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
6.కరివేప రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయని చదువుకున్నారు.
7.నీళ్లవిరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయని తెలుసు.
8.తేనెటీగ, తుమ్మెద వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి అవి కుట్టిన ప్రదేశంలో రాస్తే బాధ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుందని తెలుసు.
9.మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేప రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటూంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని తెలుసు

No comments:

Post a Comment