రక్త
దానం (Blood donation) అనేది దాదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ కోసం
ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు.ఒకరి రక్తం
మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి (emergency) ఎప్పుడు కలుగుతుంది?
ఎప్పుడయినా సరే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటె ఎక్కువ hemoglobin ఉంటే ఆ
వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా
సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటె తక్కువ hemoglobin ఉంటే అది రక్తం
ఎక్కించవలసిన పరిస్థితి. అంతే కాని ఆపరేషను చేసినప్పుడల్లా రక్తం
ఎక్కించవలసిన పని లేదు.
ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా
పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో
పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడ కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ
సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = ఆర్ధ లీటరు)
దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే సుమారు 12 యూనిట్లు ఉంటుంది.
ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించిన
పరిస్థితి రావచ్చు.ఏటా మన రాష్ట్రంలో 1.2 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, అందుబాటులో ఉన్నది కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే.మానవ రక్తానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. రక్తదానం చేయడమం టే ఓ ప్రాణాన్ని కాపాడడమే.ప్రతీ పది నిముషములకు మన రాష్ట్రంలో ఎక్కడోచోట ఒకరికి రక్తం అవసరమ వుతుంది. ప్రతి రోజూ కనీసం 38,000 మంది రక్తదాతల అవసరం ఉంది.
అత్యధికంగా కోరుకునే రక్తం ‘ఒ’ గ్రూప్ , మన రాష్ట్రంలో ఏటా కొత్తగా 2.5 లక్షల మంది క్యాన్సర్ బాధితులుగా తేలుతున్నారు.కెమోథెరపీ చికిత్స సందర్భంగా తరచూ వారికి రక్తం అవసరం ఉంటుంది.రక్తదానం ఎంతో సురక్షిత ప్రక్రియ.ప్రతీసారి కూడా స్టెరెైల్ నీడిల్‌ను ఉపయోగిస్తారు. ఒకసారి ఉపయోగించిన దాన్ని మళ్ళీ ఉపయోగించరు.
రిజిస్ట్రేషన్, మెడికల్ హిస్టరీ, డొనేషన్, రిఫ్రెష్‌మెంట్ అనే నాలుగు తేలిక పాటి దశల్లో రక్తదానం పూర్తవుతుంది
రక్తదానం చేసే వారికి ముందుగా టెంపరేచర్, బీపీ, పల్స్, హిమోగ్లోబిన్
తదితర పరీక్షలు చేస్తారు. ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలిగ్గా
పూర్తయ్యేవే.రక్తదాన ప్రక్రియ పావుగంటలో పూర్తవుతుంది.
మన శరీరంలో
10 - 12 యూనిట్ల రక్తం ఉంటే, సుమారుగా 1 యూనిట్ రక్తా న్ని దానం
చేయవచ్చు. దాని వల్ల దాత శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఆరోగ్యవంతుడెైన దాత ప్రతీ 56 రోజులకు ఒకసారి ఎరర్రక్త కణాలను డొనేట్ చేయవచ్చుఆరోగ్యవంతుడెైన దాత కనీసం 7 రోజుల విరామంతో సంవత్సరానికి 24 సార్లు ప్లేట్‌లెట్స్ దానం చేయవచ్చు.రక్తానికి హెచ్‌ఐవీ, హెపటైటిస్, ఇతర అంటువ్యాధుల సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాతే దాన్ని అవసరమైన వారికి ఎక్కిస్తారుమన శరీరం మొత్తం బరువులో రక్తం బరువు 7 శాతం దాకా ఉంటుంది.
రక్తం నుంచి ఎరర్రక్తకణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా, క్రయోప్రిసిపిటేట్
అనే భాగాలను విడదీసి ఎవరికి ఏది అవసరమో వారికి అది అందిస్తారు. ఒక్కసారి
రక్తదానంతో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడవచ్చు. డొనేట్ చేసిన
ప్లేట్‌లెట్స్‌ను సేకరించిన ఐదురోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుందిమీరు
గనుక 18 ఏళ్ళ వయస్సులో రక్తదానం చేయడం ఆరంభిస్తే, 60ఏళ్ళు వచ్చేసరికి మీరు
30 గ్యాలన్ల రక్తాన్ని దానం చేయవచ్చు. కనీసం 500 మంది ప్రాణాలు
కాపాడవచ్చు.దేశంలో 7 శాతం మంది మాత్రమే ‘ఒ’ నెగెటివ్ కలిగి ఉన్నారు.
వారి రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చు. గ్రహీత గ్రూప్ తెలియని
పరిస్థితుల్లో, అప్పుడే పుట్టిన శిశువులకు రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు
ఈ గ్రూప్ రక్తం అవసరం ఉంటుంది.దేశంలో కనీసం 35 శాతంమంది ‘ఒ’ పాజిటివ్ గ్రూప్‌ను కలిగి ఉన్నారు. రక్తంలోని ప్రధాన గ్రూప్‌లు ఎ,బి, ఎబి, ఒదేశంలో 0.4 శాతం మంది ఏబి- బ్లడ్‌గ్రూప్‌ను కలిగి ఉన్నారు. వీరి రక్తంలోని ప్లాస్మాను ఎవరికైనా ఉపయోగించచ్చు.రక్తాన్ని దానం చేసే 3 గంటల ముందు మంచి భోజనాన్ని తీసుకోండి. దానం చేసిన
తరువాత మీకిచ్చిన ఉపాహారములను తీసుకోండి, మీరు వాటిని తీసుకోవడం ముఖ్యం.
తరువాత మంచి భోజనాన్ని తీసుకోవడం మంచిది
దానం చేసే రోజు ముందు పొగ త్రాగడం మానండి. దానం చేసిన 3 గంటల తరువాత మీరు పొగ త్రాగవచ్చు
దానం చేసే 48 గంటల ముందు మీరు ఆల్కహాలు సేవించి ఉంటే, మీరు దానం చేయడానికి అర్హులు కారు.
పూర్తి వివరాలకు , మీ సందేహాలకు ఈ చిరునామాలో సంప్రదించండి
Dr S Chandu
phone : 9440017115
Email : drschandu@dr.com , drschandu@doctor.com
Institute Of Transfussion Medicine & Research
phone : 040 - 23300352, 23328956, 23319491
Nims Backside Compound, Road No 1,
Banjara Hills, Hyderabad - 500034
No comments:
Post a Comment