ఉరుకుల పరుగుల జీవన విధానం వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం మందిలో స్థూలకాయం
పెరిగింది. దాన్ని తగ్గించుకోవడానికి అన్వేషణ పెరిగింది. అందం, ఆరోగ్యం
పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నప్పుడు మొదట వినపడే
మాట, 'మొలకలు తినండి' అనే! ఆ తరువాత పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు...
వగైరా వగైరా. మొలకలతో వంటకాలు, మొలకలతో సలాడ్‌లు చేసుకోవడం, తినడం ఇటీవల
పెరిగాయి. మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి
సోపానాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి.
కేలరీలు పెరగవు. ఇంతకన్నా స్లిమ్‌గా వుండాలనే వారికి మరేం కావాలి? మొలకలు
ఆరోగ్యకరమే! కానీ, ఏ విధంగానో తెలుసుకోవాలిగా! మొలకలు పోషకాహారంగా
ఎల్లప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ముల్లంగి, ఆల్ఫాల్ఫా, క్లోవర్,
సోయాగింజలు, బ్రఖోలి అద్భుతమైన మాంసకృతులను కల్గి విస్తృత శ్రేణిలో వివిధ
పోషకాహారాలతో చక్కటి ఆరోగ్యాన్ని కల్గించడానికి సహాయపడతాయి. మొలకల వల్ల
అత్యవసర వైద్యసంబంధ లాభాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మొలకలు మనల్ని
కొన్ని రకాల వ్యాధుల నుండి కాపాడే సామర్థ్యం కల్గి ఉన్నాయని కనుగొన్నారు.
మొలకలు తిన్నందు వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు క్రింద
తెలపబడ్డాయి: సమృద్ధిగా అత్యవసర పోషకాలు: మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి,
విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్,
ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా
ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా
ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ
స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకు, మొలకెత్తిన తర్వాత గింజలు చాలావరకు విటమిన్ ఎ
ఎనిమిది రెట్లు పెరుగుతుంది. ఎంజైముల అద్భుతమైన మూలాలు: మొలకలలో మన
శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి.
ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్టపోతాము. అందువల్ల తాజా
మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి. అధిక మాంసకృతులు: మొలకలలో
మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న వాస్తవం చాలామందికి తెలియదు.
నిజానికి వీటిలో 35 శాతంవరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు
జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల
మాంసాల వలన వచ్చే కొవ్వును, కోలెస్టరాల్ను, క్యాలరీలను తగ్గిస్తుంది.
ఎక్కువగా శాకాహారం ఇష్టపడే వారికి, శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు
చేయబడ్డాయి. తేలికగా జీర్ణమౌతాయి: మొలకలలో మీరు ఇష్టపడే మరొక విషయం అవి
ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలను తినడం జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య
ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా
ఉత్తమమైనవి. బరువు తగ్గడానికి ఎంతో మంచివి: మొలకలలో పీచు ఎక్కువ స్థాయిలో
ఉండి, క్యాలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గించుకొనే ప్రణాళికకు ఎంతో
సహాయకారిగా ఉంటాయి. మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే
పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం
మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి
ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్ లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు
మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అందువల్ల మీ రోజువారీ ఆహార
ప్రణాళికలో మొలకలను జత చేయండి. మొలకల్లో కొవ్వు వుండదు. ప్రోటీన్లకు
మొలకలు పెట్టింది పేరు. సెనగలు, పెసలు, సోయా, రాజ్‌మా, బఠానీ ఇవన్నీ మొలకలు
తయారు చేసుకోవడానికి మార్గాలే! గర్భిణులు మొలకలు తింటే వారికే కాదు,
పుట్టే బిడ్డకూ ఆరోగ్యం. మొలకలు జీర్ణమవడానికి పట్టే సమయం తక్కువ. యాంటీ
ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం. ఫైబర్, ఐరన్, నియాసిన్, కేల్షియమ్
-ఇవన్నీ మొలకల్లో పుష్కలం. శరీర కణాలకు మొలకలు చాలా మేలు చేస్తాయి.
కేన్సర్‌ను నిరోధించగల శక్తి మొలకల్లో ఉంది. మొలకల్లో లభ్యమయ్యే విటమిన్
బి, డి శరీరానికి చాలా అవసరం. ఇందులోని ఫాస్పరస్ పళ్లకు, ఎముకలకు ఉపయోగ
పడుతుంది.
No comments:
Post a Comment