సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము.
వేసవి రాగానే చల్లని పానీయాల వైపు మనసు మళ్ళుతుంది.శీతల పానీయాలు
ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ క్రింది సహజ పోషకాలు ఇచ్చే పానీయాలను
సేవిద్దాము.
1) కొబ్బరినీరు: ఇందులో 5 కీలక electrolights పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,సోడియం,కాల్షియం లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.
2) మజ్జిగ: దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర కారక బ్యాక్టీరియా వలన
వ్యాధి నిరోధక శక్తి పెరుగును.ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను త్వరగా
జీర్ణం చేయును.ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12 లభిస్తాయి.
3) సబ్జా నీరు: మహిళలకు అవసర మయ్యె పాలేట్, నియాసిన్, చర్మాన్నిఅందంగా
ఉంచే విటమిన్ E అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న వ్యర్థాలను
తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
4) పుచ్చకాయ : గుండెజబ్బులు రాకుండా చేసే పొటాషియం సమృద్ధిగా
ఉంటుంది.విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే LYKOPIN సూర్యరశ్మి లోని
U.V కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
5) తాటి ముంజలు :6 అరటి
పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో ఉంచి
కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక
శక్తిని పెంచుతుంది.
6) నిమ్మరసం: సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది.విటమిన్ సి ఎక్కువ
7) చెరుకు రసం: ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం
మూలకాలుంటాయి. ఇవి రొమ్ము ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర
పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.
8) రాగి జావ: ఇది మధుమేహం, కీళ్ల నొప్పుల, acidity ని తగ్గిస్తుంది.
ఈ పానీయాలను సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.
No comments:
Post a Comment