మృదువైన శిరోజాల కోసం ఈ చిట్కాలు పాటించండి. మన వంటింట్లో ఉండే మెంతులు మన శిరోజాలకు ఎంతగానో మేలు చేస్తాయి.
జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను నివారించడానికి పావు
కప్పు మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి, ఉదయాన్నే పెరుగుతో
సహా రుబ్బుకుని తలకు పూతలా వేసుకుని అరగంట తర్వాత తలారా స్నానం చేయాలి.
దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలను చాలావరకూ తగ్గించవచ్చు.
అలాగే తలలో ఏవైనా ఇన్‌ఫెక్షన్లు ఉంటే అలాంటి వాటిని తగ్గించడానికి తలకు
వేప నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలకు వేపాకును మెత్తగా నూరి
పట్టించినా కూడా సమస్యను నివారించవచ్చు. గోరింటాకును ఇలా వాడినా కూడా మంచి
ఫలితం ఉంటుంది.
అలాకాకున్నా వేపాకుల్ని గిన్నెలో సగం వరకూ నీళ్లు
తీసుకుని అందులో వేపాకుల్ని వేసి మరిగించి, బాగా చల్లారిన తర్వాత వడగట్టి,
ఆ నీటితో తలను కడుక్కున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలే సమస్యను
తగ్గించడానికి అరటిపండు గుజ్జును తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే
జుట్టురాలే సమస్య తగ్గుతుంది.
కలబంద గుజ్జును కూడా ఇలా తలకు
పట్టిస్తే జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. ఇంకా తలస్నానం చేసేముందు
కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా
మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి జుట్టు
కుదుళ్లు గట్టిపడతాయి.
No comments:
Post a Comment