Wednesday, September 30, 2015

అందమైన అధరాల కోసం..


లేత గులాబీరంగు పెదాలు ముఖారవిందాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. పరిసరాల ప్రభావం, ఎండ, జీవన విధానంలోని మార్పులు, రసాయనాలతో చేసిన లిప్‌స్టిక్స్‌ వాడటం, సిగరెట్లు కాల్చడం.. వంటి చర్యల వల్ల పెదాలు నల్లగా మారిపోతాయి. నల్లగా ఉన్న పెదాల్ని లేత గులాబీరంగులోకి మారాలంటే ఇంట్లోనే కొన్ని సులభమైన ప్రకృతి చికిత్సలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.
  •  ఒక టీ స్పూన్‌ చల్లని పాలల్లో చిటికెడు పసుపు కలిపి రోజూ పెదాలపై నెమ్మదిగా రుద్దుతుంటే తిరిగి పెదాలు సహజరంగులోకి వచ్చి అందంగా కనపడతాయి. 
  •  ఒక టీ స్పూన్‌ బాదం ఆయిల్‌, సమంగా నిమ్మరసం కలిపి పెదాలపై రాసి పూర్తిగా ఆరిపోయే వరకూ ఉంచి నీటితో కడగాలి. ఇది పెదాలపై ఉన్న మురికిని నల్లని పొరలను శుభ్రపరచి అందంగా తీర్చిదిద్దుతుంది. 

  •  చాలా ఏళ్ల నుంచి బీట్‌రూట్‌ రసాన్ని పెదాలకు మంచి రంగు రావడానికి ఉపయోగిస్తున్నారు. బీట్‌రూట్‌ రంగు ఎర్రగా ఉండటం వల్ల పెదాలకు సహజమైన రంగు కలిగిస్తుంది. 
  •  తాజాగా ఉన్న క్యారెట్‌ జ్యూస్‌లో దూదిని తడిపి పెదాలకు రాయడం వల్ల కూడా ఎరుపు రంగులోకి మారి అందంగా కనబడతాయి. 
  •  తాజాగా ఉన్న గులాబీ రేకులను మెత్తగా నూరి రసం తీయాలి. ఈ రసంలో దూదిని తడిపి పెదాలపై రాయాలి. రసం తీయగా మిగిలిన గులాబీ రేకుల పేస్టును పెదాలపై 20-30 నిమిషాలపై ఉంచితే పెదాలు లేత గులాబీ రంగులోకి మారతాయి. 

Monday, September 28, 2015

అదిరేటి అందానికి....!

మొటిమలూ, మచ్చలూ, చర్మం ఎరుపు రంగులోకి మారడం, నిర్జీవంగా తయారవడం, నల్లగా అవడం వంటి ఎన్నో సమస్యలకు గంధం పరిష్కారం చూపుతుంది. ముఖానికి కొత్త నిగారింపూ అందిస్తుంది.
• ఎలాగో మీరే చూడండి..
• రెండు చెంచాల గంధం, చెంచా పసుపూ, మూడు చెంచాల తేనె కలిపి మెత్తగా చేయాలి. దీన్ని ముఖం, మెడకు రాసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే మొటిమల సమస్య ఉపశమనాన్నిస్తుంది.
• నారింజ తొక్కల పొడి ఓ చెంచా, రెండు చెంచాల గంధం పొడికి మూడు చెంచాల గులాబీ నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది.
• చెంచా చొప్పున గంధం, కలబంద గుజ్జు, కొబ్బరిపాలు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగితే దద్దుర్లూ, చర్మం కందిపోవడం వంటి సమస్యలు ఉండవు.
• చెంచాడు ముల్తానీ మట్టి, చెంచా గంధం, వీటికి సరిపడా గులాబీ నీళ్లు చేర్చి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పావు గంట తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి. ఇది చక్కటి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. రక్తప్రసరణని మెరుగు పరుస్తుంది. ముఖంపై వలయాలు, మచ్చలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ని నిర్మూలిస్తుంది.
• కీరదోసా, బంగాళదుంపా, తేనె, పెరుగూ, గంధం.. ఇవన్నీ చెంచా చొప్పున కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత నీళ్లతో కడిగేస్తే మురికి తొలగిపోయి మచ్చల్లేని ముఖం మీ సొంతమవుతుంది.
• చెంచా చొప్పున సెనగపిండీ, గంధం.. వాటికి తగినన్ని నీళ్లు కలిపి మిశ్రమంలా చేయాలి. దాన్ని పూతలా వేసి పూర్తిగా ఆరాక కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.

కండరాల శక్తి కోసం..!



కండరాల శక్తి కోసం..!
కొందరు చూడ్డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావాలంటే... బీట్‌రూట్ రసం తాగాల్సిందే! ఇందులో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి. గుండె నుంచి ప్రతి శరీర భాగానికి ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. అంతేకాదు, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరసగా కొన్నాళ్లపాటు బీట్‌రూట్ రసం తాగించడం వల్ల... కండరాలూ, శరీరం దృఢంగా తయారైనట్టు వైద్యులు గుర్తించారు. నైట్రేట్లు శరీరానికి అందడం వల్ల శరీరంలో రక్తనాళాలు ఉత్తేజిమతమై, రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్లా కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. అందుకే వయసు పెరిగే కొద్దీ బీట్‌రూట్ రసానికి తగినంత ప్రాధాన్యమివ్వాలి. కనీసం వారానికి రెండు సార్లయినా బీట్‌రూట్‌ని ఆహారంలో తీసుకుంటే మంచిది.

Friday, September 25, 2015

జామపండు - ఆరోగ్య రహస్యాలు

జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు..!

1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.

2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.

4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.

6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.

7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది.

9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.

10) జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.
11) అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.

* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.

* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.

* జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

మహానారాయణ తైలం'



* ఈ తైలంతో నొప్పులకు కళ్లెం

శరీరంలోని కండరాలు బలహీనపడితే కీలక భాగాల పనితీరు కూడా కుంటుపడుతుంది. ఆ స్థితి రాకుండా నివారించే శక్తి తైల మర్ధనకు ఉంది. ఈ ప్రక్రియలో ఆయుర్వేద మూలికలతో తయారు చేసే తైలాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆయుర్వేద తైలాల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా 'మహానారాయణ తైలం' గురించి తెలుసుకుందాం.

ఈ తైలం తయారీలో 'శతావరి' అనే మూలికను ప్రధానంగా వాడతారు. శతావరికి నారాయణి అనే పర్యాయపదం ఉండడం వల్ల ఈ తైలాన్ని నారాయణ తైలమని, మహానారాయణ తైలమని పిలుస్తారు. చర్మంపైన అభ్యంగ (మసాజ్) రూపంలోగానీ, కడుపులోకి తీసుకోవడానికి గానీ ఈ తైలాన్ని వాడతారు. అయితే తాగడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే వస్తి (ఎనిమా) రూపంలోనూ శరీరానికి అందించవచ్చు. చెవి, ముక్కు వ్యాధుల్లో, ఆ భాగాల్లో వేసే చుక్కల మందుగా కూడా ఈ తైలం వాడుకలో ఉంది.

• తైలంలో...

ఇందులోని అంశాలు మూడు రూపాల్లో ఉంటాయి .

• కల్కాంశం :
దోష్టు, ఏలకులు, మంచిగంధం, బలా మూలాలు, జటామాంసీ, ఛఠీలా, సైందవ లవణం, అశ్వగంధ, వచా, రాస్నా, సోంపు, దేవదారు, సుగంధిపాల, పాఠా, మాషపర్ణీ, ముద్గపర్ణీ, తగర వీటన్నిటినీ పొడిచేసి, నీటితో కలిపి ముద్దగా (కల్కం) చేసి పెట్టుకోవాలి.

• తైలాంశం:
తయారు చేసుకున్న ముద్ద తూకానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకోవాలి.

• ద్రవాంశం: అశ్వగంధ, బలామూలాలు, బిల్వమూలాలు, బృహతీద్వయం, పల్లేరు, సంబరేణు, పాఠామూలాలు, పునర్నవా, ముద్గ, రాస్నా, ఏరండమూలం, దేవదారు, ప్రసారణీ, అరణీ ఈ మూలికలకు నీళ్లు చేర్చి సిద్ధం చేసిన కషాయద్రవం ఒక భాగం, శతావరీ రసం ఒక భాగం, పాలు ఒక భాగం. ఇవన్నీ కలిపి తైలాంశానికి మళ్లీ నాలుగు రెట్లు తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక పెద్ద పాత్రలో కలిపేసుకుని, ద్రవాంశం పోయి, తైలాంశం మాత్రమే మిగిలేలా పొయ్యి మీద ఉడికించాలి.

• తైలగుణాలు:

తైలం తయారీలో ఉపయోగించిన ఈ మూలికలన్నీ శరీరంలో విషమించే వాతదోషాల్ని ఉపశమింపచేసేవి, శక్తిని ప్రసాదించేవి. మూలికల గుణాలను శరీరానికి అందించడంలో తైలం ఒక వాహకంలా పనిచేస్తుంది. ఈ తైలంతో చర్మం మీద మర్దన చేసినప్పుడు చేష్టానాడులు, రక్త వహి సిరా ధ మనులు, స్నాయు, పేశీకండరాలు ప్రేరణ పొంది మరింత శక్తివంతమవుతాయి.

బలహీనపడిన అవయవాలు బలపడి తమ విధులను శక్తివంతంగా నిర్వహిస్తాయి. మర్ధనలోని హస్తలాఘవం (మానిప్యుటేషన్ స్కిల్స్) ప్రభావంతోనే ఈ శరీర క్రియలు సాధ్యమవుతాయి. ఫిజియోథెరపీలో వివిధ తైలాలతో చేసే 'మసాజ్' ప్రాచుర్యానికి రావడానికి ఈ విధానమే కారణం.

ఈ మసాజ్‌కు నారాయణ తైలం కూడా తోడైతే ఫలితాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అవయవాల శక్తిసామర్థ్యాన్ని పెంచడంతో పాటు నొప్పులను త గ్గించడంలో నారాయణ తైలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం పైపూతగానే ఈ తైలం ఎక్కువగా వాడుకలో ఉంది.

అయితే ఈ తైలాన్ని కడుపులోకి తీసుకున్నప్పుడు ఇది నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో చుక్కలుగా వేయడం వల్ల చెవినొప్పి, ముక్కులో వేయడం వల్ల తలనొప్పి, తలకు సంబంధించిన మరికొన్ని ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. రోగి పక్షవాతం వంటి సమస్యలతో కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు మర్ధన గానీ, కడుపులోకి ఇవ్వడం గానీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో నారాయణ తైలాన్ని ఎనీమాగా పేగుల్లోకి ఎక్కించ వచ్చు.ఇలా చేయడం వల్ల పేగుల్లోని పొర (మ్యూకోజా) ద్వారా ఔషధ గుణాలు శరీరానికంతా వెళ్లే అవకాశం ఉంది.

• ఏ వ్యాధులకు..?

వాత వ్యాధులకు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడంలో నారాయణ తైలానికి ప్ర«థమ స్థానం ఉంది. వీటితో పాటు పక్షవాతం, అర్థత వాతం (ఫేషియల్ పెరాలిసిస్), దవడ-మెడ పట్లు, భుజాలు పడిపోవడం (బ్రేకియల్ పాల్సీ) కటిశూల (డిస్క్, బ్యాక్‌పెయిన్) పార్శ్వశూల, కుంటడం, నడుము వంగిపోవడం, గృధసీ వాతం (సయాటికా) వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఈ తైలం బాగా పనిచేస్తుంది.

వీటితో పాటు అవయవాలు ఎండిపోవడం, చెవినొప్పి, వినికిడి లోపం, వృషణాల నొప్పి, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి ఈ తైలంతో తగ్గుముఖం పడతాయి. సర్వైకల్, లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారు మర్ధనంతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వస్తి (ఎనిమా) కూడా చేయించుకుంటే లామినెక్టమీ శస్త్ర చికిత్స అవసరమే లేకుండా పోతుంది.

పైన పేర్కొన్న అన్ని వ్యాధుల్లోనూ నారాయణ తైలంతో మర్ధన చేసి ఆ తరువాత వేడినీళ్లతో స్నానం చేయడం గానీ, నొప్పిగా ఉన్న చోట వేడినీళ్లతో కాపడం పెట్టడం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫలితం రెట్టింపుగా ఉంటుంది. నారాయణ తైలంతో పాటు ఆయుర్వేద పైద్యుడి పర్యవేక్షణలో చంద్రప్రభావటి, యోగరాజ గుగ్గులు వంటి సాధారణ ఔషధాలు కూడా తీసుకుంటే అద్భుత ఫలితాలు మీ సొంతమవుతాయి.

సర్వరోగ నివారణి పాలకూర

సర్వరోగ నివారణి పాలకూర
మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆకు కూరలను తప్పనిసరిగి తీసుకోవాలి. మిగిలిని కూరగాయలతో పోల్చితే ఆకుకూరల్లో అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. పోషకాహార నిధి అయిన పాలకూరకు క్రమంగా తింటే వయసుతో పాటు వచ్చే మతిమరుపును రానవ్వకుండా తోడ్పడుతుంది. పాలకూరలో లభించే విటమిన్ సీ, ఏ లు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్లు క్యాన్సర్ ను నివారిచడంలో తోడ్పడుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెడ్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్దిచేసే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. మహిళల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజ్ టెబుల్ సూప్ లోనూ, చపాతీలు చేసుకునే పిండీలోనూ, పకోడీల పిండోలోనూ, పన్నీర్ తో కలిపి వాడే కూరల్లోనూ అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా వేపుడు చేసుకుని తినవచ్చు.

ముఖవర్చస్సు కోసం...!

ముఖవర్చస్సు కోసం...!
అందంగా ఉండేవారు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనే ప్రయత్నిస్తారు. కొంతమంది శరీర భాగాలన్నీ మంచి రంగుతో ఉండి ముఖం మాత్రమే నల్లగా ఉంటే భరించలేరు. ఇది ఆడవారి విషయంలోనే కాదు మగవారి విషయంలోనూ కనపడుతుంది. ముఖం నల్లగా ఉందనే మానసిక వేదన పోగొట్టుకునేందుకు అనేక ఆధునిక చికిత్సలు వచ్చినా ఎక్కువ శాతం అలనాటి సంప్రదాయ చికిత్సలకే మొగ్గు చూపుతున్నారు. వీటివల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. అందమైన ముఖవర్చస్సు కోసం కొన్ని సులభ చికిత్సలు పరిశీలిద్దాం...!
కొన్ని గులాబీ రేకులను మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. సుమారు ఒక టీ స్పూన్‌ పేస్టుకి రెండు టేబుల్‌ స్పూన్ల పాలు కలిపాక తర్వాత మళ్లీ నూరి ఫ్రిజ్‌లో పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చిక్కని క్రీములాగా ఉండే ఈ పేస్టుని ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతమవుతుంది.
యాపిల్‌పై ఉండే తొక్క తీసి ముక్కలుగా తరిగి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే మచ్చలు ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల శెనగపిండిని, 2 టీ స్పూన్ల వెన్నను చిటికెడు పసుపు తీసుకుని బాగా కలపాలి. ముఖాన్ని ముందుగా చల్లని నీటితో కడిగి జిడ్డు లేకుండా మెత్తటి తువాలుతో తుడవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న పేస్టును ముఖమంతా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్‌ చేయాలి. ఆశించిన ఫలితం కలుగుతుంది.
నారింజ పండ్ల పైతోలు ఎండించి చేసిన పౌడర్‌ను కొంచెం తీసుకుని అందులోకి రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును 20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
తొలుత ముఖాన్ని సున్నిపిండితో కడగాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసి దీనిలో బాగా పండిన అరటిపండును కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే శరీరఛాయ మరింతగా మెరుగవుతుంది.
ఈ ఫేస్‌ప్యాక్‌లన్నీ రోజూ ఉదయం స్నానానికి ముందు ఆచరించి ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేయాలి. ముఖ్యంగా ప్రతి రోజూ ఎక్కువగా నీరు తాగాలి. దీంతో పాటు తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. దీనివల్ల మీరు ఆశించిన ఫలితం త్వరగా పొందుతారు.

అల్లం ఉపయోగాలు

అల్లం ఉపయోగాలు

మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది . రక్త శుద్దికి తోడ్పడుతుంది . రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది . అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి . అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు . అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది . నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి , దంటాలను ఆరొగ్యము గా ఉంచుతుంచి .

• అల్లం తో షుగర్ నియంత్రణ :

షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేఅయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనా ఫ్లితాలు వెళ్ళడించాయి. అల్లము నుంది తీసిన రసాన్ని , అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజము గా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము . ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోదకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .

Sunday, September 20, 2015

కలబంద


ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి అలొవెరా(కలబంద) శ్రేష్ఠమైనది. ఇందులో మినరల్స్‌, విటమిన్స్‌తో పాటు మరెన్నో యాక్టివ్‌ కాంపౌడ్స్‌ ఉన్నాయి. అందుకే వైద్యరంగంతో పాటు సౌందర్య ఉత్పత్తుల్లో అలొవెరా వాడకం విరివిగా ఉంటుంది.
చర్మకాంతికి ఉపయోగపడే అలొవెరాతో రకరకాల ఫేస్‌ప్యాక్స్‌ తయారు చేసుకోవచ్చు.
అలొవెరా అద్భుతమైన మాయిశ్చరైజర్‌. ఇందులో ఉండే యాంటాక్సిడెంట్స్‌ వల్ల చర్మంపై ఉండే మొటిమలతో పాటు నొప్పులు తగ్గిపోతాయి. అలొవెరా జెల్‌ను గాలిచొరబడిన సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుని కావాల్సినపుడు అలొవెరా ఫేస్‌ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చు.
• మెరిసేందుకు...
కావాల్సిన పదార్థాలు: అలొవెరా, పసుపు, తేనె, పాలు, రోజ్‌వాటర్‌.
తయారీ: ఒక గిన్నెలో కొంచెం పసుపు తీసుకొని, అందులో ఒక టీ స్పూన్‌ తేనె, ఒక టీ స్పూన్‌ పాలతో పాటు కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ కలపాలి. అందులో అలొవెరా జెల్‌ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని కడిగితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
• కమిలిన చర్మానికి..
కావాల్సిన పదార్థాలు: అలొవెరా, నిమ్మరసం.
తయారీ: ఒక గిన్నెలో అలొవెరా రసం తీసుకోవాలి. అందులో నిమ్మరసం కలిపి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి కమిలిన చర్మంపై రాయాలి.
• తాజాదనానికి..
కావాల్సిన పదార్థాలు: అలొవెరా, మామిడి, నిమ్మరసం
తయారీ: మామిడికాయ ముక్కల్లో అలొవెరా జెల్‌ కలిపి గ్రైండ్‌ చేయాలి. ఈ గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.
• జిడ్డు వదిలించేందుకు..
కావాల్సిన పదార్థాలు: అలొవెరా ఆకులు, తేనె.
తయారీ: కలబంద ఆకుల్ని ఉడికించి తరువాత గ్రైండ్‌ చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా వాడుతుంటే ఫలితం ఉంటుంది.
• మృదువైన చర్మానికి..
కావాల్సిన పదార్థాలు: అలొవెరా, దోసకాయ రసం, పెరుగు, రోజ్‌వాటర్‌
తయారీ: అలొవెరా జెల్‌లో కొద్దిగా దోసకాయ రసం, పెరుగు కలపాలి. ఆ తర్వాత కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మం ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మృదువుగా తయారవుతుంది.

Friday, September 18, 2015

బీట్‌రూట్‌తో శక్తి..!



గుండె జబ్బుతో బాధపడే వారు రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మంచిది. అంతేకాదు దీనివల్ల కండరాలు బలంగా తయారవుతాయనే విషయం ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘‘మా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. హార్ట్‌ఫెయిల్యూర్‌ పేషెంట్లకు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగించిన రెండు గంటల తరువాత కండరాల శక్తిలో మార్పు కనిపించింద’’ని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ లిండా పీటర్సన్‌ అన్నారు. బీట్‌రూట్‌ జ్యూస్‌లో అధికమోతాదులో ఉండే నైట్రేట్‌ కండరాలకు శక్తినిస్తుంది. గతంలో అథ్లెట్స్‌పై జరిపిన అధ్యయనంలోనూ డైటరీ నైట్రేట్‌ కండరాల పనితీరును పెంచినట్లు వెల్లడైంది. నైట్రేట్‌ రక్తనాళాలను రిలాక్స్‌ చేయడమే కాకుండా జీవక్రియలపైన ప్రభావం చూపుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల హార్ట్‌రేట్‌ పెరగడం, రక్తపోటు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు లేవంటున్నారు పరిశోధకులు.

Thursday, September 17, 2015

రాళ్ల ఉప్పు

దివరకు రక్తపోటు సమస్య చాలా తక్కువ. ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు కూడా. రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది. మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలో ఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు. అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని, అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు. అయితే, ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికాల్లాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్లలోనే కాదు, శరీరంలో కూడా అది కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. పైపెచ్చు రక్తపోటును పెంచుతుంది. అయితే అయొడైజ్డ్ ఉప్పుకు ఎంతో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంటుంది. ఇది చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆరోగ్యకరమని, చక్కగా స్ఫటికాల్లా మెరిసిపోతుంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఈ ఉప్పు సహజసిద్ధంగా తయారు చేసింది కాదు. ఇది కర్మాగారాల్లో తయారవుతుంది. అసలైన ఉప్పు, అంటే రాళ్ల ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. దీన్ని ఎండలో ఎండబెడతారు. ఇందులో సహజసిద్ధమైన 72 ఖనిజ లవణాలుంటాయి. ఇందులో కూడా సోడియం, క్లోరైడ్, అయొడిన్‌లు ఉంటాయి కానీ, అవి సహజమైనవి. కృత్రిమమైనవి కావు. ఈ ఉప్పు నీళ్లలో వెంటనే కరిగిపోతుంది. శరీరంలో కరిగిపోతుంది. మూత్రపిండాల్లో కరిగిపోతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. పైగా రక్తపోటును అంటే బీపీని తగ్గిస్తుంది. కండరాలు మొద్దుబారిపోవడం, తిమ్మిర్లెక్కడం, దురదలు పెట్టడం వంటివి తగ్గిపోతాయి.

రాత్రివేళల్లో పిక్కలు, అరికాళ్లలో నొప్పులు వచ్చినా, పిక్కలు బిగపట్టుకుపోయినా ఓ అరగ్లాసు నీళ్లలో ఓ చెంచాడు రాళ్ల ఉప్పు వేసి, బాగా కలిపి, ఆ నీటిని తాగండి. అయిదు నిమిషాల్లో ఆ నొప్పులు, బాధలన్నీ మటుమాయమైపోతాయి. రాళ్ల ఉప్పు వాడడం ప్రారంభించిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం మందులకు స్పందించడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాలు సజావుగా పని చేస్తున్నట్టు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. ఇక 240/140 బీపీ ఉన్నప్పుడు కూడా రాళ్ల ఉప్పు కారణంగా అది సాధారణ స్థితిలోకి వచ్చేస్తోంది. రాళ్ల ఉప్పులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. రోజూ రెండున్నర చెంచాల రాళ్ల ఉప్పును 15 గ్లాసుల నీటిలో కలిపి అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా తాగితే రక్తపోటు దరిదాపులకు కూడా రాదని చాలామంది డాక్లర్లు చెబుతున్నారు. బీపీ సాధారణ స్థితిలో ఉండాలన్నా, తలకు రక్తం సజావుగా చేరాలన్నా మిరపకాయల వాడకం, అరటి పండ్లు తినడం అనివార్యం. ఇవి రెగ్యులర్‌గా వాడేవారికి గుండె సంబంధమైన సమస్యలు కూడా తలెత్తవని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీరంలో సరైన పాళ్లలో సరైన ఉప్పు లేకపోతే నీరు నిలవడం అసాధ్యం. శరీరంలో నీరు నిలవకపోతే, రక్తనాళాలు సజావుగా పనిచేయవు. శరీరంలో నీటి శాతం ఏమాత్రం తగ్గినా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రక్తపోటు రావడం ఖాయం. అయొడైజ్డ్ ఉప్పు వల్ల శరీరంలో నీళ్లు నిలవవు. రాళ్ల ఉప్పు వల్ల శరీరంలో 95 శాతం వరకూ నీళ్లు నిలుస్తాయి. శరీరం నుంచి సరిగా మూత్రం బయటికి పోవడానికి, చెమటలు పట్టడానికి రాళ్ల ఉప్పు సహకరిస్తుంది.

గోళ్ల రక్షణకు సులభ మార్గాలు..

గోళ్ల రక్షణకు సులభ మార్గాలు..!
గోళ్లపై మచ్చలు, గుంటలు, పగుళ్లు, గోరు చుట్టూ చీము పుట్టడం.. లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులు. సహజంగా సొరియాసిస్‌, ఎగ్జిమ మొదలైన చర్మ వ్యాధులతో పాటు ఫంగస్‌ ఇన్ఫెక్షన్ల వల్ల అందమైన గోళ్లు పాడవుతుంటాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేయటం వల్ల గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్‌ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్లు నానడం, కడిగిన గిన్నెలనే పదే పదే కడగటం చేసే స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ.
• సులభ చికిత్సలు
మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకొని గోళ్లకు రాత్రి పూట పట్టించాలి. గోరింటాకు రాలిపోకుండా పలచని తెల్లగుడ్డను చుట్టి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. దీని వల్ల ఫంగస్‌ ఏర్పడిన పిప్పి గోళ్లు, పగుళ్లు, ముడతలు, మచ్చలు మొదలైన సమస్యలు తగ్గిపోతాయి.
పై పొరను తీసిన బంగాళదుంపను మెత్తగా నూరాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్లకు పట్టించి ఉదయాన్నే కడగాలి. ఇలా చేస్తే ఫంగస్‌ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి.
కొద్దిగా పసుపు తీసుకుని నీటితో గాని, నిమ్మరసంలో గాని కలిపి ముద్దగా చేసి వ్యాధి సోకిన భాగాల్లో గోళ్లకు పట్టించి రాలిపోకుండా తెల్లని పలుచని గుడ్డను కట్టి రాత్రి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.
రాత్రి పడుకునే ముందు పలుచని తెల్లగుడ్డను నిమ్మరసంలో కొద్దిసేపు తడిపి వ్యాధి సోకిన గోళ్లకు చుట్టాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు రావు. దీంతో పాటు గోళ్లపై ఉండే సహజమైన రంగు పోకుండా ఉంటుంది.
పల్చటి తెల్ల గుడ్డను ఉల్లిపాయ రసంలో బాగా తడిపి వ్యాధి ఉండే గోళ్లకు చుట్టాలి. దీని వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.
కూరల్లో వాడుకునే దోసకాయ ముక్కల్ని తరచుగా తింటుంటే పిప్పి గోళ్లు, గోళ్ల పగుళ్లు, మచ్చలు తగ్గిపోతాయి.

Tuesday, September 15, 2015

పుదీనా - ఆరోగ్యానికి నజరానా

ప్రకృతి మనకు ఎన్నో రకాల పదార్థాలను ప్రసాదించింది. వాటిలో కొన్నిటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటే.. మరికొన్నిటిలోని ఔషధ గుణాలు శరీరంలో ఉన్న వ్యాధులనూ తగ్గించేస్తాయి. అలాంటి గుణాలు కలిగిన వాటిలో 'పుదీనా' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఉంది. అంతేకాదు పుదీనా వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి.
• అజీర్తి నివారణలో...
అజీర్తి సమస్యలను నివారించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో పుదీనా కీలక పాత్ర వహిస్తుంది. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు తలెత్తే కడుపునొప్పి, వికారం వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఆహారం జీర్ణమయ్యే సమయంలో పైత్య రసాలు ఎక్కువగా విడుదలైతే, అది సులభంగా జీర్ణమై ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తవు. పొట్టలో ఈ ప్రక్రియను ప్రేరేపించి, సులభంగా ఆ రసాలను ఎక్కువ మోతాదులో విడుదల చేయించే గుణం పుదీనాలో ఉంది. దీంతో తీసుకున్న ఆహారం జీర్ణమై, ఆకలి లేకపోవడం, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి.
• అలర్జీలకు దూరంగా..
వాతావరణం మారినప్పుడల్లా మనిషి శరీరంలోనూ అనేక రకాల మార్పులు సంభవిస్తుంటాయి. కొందరైతే చిన్న మార్పులకూ తట్టుకోలేరు. వెంటనే అనారోగ్యాల బారిన పడిపోతుంటారు. పుదీనా ఆకుల్లో ఉండే రొస్మారినిక్ ఆమ్లం వివిధ రకాల అలర్జీలను రూపుమాపడంలో కీలక పాత్ర వహిస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. అందుకే వివిధ రకాల అలర్జీలతో ఇబ్బందిపడేవారు రోజూ పుదీనాను ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది.
• వీటినీ తగ్గిస్తుంది..
పుదీనాలో జలుబు, దగ్గును తగ్గించే శక్తి ఉంది. గొంతు నొప్పి, మంట, తలనొప్పి దరిచేరకుండా చేసే ఔషధం ఇది. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పుదీనా టీని తీసుకోవడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు. అలాగే దగ్గు ఎక్కువగా ఉన్పప్పుడు వేడి నీళ్లలో కాస్త పుదీనా రసం వేసి ఆ నీళ్లతో ఆవిరిపడితే సమస్యను అధిగమించవచ్చు.
• నోటి సమస్యలకు చెక్
రోజూ కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన, దంతక్షయం వంటి సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. అంతేకాకుండా నాలుక, దంతాలను శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది. అందుకే కొన్ని టూత్‌పేస్ట్ తయారీ సంస్థలు సైతం తమ ఉత్పత్తుల్లో పుదీనాను ఉపయోగిస్తున్నాయి. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల కారణంగానే ఇది నోటి సమస్యకు సరైన ఔషధంలా పనిచేస్తుంది.
• ఆ సమయంలోనూ...
నెలసరి సమయంలో కొందరు అమ్మాయిలు వాంతుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీంతో ఏదీ తినాలనిపించక, నీరసపడిపోతారు. ఇలాంటి వారికి పుదీనా టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. రోజుకు నాలుగైదు సార్లు దీన్ని తీసుకోవడం వల్ల వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. పుదీనాలోని యాంటీ స్పాస్మోడిక్ గుణాల కారణంగా దీన్ని తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పినీ తగ్గించుకోవచ్చు. పుదీనా టీ వల్ల కండరాలకు సైతం ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు గర్భిణులు సాధారణంగా ఎదుర్కొనే వాంతులు, వికారం వంటి సమస్యలను కూడా తగ్గించే లక్షణం పుదీనాలో ఉంది. దీనికోసం చేయాల్సిందల్లా.. రోజూ పొద్దున్నే కొన్ని పుదీనా ఆకులను చేత్తో బాగా నలిపి, వాటి వాసన పీల్చిస్తే చాలు.
• చర్మ సంరక్షణకు..
పుదీనా రసం చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మొటిమలు, మచ్చలపై దీని రసాన్ని రాస్తే త్వరగా తగ్గుతాయి. వీటితో పాటు దోమ, తేనెటీగ, కందిరీగ వంటి కీటకాల కాటు వల్ల కలిగే ఎరుపుదనం, మంట నుంచి పుదీనా రసం మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉండే నాణ్యమైన పుదీనా ఆయిల్‌తో ముఖంపై మర్దనా చేసి, కడుక్కుంటే చర్మం శుభ్రపడడంతో పాటు నిగారింపును సంతరించుకుంటుంది.
• ఇవే కాకుండా..
ఆకలి మందగించినప్పుడు పుదీనా పచ్చడిని తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇందులోని ఔషధ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌ను అరికట్టడంలో సహకరిస్తాయి. శరీర బరువును నియంత్రించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, తలనొప్పి, ఆస్తమాని తగ్గించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలెన్నో.. అందుకే మీరు కూడా దీని వాడకాన్ని పెంచి, ఆరోగ్యంగా ఉండండి.

Monday, September 14, 2015

* సమకాలీన రుగ్మతల నివారణకు దివ్య ఔషదమే '' గ్రీన్‌ టీ ''

* ‘గ్రీన్ టీ’ తో స్థూలకాయం మటుమాయం..
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది . అసలు గ్రీన్ టీ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. గ్రీన్ టీ అంటే .... ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని కామెల్లియా సినెన్సిస్‌గా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమకాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్‌ టీ (తేయాకు).

రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశఆలు తక్కువ. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ టీలో ఉంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోజు గ్రీటన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, సౌందర్య పోషణకు కూడా ఉపయోగకరం అని శాస్త్రవేత్తలు కనుగొటం వల్ల మార్కెట్లో గ్రీన్ టీతో తయారు చేసిన సబ్బులు, షాంపూలు, డియోడరెంట్స్, క్రీములు కూడా లభ్యమౌతున్నాయి.

కావలసిన పదార్ధాలు:
పుదినా ఆకులు: అర కప్పు
నీళ్ళు: కప్పు
గ్రీన్ టీ బ్యాగులు: మూడు
తేనే: రెండు టేబుల్ స్పూన్లు

గ్రీన్ టీ తయారు చేయు విధానము:
1. ఒక కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి దింపుకోవాలి.
2. తర్వాత ఒక చిన్న చెంచాడు గ్రీన్ టీ ఆకులను అందులో వేసి 1,2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
3. ప్లేవర్ కోసం ఆకులతో బాటు 1/2టీ స్పూన్ నిమ్మరసం, పంచదార తేనె కలుపుకుంటే ఆరోగ్యకరం.
4. రెండు నిమిషాల తర్వాత వడబోసుకుని త్రాగేయటమే.

ప్లేవర్స్:
నిమ్మరసంతో బాటుగా రెండు మూడు పుదీనా ఆకులను కూడా వేసుకుంటే అమోఘంగా ఉంటుంది.
నిమ్మరసంతో పుదీనాకు బదులు చిన్న అల్లం ముక్క తొక్కి వేసుకున్నా బాగుంటుంది.
నిమ్మరసం వాడకపోయినా పుదీనాకు బదులు నాలుగు తులసి ఆకులు కూడా వాడవచ్చు.

Sunday, September 13, 2015

ఆరోగ్యానికి కొత్తిమీర జ్యూస్

ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి , కట్ చేసి పెట్టుకోవాలి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం , ఒక అర టీ స్పూన్ ఉప్పు , ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అన్నిటిని మిక్సర్ లో మెత్తగా గ్రైండ్ చేయాలి. వడ పోయకుండా అలానే త్రాగాలి. ప్రతి రోజు ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళికడుపుతో తీసుకోవాలి.అరగంట ఏమీ తినకూడదు.
1) షుగర్ , కొలెస్ట్రాల్ , బీపి కంట్రోల్ ఉంటాయి. 2) మొటిమలు , మచ్చలు , చర్మ వ్యాధులు , స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. 3) గ్యాస్ ప్రాబ్లం , కడుపునొప్పి ,పొట్ట సమస్యలు , అల్సర్లు ,అజీర్ణం , వాంతులు , వికారం తగ్గుతాయి. 4) నోటి అల్సర్లు , నోటి పూత , నోటి దుర్వాసన తగ్గుతుంది. 5) ఫైల్స్ , మలబద్దకం తగ్గుతుంది. 6) వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 7) కంటి చూపు మెరుగుపడుతుంది. 8) శరీరం నుండి విష పదార్ధాలను బయటికి toxins రూపంలో పంపిస్తుంది. 9) శరీరం యొక్క సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 10) కాన్సర్ సెల్స్ మీద పోరాడుతుంది. స్త్రీలో ఋతుచక్ర సమస్యలు , PCOD ని పరిష్కరిస్తుంది.
చూసారా ఒక్క జ్యూస్ లో ఎన్నో లాభాలు , ప్రతి రోజు ఒక మూడు రూపాయలు ఖర్చు అంతే