లేత గులాబీరంగు పెదాలు ముఖారవిందాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. పరిసరాల ప్రభావం, ఎండ, జీవన విధానంలోని మార్పులు, రసాయనాలతో చేసిన లిప్‌స్టిక్స్ వాడటం, సిగరెట్లు కాల్చడం.. వంటి చర్యల వల్ల పెదాలు నల్లగా మారిపోతాయి. నల్లగా ఉన్న పెదాల్ని లేత గులాబీరంగులోకి మారాలంటే ఇంట్లోనే కొన్ని సులభమైన ప్రకృతి చికిత్సలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.
- ఒక టీ స్పూన్ చల్లని పాలల్లో చిటికెడు పసుపు కలిపి రోజూ పెదాలపై నెమ్మదిగా రుద్దుతుంటే తిరిగి పెదాలు సహజరంగులోకి వచ్చి అందంగా కనపడతాయి.
- ఒక టీ స్పూన్ బాదం ఆయిల్, సమంగా నిమ్మరసం కలిపి పెదాలపై రాసి పూర్తిగా ఆరిపోయే వరకూ ఉంచి నీటితో కడగాలి. ఇది పెదాలపై ఉన్న మురికిని నల్లని పొరలను శుభ్రపరచి అందంగా తీర్చిదిద్దుతుంది.
- చాలా ఏళ్ల నుంచి బీట్‌రూట్ రసాన్ని పెదాలకు మంచి రంగు రావడానికి ఉపయోగిస్తున్నారు. బీట్‌రూట్ రంగు ఎర్రగా ఉండటం వల్ల పెదాలకు సహజమైన రంగు కలిగిస్తుంది.
- తాజాగా ఉన్న క్యారెట్ జ్యూస్‌లో దూదిని తడిపి పెదాలకు రాయడం వల్ల కూడా ఎరుపు రంగులోకి మారి అందంగా కనబడతాయి.
- తాజాగా ఉన్న గులాబీ రేకులను మెత్తగా నూరి రసం తీయాలి. ఈ రసంలో దూదిని తడిపి పెదాలపై రాయాలి. రసం తీయగా మిగిలిన గులాబీ రేకుల పేస్టును పెదాలపై 20-30 నిమిషాలపై ఉంచితే పెదాలు లేత గులాబీ రంగులోకి మారతాయి.
No comments:
Post a Comment