ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి అలొవెరా(కలబంద) శ్రేష్ఠమైనది. ఇందులో మినరల్స్, విటమిన్స్‌తో పాటు మరెన్నో యాక్టివ్ కాంపౌడ్స్ ఉన్నాయి. అందుకే వైద్యరంగంతో పాటు సౌందర్య ఉత్పత్తుల్లో అలొవెరా వాడకం విరివిగా ఉంటుంది.
చర్మకాంతికి ఉపయోగపడే అలొవెరాతో రకరకాల ఫేస్‌ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు.
అలొవెరా అద్భుతమైన మాయిశ్చరైజర్. ఇందులో ఉండే యాంటాక్సిడెంట్స్ వల్ల చర్మంపై ఉండే మొటిమలతో పాటు నొప్పులు తగ్గిపోతాయి. అలొవెరా జెల్‌ను గాలిచొరబడిన సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుని కావాల్సినపుడు అలొవెరా ఫేస్‌ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు.

• మెరిసేందుకు...
కావాల్సిన పదార్థాలు: అలొవెరా, పసుపు, తేనె, పాలు, రోజ్‌వాటర్.
తయారీ: ఒక గిన్నెలో కొంచెం పసుపు తీసుకొని, అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పాలతో పాటు కొన్ని చుక్కల రోజ్‌వాటర్ కలపాలి. అందులో అలొవెరా జెల్ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని కడిగితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

• కమిలిన చర్మానికి..
కావాల్సిన పదార్థాలు: అలొవెరా, నిమ్మరసం.
తయారీ: ఒక గిన్నెలో అలొవెరా రసం తీసుకోవాలి. అందులో నిమ్మరసం కలిపి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి కమిలిన చర్మంపై రాయాలి.

• తాజాదనానికి..
కావాల్సిన పదార్థాలు: అలొవెరా, మామిడి, నిమ్మరసం
తయారీ: మామిడికాయ ముక్కల్లో అలొవెరా జెల్ కలిపి గ్రైండ్ చేయాలి. ఈ గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.

• జిడ్డు వదిలించేందుకు..
కావాల్సిన పదార్థాలు: అలొవెరా ఆకులు, తేనె.
తయారీ: కలబంద ఆకుల్ని ఉడికించి తరువాత గ్రైండ్ చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా వాడుతుంటే ఫలితం ఉంటుంది.

• మృదువైన చర్మానికి..
కావాల్సిన పదార్థాలు: అలొవెరా, దోసకాయ రసం, పెరుగు, రోజ్‌వాటర్
తయారీ: అలొవెరా జెల్‌లో కొద్దిగా దోసకాయ రసం, పెరుగు కలపాలి. ఆ తర్వాత కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మం ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మృదువుగా తయారవుతుంది.

No comments:
Post a Comment