- సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడే పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్ కొలస్ట్రాల్‌ను ఇవి మెరుగుపరుస్తాయి. ఈ ఫిష్‌ని గ్రిల్ లేదా బేక్ చేసి తినాలి. వేపుళ్లు చేసుకుని మాత్రం తినొద్దు.
- మొనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అవకాడో, పల్లీలు, బటర్, బాదంపప్పులు గుండెకు ఎంతో మంచివి. ఇవి కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఆలివ్, పల్లీ నూనెల్లో మొనోసాచ్యురేట్స్ పుష్కలంగా ఉంటాయి.
- నట్స్ తినడం వల్ల కూడా కొలస్ట్రాల్ బాగా తగ్గుతుంది. వీటిల్లో మొనోసాచ్యురేటెడ్, పాలీఅన్‌సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఎల్‌డిఎల్‌ని అంటే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నట్స్ అంటే బాదం, వాల్‌నట్స్ వంటి వాటిల్లో గుండెను ఆరోగ్యంగా ఉంచే పీచుపదార్థాలు ఉన్నాయి. అంతేకాదు వీటిల్లో విటమిన్-ఇ, సొలీనియంలు కూడా ఉన్నాయి.
- ధాన్యాలు, ఓట్స్ వల్ల కూడా కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఓట్స్‌లో ఫైబర్ ఉంటుంది. దీన్లోనే కాకుండా బార్లీ, బ్రౌన్‌రై్‌సలు తీసుకుంటే కూడా కొలస్ట్రాల్ బాగా తగ్గుతుంది. బీన్స్, యాపిల్స్, కేరట్స్‌లలో పీచుపదార్థం బాగా ఉంది.
- బీన్స్, కాయధాన్యాలు, బటానీల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కొలస్ట్రాల్ తగ్గుతుంది. పప్పుల్లో కూడా పీచుపదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. బీన్స్‌లో లెసిథిన్ అనే పోషకపదార్థం ఉంటుంది. ఇది కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
- పళ్లల్లోని పీచుపదార్థాల వల్ల కూడా కొలస్ట్రాల్ తగ్గుతుంది. యాపిల్స్, కమలాలు, ద్రాక్ష వంటి పళ్లల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని ఫైబర్ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పీచుపదార్థాలు బాగా ఉన్న సిలీయం, బార్లీ, యాపిల్స్, పియర్స్, కిడ్నీబీన్స్‌లు తింటే శరీరానికి మంచిది.
- యాంటీ ఆక్సిడెంట్లు కొలస్ట్రాల్‌దెబ్బతినకుండా కాపాడతాయి.
- వాల్‌నట్స్‌లో మొనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా ఎల్‌డిఎల్ (బ్యాడ్) కొలస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
- వెల్లుల్లి రోజూ తింటే బ్యాడ్ కొలస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.
Sunday, November 1, 2015
కొలస్ట్రాల్ తగ్గాలంటే
శరీరంలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది తగ్గాలంటే నిత్యం మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment