భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి... ఆ ప్రయోజనాలేంటో తెలుసా!
• ఆపిల్: ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు భోంచేశాక ఆపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. భోంచేశాక పదిహేను నిమిషాల తరవాత దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగితీసుకుంటే ఇంకా మంచిది.
• అరటిపండ్లు: ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది.
• బొప్పాయి: కొందర్ని అజీర్తి సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
• అనాస: ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
• అంజీరా: గుప్పెడు అంజీరాలో పదిహేను గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

No comments:
Post a Comment