Monday, November 2, 2015
వేపాకు... అద్భుత ఔషధం!
వేప ఆకులూ బెరడూ నూనెగింజలూ పండ్లూ పువ్వులూ అన్నీ ఔషధభరితాలే. అందుకే ప్రాచీనకాలంనుంచీ సంప్రదాయ వైద్యంలో వీటిని వాడుతుండేవారు. వేపాకుల్లో బ్యాక్టీరియానీ ఫంగస్‌నీ నిర్మూలించే లక్షణాలు ఉన్నాయి. ఈ ఆకుల్ని ముద్దలా చేసి చర్మవ్యాధులైన అలర్జీలూ, మొటిమలూ, దద్దుర్లూ, నల్లమచ్చల నివారణకు వాడటంవల్ల చక్కని ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని రసాయనాలు పొట్ట, పేగుల్లోని ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియానూ చక్కెరవ్యాధినీ నివారిస్తాయి. వేప పుల్లల్ని నమలడంవల్ల దంతక్షయం, నోట్లో అల్సర్లు ఏర్పడకుండా ఉంటాయి. హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది. పోతే వేపనూనెను తలకు పెట్టుకోవడం వల్ల చుండ్రు తగ్గి, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఒంటికి రాసుకోవడం వల్ల దోమల్లాంటివి కుట్టకుండా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, రోజూ కాసిని వేపాకుల్ని తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి పెరగకుండా ఉంటుందన్నది సరికొత్త పరిశోధన. ఈ ఆకుల్లోని రసాయనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment