కీరదోసకాయ తింటే శరీరంలో వేడి తగ్గిపోతుంది. కొవ్వుతో పాటు హైపర్‌టెన్షన్‌ను తగ్గించే గుణమున్న దోసతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ ఓట్‌మీల్‌ను, దోసకాయ తురుములో కలపాలి. అందులో మజ్జిగ, నిమ్మరసాలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. చల్లదనం కోసం ఈ ఫేస్ ప్యాక్‌ను అందరూ వేసుకోవచ్చు.
• ఆయిలీ స్కిన్
ఒక కప్పులో టేబుల్ స్పూన్ పసుపు, అర కప్పు కీర దోస గుజ్జు కలిపి పేస్ట్ చేసుకుని ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.
కీరా గుజ్జుకు తగినంత పెరుగు కలిపి పేస్ట్ చేసుకుని ముఖానికి రాయాలి. కాసేపయ్యాక చన్నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
• పొడి చర్మం
కీర దోసకాయ గుజ్జులో టేబుల్ స్పూన్ ఓట్‌మీల్, తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
• మృదువైన చర్మానికి
కీరా గుజ్జులో కొన్ని చుక్కల కలబంద జెల్ కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది.
• చర్మం మెరుపునకు
కీరా గుజ్జులో రెండు స్పూన్ల పెరుగు కలపాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి రాస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. కీరా గుజ్జులో పుదీనా ఆకుల్ని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రపరిస్తే చర్మం నిగనిగలాడుతుంది.
No comments:
Post a Comment