బాదం పప్పులు :
మీకు సాయంకాలం పూట ఆకలి అయితే బాదం పప్పులు తినండి. ఇది చక్కటి చిరుతిండి.
ఎందుకంటే కడుపూ నిండుతుంది,అదే విధంగా మీకు కూడా కాస్త ఆకలి తీరి, శక్తి
కూడా వస్తుంది.
ఆపిల్ :
రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండడమే కాక, మీ క్యాలరీల స్వీకరణ
కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని
రోజుకో ఆపిల్ తినండి. ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల
వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ అందుతుంది, కొలెస్టరాల్ ను కూడా
తగ్గిస్తుంది.
వేరుశనగ పప్పులు :
వేరుశనగలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. కనుక రోజుకు
కొన్ని వేరుశనగలు తినండి. వాటిలో కేవలం 74 కేలరీలే వుంటాయి. అంతే కాదు, ఇవి
తక్కువ గ్లూకోస్ కలిగి వుంటాయి కనుక శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి.
దాని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి వుంటుంది.
ద్రాక్ష పళ్ళు :
కడుపు నిండి, తక్కువ కేలరీలు కావాలంటే ద్రాక్ష పళ్ళు సరైన మార్గం. ఒక 30
ద్రాక్ష పళ్ళు తినండి, ఎందుకంటే అవి రక్తహీనతను, అలసటను, కీళ్ళ నెప్పులను,
కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను, తగ్గించడానికి దోహదం చేస్తాయి, కేవలం 100
కేలరీలు మాత్రమె కలిగి వుంటాయి.
పుచ్చకాయ :
పుచ్చకాయలు మంచి డైట్ స్నాక్ గా చెప్పుకోవచ్చు. ఒక పుచ్చకాయలో కేవలం 88
కేలరీలు మాత్రమె వుంటాయి. అవి నీటితో తయారవుతాయి, అందువల్ల చాలా తక్కువ
కేలరీలు వుంటాయి.
టమాటో సూప్ :
మీకు తినడం ఇష్టం లేకపోతె, టమాటో సూప్ తాగండి, ఎందుకంటే అది చాలా తేలిగ్గా
తయారు చేయవచ్చు, కేవలం 74 కేలరీలు మాత్రమె కలిగి వుంటుంది.
చెర్రీ :
ఈ చిన్ని రుచికరమైన పళ్ళు పుష్కలంగా విటమిన్లు కలిగి వుంటాయి, తక్కువ
కొవ్వు పదార్ధం కలిగి వుంటాయి. 25 చెర్రీలలో కేవలం 100 కేలరీలే వుంటాయి.
బ్లూ బెర్రీలు :
ఈ అధ్బుత పదార్ధం ఒక కప్పులో 83 కేలరీలు వుంటాయి. బ్లూ బెర్రీలలో
పుష్కలంగా యాంటీ ఆక్సిడేంట్లు వుండి, వార్ధక్య ప్రక్రియను మందగింప
చేస్తాయి, మీ గుండెను రకరకాల జబ్బుల నుంచి కాపాడతాయి.
కివీ పండు :
ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. రెండు కివీ పళ్ళను
సాయంత్రం స్నాక్ గా తీసుకోండి. ఇవి కడుపు నింపుతాయి. వీటిలో కేవలం 58
కేలరీలే వుంటాయి. కాబట్టి సాయంత్రపు స్నాక్ గా దీన్ని తీసుకోండి. అంతేకాక
కివి పళ్ళు జీర్ణక్రియకు సాయం చేస్తాయి. స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను
కూడా ఇస్తాయి.
Friday, August 30, 2013
Thursday, August 29, 2013
ఉప్పుతో ముప్పెంత...? ఉప్పును ఎలా తగ్గించుకోవాలి...?
మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన
శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం
తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి
నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు
అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్
కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక
రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత
ఉప్పు అవసరం?
జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.
శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ ఉన్నపుడు మెదడులోని దప్పిక కేంద్రం ప్రేరేపించబడి మిమ్మల్ని మరిన్ని నీళ్ళు తాగమంటూ ప్రోద్భలపరుస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడటంవల్ల మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జింప చేయలేక పోతాయి. అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం హెచ్చుతుంది. ద్రవపరిమాణం పెరిగి ద్రవాన్ని ఇముడ్చుకొనే ఖాళీ పెరగకపోవటంతో లోపలవత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన వత్తిడినే మనం హైపర్ టెన్షన్ (బీపీ) అంటున్నాము. ఉప్పుకు ఎక్కువ తీసుకోకూడదని తెలిసినా కూడా చాలామంది రోజుకు 10 గ్రాములకు బదులు సుమారు 15 గ్రాములదాకా తీసుకుంటారు. ఇలాంటి సందర్బంలో మూత్రపిండాలు శరీరంలోకి చేరుకున్న అదనపు ఉప్పను మూత్రం ద్వారా విసర్జించి సమతుల్యతను కాపాడుతాయి.
అయితే, బీపీ ఉన్నవాళ్లు కొందరు ఉప్పను అసలు తీసుకోరు. ఇలా చేయడం కూడా తప్పే. ఎంత హైవర్ టెన్షన్ ఉన్నవాళ్లు కూడా ఉప్పును తీసుకోవడం పూర్తిగా మానేయ కూడదు. ఒక పరిమితిలో తక్కువగా తీసుకోవాలి. బీపీ పేషేట్లు కాకుండా దిగువ సూచించిన పేషెంట్లు కూడా ఉప్పు తక్కువ వాడాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు తక్కువ ఉప్పు తీసుకోవాలి. లేకపోతే నెలసరికి వారం ముందు శరీరంలోకి నీరు చేరి ఉబ్బినట్టు తయారవుతారు. కిడ్నీలు పూర్తిగా పాడయిపోయి డయాలిసిస్ చేయించుకుంటున్న పేషేంట్లు ఉప్పును కొద్దిగా కాదు కదా అసలు తీసుకోకూడదు. సిర్రోసిన్ అనబడే లివరుకు సంబంధించిన వ్యాధి ముదిరిపోయిన పేషేంట్లు ఉప్పను పూర్తిగా మానేయాలి. హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న వాళ్ళు, గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యం తక్కువ కల పేషేంట్లు ఉప్పుకు దూరంగా ఉండాలి. వీళ్ళకు కాళ్ళలో నీరు చేరటం, ఊపిరి అందకపోవటం లాంటి లక్షణాలు ఉంటాయి. ఫాస్టు ఫుడ్స్ ఎక్కువగా తినేవారికి ఎముకలపై ఉండే త్వచం పలుచబడడమే కాకుండా ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. అందుకనే ఉప్పు తక్కువగా తినాలి.
ఉప్పు ఎలా తగ్గించుకోవాలి ?
మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు.
1. నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది.
2. ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు.
3. ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.
4. డబ్బాల్లో నిల్వ ఉన్న పదార్థాలకు బదులుగా తాజా పళ్లు తీసుకోవాలి.
5. ఉప్పుతో తయారు చేసిన స్నాక్స్, చిప్స్‌ను బాగా తగ్గించాలి.
6. ఉప్పు కలుపుకోకుండా మజ్జిగ తీసుకోవాలి.
7. పొటాషియం ఎక్కువుండే అరటిపళ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తాయి.
8. అధిక బరువు ఉన్నవారు తమ ఎత్తు, వయసుకు తగ్గ బరువుండాలి.
9. ఆల్కహాలు, ధూమపానం మానాలి.
10. ఆహార పదార్థాల మీద అదనంగా ఉప్పు చల్లుకోవడం మానాలి.
11. కూల్‌డ్రింక్స్ మానాలి.

Wednesday, August 28, 2013
ఆరోగ్యవంతమైన కీడ్నీలకు ఆహార వైద్యం
దు అంశాలను విడిచిపెట్టి, 'జీవన విధాన' పద్ధతులను పాటిస్తే మూత్రపిండాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు పలువురు వైద్య రంగ నిపుణులు.
దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2-4 లక్షల మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. పదిమందిలో ప్రతి ఆరుగురు క్రానిక్ కిడ్నీ డిసీస్(సికెడి) వ్యాధిగ్రస్తులున్నారు. మరి మూత్రపిండాల వ్యాధులకు దూరంగా ఉండటానికి వదిలేయాల్సిన అయిదు అంశాలు ఏమిటంటే..
మూత్ర పిండాల వ్యాధులకు లేదా సమస్యలకు ఎక్కువగా ఉప్పు, చక్కెర, నిశ్చల జీవనశైలి, మానసిక ఒత్తిడి, ధూమపానం కారణమవుతున్నట్టు నిపుణులు తేల్చి చెబుతున్నారు.
మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నవారంతా యువకులేనని ఐటీ క్యాపిటల్ బెంగళూర్లో ఇటీవల వెల్లడైన కొన్ని సర్వేల సారాంశం. వారంతా వ్యర్థమైన ఆహార పద్ధతులు(జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటివి), అధిక ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగానే మూత్రపిండాల వ్యా«ధులకు గురవుతున్నారని చెబుతున్నారు డాక్టర్లు. అందుకే బెంగళూరులోని ప్రముఖ వైద్యులు, నెఫ్రాలజిస్టులు, కన్సల్టెంట్స్ సహా వైద్యరంగం మొత్తం కిడ్నీ రోగాలకు దూరంగా ఉండాలంటే ఆహారం, జీవన విధానంలో స్పష్టమైన జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం, దేశంలో కిడ్నీ రోగాల బారినపడుతున్న వారి వయసు 20-30 లోపే ఉంటోందట. వారిలో అత్యధిక శాతం సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు ఉండటం గమనించాల్సిన విషయం.
సాఫ్ట్వేర్ ఉద్యోగమంటేనే కుర్చీలో కొన్ని గంటలపాటు కూర్చుని, శరీరాన్ని కదపకుండా చేయాల్సి ఉంటుంది. దానికి తోడు ఐటీ ఉద్యోగుల ఆహారపు అలవాట్లలో ఫాస్ట్ఫుడ్/జంక్ఫుడ్కు ప్రాధాన్యం ఎక్కువ. దాంతోపాటు స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం మూత్రపిండాలు చెడిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. సీనియర్ నెఫ్రాలజిస్టు, మణిపాల్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ సుదర్శన్ బల్లాల్ ఆ విషయం ప్రస్తావిస్తూ 'నా దగ్గరకి వచ్చే కిడ్నీ పేషెంట్లలో 30 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్సే. అది కూడా 30 ఏళ్ల లోపు వారు. వీరి సమస్యలకు డయాబెటిస్, హైబీపీ, ఆహారపు అలవాట్లే ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి' అన్నారు.
సరైన ఆహారం
కిడ్నీ సంబంధ వ్యాధిగ్రస్తులు, ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండాలనుకునే వారూ కింది డైట్ను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.
రెడ్కాప్సికమ్: నిజానికి కాప్సికమ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ రెడ్ క్యాప్సికమ్ మాత్రం కిడ్నీ ఫెయిల్ అయినవారికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాప్సికమ్ రక్తంలోని మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ కిడ్నీ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఉడికించుకుని, రోస్ట్ చేసుకుని ఎలా తిన్నా ఫరవాలేదు.
ఎగ్వైట్: అంటే గుడ్డులోని పసుపు రంగు కాకుండా మిగిలిన తెల్లని పదార్థం. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఫాస్పరస్ తక్కువగా ఉన్న ప్రొటీన్స్ చాలా అవసరం. అలాంటి ప్రొటీన్స్ లభించే ఆహార పదార్థాల్లో గుడ్డుదే మొదటి స్థానం. అందుకే ఎగ్వైట్ను ఎక్కువగా తింటే కిడ్నీ రోగాల బారి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.
కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ను బాగా ఉడికించి తక్కువ మోతాదులో ఉప్పు, కారం చల్లుకుని తినవచ్చు. కాలీఫ్లవర్లో ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్ ఎక్కువగా ఉండటం వలన అది శరీరంలోని శరీరంలోని టాక్సిక్ వ్యర్థాన్ని పూర్తిగా తగ్గించగలుగుతుంది.
క్యాబేజీ: ఇందులో ఫిటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని దెబ్బతీసే 'రాడికల్స్'ను అంతం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది.
చేపలు: చేపలు ఇన్ఫ్లమేటరీ కొవ్వు, ఒమేగా-3ని నియంత్రించే శక్తిని కలిగి ఉంటాయి. అది కిడ్నీల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ప్రొటీన్స్కు కూడా చేపలు ముడిసరుకులాంటివి కనుక వాటిని ఆహారంగా తీసుకోవడం అన్ని రకాలుగానూ మంచిదే.
జ్యూస్: పండ్ల రసాలు, కూరగాయల రసాలు కిడ్నీలు చెడిపోకుండా కాపాడగలుగుతాయి. అయితే రోడ్ల మీద దొరికే రసాలు కాకుండా, ఐస్ వాడకుండా ఇంట్లో తయారు చేసుకున్నవైతేనే ఫలితం ఉంటుంది. కూరగాయలు, పండ్ల రసాలలో ఉండే ఫిటోకెమికల్ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కిడ్నీలనూ రక్షించడంలోనూ సహాయపడతాయి.
ఉలవచారు: శీతాకాలంలో ఉలవచారు ఎక్కువగా తీసుకోవడం, మంచినీటిని వేడి చేసుకుని తాగటం కూడా మూత్రపిండాల భద్రతకు ఉపయోగపడుతుంది.
Tuesday, August 27, 2013
* మీ ఆరోగ్యం మీ చేతుల్లో!
ఆరోగ్యంగా ఉండాలంటే, పుష్టికరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం చాలా కీలకమని అందరికీ తెలుసు. అయితే, ఎప్పుడూ వాటి గురించే ఆలోచించకుండా కాస్తంత రిలాక్స్ అవడం కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమే. అయితే, పొద్దున్నే జోరున వాన కురుస్తూ జిమ్‌కు వెళ్ళడానికి వీలు లేకపోవచ్చు. అలాగే, మరీ అతిగా చలిగా ఉంటూ, బద్ధకం అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇంట్లోనే ఉంటూనే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మార్గాలున్నాయి. సాదాసీదాగా ఆహారం తీసుకుంటూనే, చిన్న చిన్న వ్యాయామాలతో కాలక్షేపం చేయడం వల్ల ఆనందం, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా అందుకోవచ్చు.
చిరు తిండిగా పాప్‌కార్న్
మధ్యాహ్నం భోజనం తరువాత మళ్ళీ రాత్రి వేళ భోజనం చేసే వరకు ఖాళీ కడుపుతో ఉండడం ఆరోగ్య రీత్యా సరైనది కాదు. మధ్యలో ఆకలి వేసినప్పుడు ఏవో చిరుతిండ్లు తింటాం. అయితే, ఆ చిరుతిండ్లు మరీ ఎక్కువైనా, అనారోగ్యకరమైనవి అయినా ఇబ్బందే. వేపుడు పదార్థాలు, ఏవి పడితే అవి తినడం కాకుండా జాగ్రత పడాలి. అనారోగ్యకరమైనవి తినే కన్నా ఓ గిన్నెలు తాజా పండ్ల ముక్కలు పెట్టుకొని తినడం మంచిది. అది కుదరకపోతే, దానికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా పాప్‌కార్న్ తినవచ్చని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, పండ్లు, కాయగూరల కన్నా దాదాపు రెట్టింపు పరిణామంలో పాప్‌కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ నుంచి, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా, పాప్‌కార్న్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. సజావుగా జీర్ణమవుతుంది. ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా పాప్‌కార్న్ దోహదం చేస్తుంది. పైపెచ్చు, పాప్‌కార్న్‌లో కేలరీలు తక్కువ. 'బి' విట మిన్లు ఎక్కువ. ఆరోగ్యవంతమైన చిరుతిండ్లు తినడం వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది. మెరుగైన రీతిలో ఏకాగ్రత ఏర్పడు తుంది. దాంతో, పనిలో సామర్థ్యం కూడా పెరుగు తుంది. ఏతావతా, ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే చిరుతిండ్లను తినకుండా పాప్‌కార్న్‌కు పరిమితమైతే భేషుగ్గా ఉంటుందన్న మాట!
హాయిగా నవ్వండి!
ఒక్కోసారి ఎంతో అలసటగా అనిపిస్తుంటుంది. దాంతో, ఓ పట్టాన జిమ్‌కు వెళ్ళబుద్ధి కాదు. ఎక్సర్‌సైజులు చేయాలనీ అనిపించదు. అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా బద్ధకించి, అడపాదడపా ఎక్సర్ సైజులకు డుమ్మా కొట్టేసినా ఫరవాలేదు. కాకపోతే, ఎక్సర్‌సైజులు చేయకుండానే చేసినంత ఫలితం రావాలంటే, ఓ చిన్న చిట్కా ఉందంటున్నారు. అది ఏమిటంటే - పడీ పడీ నవ్వడం! కడుపు నొప్పి పుట్టే లాగా తెగ నవ్వడం వల్ల ఆనందమే కాక, మరో ఉపయోగం కూడా ఉంది. అలా నవ్వడమనేది ఓ మోస్తరు స్థాయిలో వ్యాయామం చేసిన దానితో సమానమని పరిశోధనల్లో తేలింది. పగలబడి నవ్వడం వల్ల మన మానసిక స్థితి మెరుగవుతుంది.అంతేకాక, అధిక రక్తపోటు తగ్గుతుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పుంజు కుంటుంది. కాబట్టి, రోజూ కనీసం ఓ పావుగంట సేపు హాయిగా నవ్వుకోవడమనేది మన శరీరంలోని రక్తనాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, కనీసం ఎక్సర్‌సైజ్ ఎగ్గొట్టిన రోజైనా, కడుపారా నవ్వుకోవడానికి ప్రయత్నించాలన్న మాట.
కాస్తంత చాక్లెట్ తినండి!
రోజు విడిచి రోజు కొద్దిగా డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణుల ఉవాచ. ఎందుకంటే, డార్క్ చాక్లెట్‌లో 'ఎపి కటెచిన్' అనే పదార్థం ఉంటుంది. ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు కండరాలు ఏ రకంగా స్పంది స్తాయో, అదే రకమైన స్పందన కలిగేలా ఈ పదార్థం తోడ్పడుతుందట!
కండరాలు వయస్సు మీరడాన్ని ఇది నెమ్మదింపజేస్తుందట! అలాగే, డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లుం టాయి. అవి ఆరోగ్యాన్ని కాపాడడమే కాక, ముఖంపై మడతలు పడడాన్ని అడ్డుకుంటాయి.
అయితే, చాక్లెట్‌తో ఉపయోగాలు ఉన్నాయ న్నారు కదా అని అదే పనిగా తినేయకండి! ఏదైనా మితంగా ఉంటేనే ఉపయోగమని గ్రహించండి.
ఆహ్లాదభరిత సంగీతం వినండి!
సంగీతం వల్ల ఉపయోగాల గురించి అందరికీ తెలిసిందే. ఆరోగ్యవంతమైన జీవనశైలితో గడపాలంటే, అందుకు సంగీతం కూడా కీలకం. సంగీతం వినడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. అంతే కాకుండా, మానసికమైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. వ్యాధులపై యాంటీ బాడీల పోరాట స్థాయిని కూడా అది పెంచుతుంది. అలాగే, కార్డియో వాస్క్యులర్ పరంగా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చివరకు నొప్పి లాంటి బాధల నుంచి సాంత్వన పొందడానికి కూడా సంగీతం పనికొస్తుందని కొంతమంది నిపుణులు వెల్లడించారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికీ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ కూడా సంగీతం ఉపకరిస్తుందని వారి మాట. కాబట్టి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా వెనుక నుంచి సన్నటి స్వరంలో సంగీతం వినిపించేలా చూసుకోవడం మెరుగని వారు సూచిస్తున్నారు.
కాసేపు బయట నడవండి!
మన శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యమైనదని చాలా మంది మర్చిపోతుంటారు. విటమిన్ డి గనక లోపిస్తే, ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది.కానీ, విటమిన్ డి కావాలంటే, ఒంటికి సూర్యరశ్మి తగలడం అవసరం. కాబట్టి, వీలైనంత వరకు ప్రతి రోజూ కాసేపు ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తగిలేలా షికారు చేయండి. సూర్య ప్రతాపం మరీ ఎక్కువగా ఉండని ఈ సమయాల్లో తిరగడం వల్ల మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి అది అత్యవసరమైన పోషకం.
ఏతావతా, రోజూ వ్యాయామం చేయాలి. అలా వ్యాయామం చేస్తున్నప్పటికీ, పైన చెప్పిన సలహాలు, సూచనలు పాటించడం మంచిది. పైపెచ్చు, ఒకటీ, అరా రోజులు వ్యాయామం కుదరనప్పుడు ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో మహత్తరంగా తోడ్పడతాయి.

* నడుము చుట్టుకొలత తగ్గాలంటే...
త్రికోణాసనాన్ని ఒకవైపు నుంచి గుండ్రంగా తిప్పటాన్ని పరివృత్త త్రికోణాసనం అంటారు.
చేసే విధానం
నిలబడి తాడాసన స్థితిలో ఉండి, రెండు పాదాలను దూరంగా ఉంచాలి. అరచేతులను
నేలను చూస్తూ ఉన్నట్లుగా రెండు చేతులను భుజం ఎత్తులో నేలకు సమాంతరంగా
ఉంచాలి. కుడివైపు 90 డిగ్రీల కోణంలో నడుమును కాళ్లను కదపకుండా తిప్పాలి.
కుడి పాదాన్ని తాకేటట్లుగా ఏడమ చేతిని నేలపై ఉంచి నడుమును నెమ్మదిగా కిందకు
వంచాలి. పైకెత్తిన కుడి అరచేతిని చూస్తూ ఉండాలి. ఉండగలిగినంత సమయం ఉండి,
ఆసనం నుంచి బయటకు రావాలి. తాడాసన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి. ఇదే
విధంగా నడుమును ఎడమవైపు తిప్పి చేయాలి.
ప్రయోజనాలు
అధిక
బరువును తగ్గిస్తుంది. నడుము చుట్టుకొలతను తగ్గించి వేస్తుంది. పొట్ట
భాగంలో కొవ్వుని కరిగించి వేవస్తుంది. మూత్ర పిండాల సామర్థ్యం పెరుగుతుంది.
గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం తగ్గుతాయి. ఉదర భాగంలోని అవయవాలన్నింటికి
మసాజ్‌లాగా జరిగి వాటికి రక్త ప్రసరణ పెరుగుతుంది. నడుము, భుజాల కండరాలు
బలపడతాయి. నడుము, భుజాల నొప్పులు తగ్గుతాయి. పిల్లల్లో ఏకాగ్రతను
పెంచుతుంది. మంచి శరీరాకృతిని కలిగిస్తుంది.
జాగ్రత్తలు
అధికంగా నడుము నొప్పి, గుండె జబ్బులు ఉన్నవారు యోగా నిపుణుల సలహాలను
పాటిస్తూ ఈ ఆసనాన్ని సాధన చేయాలి. ఈ ఆసనం వేసేటప్పుడు మోకాళ్లు, మోచేతులను
వంచకూడదు.
గుప్పెడు పిస్తా తింటే అందం-ఆరోగ్యానికి చాలా లాభం

పిస్తా పశ్చిమ ఆసియా నుండి దిగుమతి అయ్యే పండు. పశ్చిమసియా ఉత్పత్తి అయినా కూడా ఇది మధ్యధరాప్రాంతంలో అందుబాటులో ఉంది. పోషక విలువలు అధికంగా ఉండే ఈ పిస్తా పండు యొక్క , పైన మందపాటు డొల్ల(పొట్టు లేదా బాహ్యకవచం)ఉంటుంది. దీన్ని తొలగిస్తే, లోపల ఉండే పిస్తా పప్పు, పసుపువచ్చ వర్ణంలో ఉంటుంది. దీన్ని సాధారణంగా తినేటువంటి ఒక డ్రైఫ్రూట్.
పిస్తా లో పోశాకపదర్దము ఎక్కువ . పొటాషియం అత్యధికం గా లబిస్తుంది-శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి ప్రోటీన్ల తయారీ , శోషణము లో ఉపయోగపాడుతుంది .మిగిలిన ఎండు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ . anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది . పిస్తా లో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికం గా ఉన్నందున ఎక్కువగా తినకూడదు ... వారం లో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు . రక్తం లో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి , అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లు గా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో పిస్తాపప్పు యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే లోతుగా పరిశీలించాల్సిందే...
పిస్తాలు-'ఆరోగ్య ప్రయోజనాలు:
ఆరోగ్యకరమైన గుండె కోసం:
స్తాపప్పులను ప్రతిరోజూ తీసుకుంటే గుండెను ఒత్తిడి నుంచి కాపాడవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. పిస్తా చెడు కొలెస్ట్రాల్, ఎడిఎల్ తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. గుండె జబ్బులు నిరోధించడంలో మంచి కొలెస్ట్రాల్, HDL బాగా సహాయపడుతుంది. నరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది . దాంతో గుండె స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.
యాంటీఇన్ఫ్లమేటరి లక్షణాలు:
పిస్తాలో ఆరోగ్యకరప్రయోజనాలు కలిగించే విటమిన్ ఎ, విటమిన్ E మరియు యాంటీఇన్ఫ్లమేటరీ (శరీరంలో బాధను తగ్గించడం)శోథ నిరోధక లక్షణాలు ఉనికిని కలిగి ఉంది.
మధుమేహం నిరోధిస్తుంది:
టైప్ 2 డయాబెటిస్ నిరిధించడానికి అవసరం అయ్యే ఒక కప్పు పిస్తాలో రోజువారి అవసరంఅయ్యే ఫాస్పరస్ 60% ఉంటుంది. కూడా పిస్తాపప్పులో ఉండే ఫాస్పరస్ గ్లూకోస్ టాలరెన్స్ గా రూపొందడానికి ప్రోటీనులు అమైనో ఆమ్లాలుగా మార్చబడుతుంది.
హీమోగ్లోబిన్ మరియు రక్తం:
పిస్తాపప్పులో నిల్వ ఉండే విటమిన్ B6 అనే ప్రోటీన్ రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికిగాను సహాయపడుతుంది. పిస్తాపప్పులో అధిక పరిమాణంలో బి6 ఉన్నందున, వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ పరిమాణం పెంచడానికి మరియు హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది.
పిస్తాపప్పులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి:
ఇవి చర్మం మెరుస్తూ, ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. మీ డైట్ లో గ్రీన్ ఆపిల్ చేర్చుకోవడం వల్ల కూడా మీకు అన్ని వేళలో రేడియంట్ స్కిన్ పొందవచ్చు.
విటమిన్ E
విటమిన్ E పుష్కలంగా ఉండటం వల్ల, ఒక కొవ్వు కరిగించే యాంటీయాక్సిడెంట్ గా ఒక గొప్ప పాత్రపోషిస్తుంది. పిస్తాలు ఆరోగ్యమైన మరియు హృదయపూర్వక చర్మం నిలబెట్టడానికి ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మరియు ఇవి సన్ డ్యామేజ్ నుండి చర్మానికి రక్షణ కల్పించబడుతుంది. అందువల్లే చర్మ క్యాన్సర్ మరియు సన్ బర్న్ నుండి రక్షణ కల్పించబడుతుంది.

Monday, August 26, 2013
Anti Aging Foods
ప్రస్తుత రోజుల్లో అకాల వృద్ధాప్యం సాధారణంగా కనిపించే సమస్యగా ఉంది.
అందుకు కారణం బిజీ జీవితాలు. దాంతో సరైన నిద్ర, ఆహారాలు కొరవడుతాయి. దాని
ఫలితంగా అనారోగ్యాలు ఎదురౌతాయి. అంతే ఇక ఆరోగ్యాన్ని సరిగా కాపాడుకోకపోవడం
వల్ల, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జబ్బులు మనుషులను
ఆధోళనకు గురిచేస్తాయి. జీవితం ఎంత
కష్టతరమైనా, ఎంత బిజీగా ఉన్నాకూడా ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా
ముఖ్యం. అందులో మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యకరమైనది అయితే మరికొద్ది రోజు
బ్రతకాడానికి అవకాశం ఉంటుంది. అదినిజం. అంతే కాకుండా మంచి ఆహారంతో పాటు
చిన్నపాటి వ్యాయామాల వల్ల చిన్న వయస్సులోనే వచ్చే వృద్ధాప్య లక్షణాలను
తొలగించుకోవచ్చు.
మనం తీసుకొనే ఆహారాలు, పూర్తిగా ఉపయోగపడేవిగా ఉండాలి. ముఖ్యంగా రసాయనికంగా పండిచిన ఆహారాలకు దూరంగా ఉంటూ, సేంద్రియ సద్దతులో పండించిన వాటికి ప్రాధాన్యత కల్పించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తీసుకొనే ఆహారంలో విటమిన్లు, మినిరల్స్, మరియు యాంటీఆక్సిండెంట్లు మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
మనం తీసుకొనే ఆహారంలో ఫోటో కెమికల్స్ మనకు తెలియకుండానే అనేక ప్రయోజనాలను మనకు అంధిస్తాయి. దాంతో అకాల వృద్ధాప్యంను నివారించవచ్చు. అనేక చర్మం సమస్యల నుండి బయటపడవచ్చు మరియు అనారోగ్యాలనుండి ఉపశమనం పొందవచ్చు.

Friday, August 23, 2013
శరీరంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచే కాకరకాయ
రుచికి చేదుగా వుండటం, వండేందుకు చాలా సమయం తీసుకోవడం వంటి కొన్ని కారణాలతో చాలామంది కాకరకాయను ఇష్టపడరు. కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. కాకరకాయలోని చేదు మధుమేహం వ్యాధికి విరుగుడని మనదేశంలో చాలామంది నమ్ముతుంటారు. హెర్బల్ వైద్యంలో కాకరకాయది కీలకమైన స్థానమే. కాకరకాయ పలు రోగాలకు మందుగా కూడా పనిచేస్తుంది. అలా అని తరచుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటే దీనికి వేడి కలిగించే గుణముంది. ఇందులో ఎక్కువ మోతాదులో 'Planu Insulin' ఉంటుంది. ఇది రక్తంలోని Sugar ని ప్రభావ వంతంగా తగ్గిస్తుంది. పరకడుపున 3/4 కాకరకాయ రసాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. కూర కూడా ప్రతిరోజు తీసుకోవచ్చు. కాకరకాయ గింజలను మెత్తగా నూరి నీటిలో కలిపి రోజు 1 Tea Spoonతీసుకోవాలి. కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకుంది. కాకర వంటకాలు తిని ఆ లాభం పొందవచ్చు. కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది. రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటి లేదా రెండు నెలలపాటు తాగితే ఈ వ్యాధి నయమవుంతుంది. షుగర్ వ్యాధి గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. కాకరను ఆహారంగా తీసుకున్నా, షుగర్ స్థాయి మారుతుంది. మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండుసార్లు అరస్పూన్ చొప్పున తీసుకుంటే చాలు. కాకరకాయలను గర్బిణీలు తినకూడదు. కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు. పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటి పచ్చదనం కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి. కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్ రసం తీసుకుంటే చాలు.
Thursday, August 22, 2013
నడకతో గుండె పదిలం
రాత్రి బాగానే ఉన్నాడు. ఉదయాన్నే హార్ట్ఎటాక్తో పోయాడు. ఆ వ్యక్తిని చూస్తే గుండె జబ్బు ఉన్న మనిషిలా కూడా కనిపించే వాడు కాదు. ఇలాంటి వార్తలు రోజూ వింటూనే ఉంటాం. కానీ గుండె జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. నిజానికి గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉందని అంటున్నారు వైద్యులు. -ఉదయాన్నే వాకింగ్ వెళ్లాలంటే చాలా బద్దకం. నిజానికి నడక గుండెకు మంచిది. అందుకే రోజూ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోండి. - డైనింగ్ టేబుల్పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోవాలి. - రోజూ ఐదు రకాల పండ్లు తినండి. - ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి. - గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది. - పొగతాగే అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను స్మోకింగ్ మరింత పెంచుతుంది. - కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. - లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి. - బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. - ఏడాదికొకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. - డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరవకండి. షుగర్ ఉన్న వారికి(ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.
Subscribe to:
Posts (Atom)