శరీరంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచే కాకరకాయ
రుచికి చేదుగా వుండటం, వండేందుకు చాలా సమయం తీసుకోవడం వంటి కొన్ని కారణాలతో చాలామంది కాకరకాయను ఇష్టపడరు. కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. కాకరకాయలోని చేదు మధుమేహం వ్యాధికి విరుగుడని మనదేశంలో చాలామంది నమ్ముతుంటారు.
హెర్బల్ వైద్యంలో కాకరకాయది కీలకమైన స్థానమే. కాకరకాయ పలు రోగాలకు మందుగా కూడా పనిచేస్తుంది. అలా అని తరచుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటే దీనికి వేడి కలిగించే గుణముంది. ఇందులో ఎక్కువ మోతాదులో 'Planu
Insulin' ఉంటుంది.
ఇది రక్తంలోని Sugar ని ప్రభావ వంతంగా తగ్గిస్తుంది. పరకడుపున 3/4 కాకరకాయ రసాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. కూర కూడా ప్రతిరోజు తీసుకోవచ్చు. కాకరకాయ గింజలను మెత్తగా నూరి నీటిలో కలిపి రోజు 1 Tea Spoonతీసుకోవాలి.
కీళ్ళనొప్పులు
తగ్గించే
గుణం
కాకరకుంది.
కాకర
వంటకాలు
తిని
ఆ లాభం పొందవచ్చు. కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.
కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది.
రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటి లేదా రెండు నెలలపాటు తాగితే ఈ వ్యాధి నయమవుంతుంది.
షుగర్ వ్యాధి గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. కాకరను ఆహారంగా తీసుకున్నా, షుగర్ స్థాయి మారుతుంది.
మలబద్ధకాన్ని
వదిలించుకునేందుకు
రోజుకు
రెండుసార్లు
అరస్పూన్
చొప్పున
తీసుకుంటే
చాలు.
కాకరకాయలను
గర్బిణీలు
తినకూడదు.
కాకర
చేదు
ఆ సమయంలో మంచిది కాదు. పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు.
తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటి పచ్చదనం కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి.
కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్ రసం తీసుకుంటే చాలు.
No comments:
Post a Comment