Monday, August 19, 2013

దీర్ఘకాలం పాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే చిట్కాలు

ప్రతి రోజూ 8 గ్లాసుల నీరు తాగండి .
మీ శరీరాన్ని శుభ్ర పరచేది నీరు మాత్రమే. కనుక, తగినన్ని ద్రవాలు తీసుకోవటం మీ కిడ్నీ లను శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది.
నేటి రోజులలో ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తూనే వున్నది. మీ కిడ్నీలు శరీరంలో చాలా ప్రధాన అవయవాలు. ఇవి లేకుండా మానవులు జీవించ లెరు. మీకు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, ఒక్కసారి భయంకరమైన డయాలసీస్ చేసే పరిస్థితిని ఊహించుకొండి. కనుక కిడ్నీలకు హాని రాకుండా వాటి పోషణ మరియు సంరక్షణ ప్రధానం .
మంచి పోషకాలుకల ఆహారం కిడ్నీల ఆరోగ్యానికి సహకరిస్తున్ది. ఈ ఆరోగ్యకరమైన కిడ్నీ ఆహారాలు కిడ్నీ లను ధృడ పరుస్తాయి. మీ కిడ్నీలు ప్రధానంగా శరీరంలో బ్లడ్ ను శుభ్ర పరుస్తాయి. అవి శరీరంలోని మలినాలను జల్లెడ పట్టి బయటకు పంపుతాయి. కనుక మీరు మీ కిడ్నీ లను శుభ్రంగా వుంచుకొవాలి. మరి కిడ్నీ లను శుభ్రం చేసుకోవడానికి ద్రవ పదార్ధాలను అధికంగా తీసుకోవటం మంచి మార్గం.
కనుక తగినంత నీరు తాగటం ఈ ప్రశ్నకు సరైన సమాధానం. కొన్ని చెడు అలవాట్లను వదలివేయటం కూడా కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. స్మోకింగ్ చేయుట, ఆల్కహాల్ తీసుకొనుట, అధిక ఒత్తిడికి గురి అగుట కిడ్నీలపై అనవసర ఒత్తిడి కలిగిస్తుంది. కనుక కిడ్నీల సంరక్షణకు ఈ అలవాట్లను వదలాలి.
ప్రతి రోజూ 8 గ్లాసుల నీరు తాగండి .

మీ శరీరాన్ని శుభ్ర పరచేది నీరు మాత్రమే. కనుక, తగినన్ని ద్రవాలు తీసుకోవటం మీ కిడ్నీ లను శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది.

తరచుగా మూత్రం పోయండి

రోజులో ఎక్కువ సార్లు మూత్రం పోయటం కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. అయితే ప్రతి సారి మీ మూత్రపు సంచి నిండి వున్దాలి.

మసాలా ఆహారాలు తినవద్దు.

కారం కల మిర్చి తినటం కిడ్నీలకు మంచిది కాదు. అధిక మసాలా ఆహారాలు మీ లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. కనుక మీ ఆహారంలో తగుమాత్రం కారాలు ఉండేలా చూసుకోండి.
స్మోకింగ్ వదలండి
సిగరెట్ లలో కాడ్ మియం అనే మెటల్ వుంటుంది. అది మీ కిడ్నీల లైనింగ్ లో డిపాజిట్ అవుతుంది . కిడ్నీల పనిని ఇది మందగిస్తుంది. రీనల్ ఫెయిల్యూర్ కు కూడా దోవ తీస్తుంది.
అధిక ఒత్తిడి
కిడ్నీ లను ఎలా సంరక్షించు కోవాలి అని మీరు ఒత్తిడికి గురవుతూంటే, ముందుగా మీరు కొంత రిలాక్స్ అవటం అవసరమ్. కిడ్నీలు డామేజ్ అయ్యేటందుకు ఒత్తిడి ఒక ప్రధాన కారణం. కనుక రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా వుండి కిడ్నీలు బాగా పని చేసేలా చూసుకోండి.
బాగా నిద్రించండి
అలసిన మీ శరీర కణాల పునరుజ్జీవానికి చక్కటి శరీర విశ్రాంతి అవసరం. కనుక బాగా నిద్రించండి. మీ ఇతర శరీర అవయవాల వలెనె, కిడ్నీ లు కూడా అధిక పని చేస్తే అలసి పోతాయి. కనుక ప్రతి రోజూ 8 గంటల పాటు తప్పక నిద్రించండి.
యోగ అభ్యాసం

యోగ లోని కొన్ని భంగిమలు కిడ్నీ లు సవ్యంగా పని చేసేలా చెస్తాయి. మీ కిడ్నీల మంచి పని తీరుకు క్రేన్, క్రేసేంట్ లున్గే భంగిమలు రెండూ బాగా పని చేస్తాయి.

No comments:

Post a Comment