Health
Thursday, August 29, 2013
డయాబెటీస్ - నడక!
ప్రతిరోజూ పదివేల అడుగులు నడిస్తే డయాబెటీస్ దగ్గరకు రాదంటున్నారు నిపుణులు. ఈ నడక శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని 3 శాతం పెంచుతుందని, బాడీ మాస్ ఇండెక్స్ 1 శాతం తగ్గిస్తుందని కూడా చెపుతున్నారు.
ఇండియాలో ఇప్పటికి 71 మిలియన్న జనాభా ఈ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిక్స్ ఫెడరేషన
్ వెల్లడించింది. ఇది చాలా ఎక్కువని వీరు భావిస్తున్నారు. గత కొద్ది దశాబ్దాలనుండి భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లు తీవ్రస్ధాయి మార్పులకు గురయ్యాయని, సాంప్రదాయక వంటకాలనుండి కార్బో హైడ్రేట్లు అధికంగా వుండే పాశ్చాత్య వంటకాలకు మొగ్గు చూపటమే దీనికి కారణమని వీరు భావించారు. దీనితో పాటుగా జీవనంలోని దైనందిన ఒత్తిడి కూడా ప్రధాన కారణమన్నారు.
ప్రతిరోజూ 30 నిమిషాల నడక, లేదా ఇతర వ్యాయామాలు గ్లూకోజ్ స్ధాయిని నియంత్రిస్తాయని తెలిపారు.
నడిస్తే, మన కండరాలు రక్తంలోని షుగర్ ను నియంత్రిస్తాయి. రక్తంలో బాగా కలిసేట్లు చేస్తాయి. ఫలితంగా గ్లూకోజు స్ధాయి తగినట్లుగా వుండి దాని ప్రభావం కొన్ని గంటలపాటు వుంటుంది. అయితే, అది ఎప్పటికి వుండేదికాదు. మరల భోజనం తర్వాత బ్లడ్ గ్లూకోజ్ స్ధాయి పెరుగుతుంది. విటమిన్ బి స్ధాయి తక్కువగా వున్నవారు ప్రత్యేకించి బ్లడ్ షుగర్ టెస్టులు చేయించుకోవాలని అందుకు తగిన విటమిన్లు వాడాలని కూడా నిపుణులు చెపుతున్నారు. సంతులిత ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు నడక వంటి వ్యాయామాలు చేయడం మాత్రమే షుగర్ వ్యాధి నియంత్రణకు తోడ్పడగలవని నిపుణుల అభిప్రాయం.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment