Tuesday, August 27, 2013

* నడుము చుట్టుకొలత తగ్గాలంటే...
త్రికోణాసనాన్ని ఒకవైపు నుంచి గుండ్రంగా తిప్పటాన్ని పరివృత్త త్రికోణాసనం అంటారు.
చేసే విధానం

నిలబడి తాడాసన స్థితిలో ఉండి, రెండు పాదాలను దూరంగా ఉంచాలి. అరచేతులను నేలను చూస్తూ ఉన్నట్లుగా రెండు చేతులను భుజం ఎత్తులో నేలకు సమాంతరంగా ఉంచాలి. కుడివైపు 90 డిగ్రీల కోణంలో నడుమును కాళ్లను కదపకుండా తిప్పాలి. కుడి పాదాన్ని తాకేటట్లుగా ఏడమ చేతిని నేలపై ఉంచి నడుమును నెమ్మదిగా కిందకు వంచాలి. పైకెత్తిన కుడి అరచేతిని చూస్తూ ఉండాలి. ఉండగలిగినంత సమయం ఉండి, ఆసనం నుంచి బయటకు రావాలి. తాడాసన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా నడుమును ఎడమవైపు తిప్పి చేయాలి.
ప్రయోజనాలు
అధిక బరువును తగ్గిస్తుంది. నడుము చుట్టుకొలతను తగ్గించి వేస్తుంది. పొట్ట భాగంలో కొవ్వుని కరిగించి వేవస్తుంది. మూత్ర పిండాల సామర్థ్యం పెరుగుతుంది. గ్యాస్‌ ట్రబుల్‌, మలబద్ధకం తగ్గుతాయి. ఉదర భాగంలోని అవయవాలన్నింటికి మసాజ్‌లాగా జరిగి వాటికి రక్త ప్రసరణ పెరుగుతుంది. నడుము, భుజాల కండరాలు బలపడతాయి. నడుము, భుజాల నొప్పులు తగ్గుతాయి. పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుంది. మంచి శరీరాకృతిని కలిగిస్తుంది.

జాగ్రత్తలు
అధికంగా నడుము నొప్పి, గుండె జబ్బులు ఉన్నవారు యోగా నిపుణుల సలహాలను పాటిస్తూ ఈ ఆసనాన్ని సాధన చేయాలి. ఈ ఆసనం వేసేటప్పుడు మోకాళ్లు, మోచేతులను వంచకూడదు.

No comments:

Post a Comment