Monday, August 26, 2013

Anti Aging Foods

ప్రస్తుత రోజుల్లో అకాల వృద్ధాప్యం సాధారణంగా కనిపించే సమస్యగా ఉంది. అందుకు కారణం బిజీ జీవితాలు. దాంతో సరైన నిద్ర, ఆహారాలు కొరవడుతాయి. దాని ఫలితంగా అనారోగ్యాలు ఎదురౌతాయి. అంతే ఇక ఆరోగ్యాన్ని సరిగా కాపాడుకోకపోవడం వల్ల, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జబ్బులు మనుషులను ఆధోళనకు గురిచేస్తాయి. జీవితం ఎంత కష్టతరమైనా, ఎంత బిజీగా ఉన్నాకూడా ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యకరమైనది అయితే మరికొద్ది రోజు బ్రతకాడానికి అవకాశం ఉంటుంది. అదినిజం. అంతే కాకుండా మంచి ఆహారంతో పాటు చిన్నపాటి వ్యాయామాల వల్ల చిన్న వయస్సులోనే వచ్చే వృద్ధాప్య లక్షణాలను తొలగించుకోవచ్చు.
మనం తీసుకొనే ఆహారాలు, పూర్తిగా ఉపయోగపడేవిగా ఉండాలి. ముఖ్యంగా రసాయనికంగా పండిచిన ఆహారాలకు దూరంగా ఉంటూ, సేంద్రియ సద్దతులో పండించిన వాటికి ప్రాధాన్యత కల్పించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తీసుకొనే ఆహారంలో విటమిన్లు, మినిరల్స్, మరియు యాంటీఆక్సిండెంట్లు మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
మనం తీసుకొనే ఆహారంలో ఫోటో కెమికల్స్ మనకు తెలియకుండానే అనేక ప్రయోజనాలను మనకు అంధిస్తాయి. దాంతో అకాల వృద్ధాప్యంను నివారించవచ్చు. అనేక చర్మం సమస్యల నుండి బయటపడవచ్చు మరియు అనారోగ్యాలనుండి ఉపశమనం పొందవచ్చు.

No comments:

Post a Comment