Friday, August 30, 2013

సాయంకాలం ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి?

బాదం పప్పులు : మీకు సాయంకాలం పూట ఆకలి అయితే బాదం పప్పులు తినండి. ఇది చక్కటి చిరుతిండి. ఎందుకంటే కడుపూ నిండుతుంది,అదే విధంగా మీకు కూడా కాస్త ఆకలి తీరి, శక్తి కూడా వస్తుంది.
ఆపిల్ : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండడమే కాక, మీ క్యాలరీల స్వీకరణ కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని రోజుకో ఆపిల్ తినండి. ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ అందుతుంది, కొలెస్టరాల్ ను కూడా తగ్గిస్తుంది.
వేరుశనగ పప్పులు : వేరుశనగలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. కనుక రోజుకు కొన్ని వేరుశనగలు తినండి. వాటిలో కేవలం 74 కేలరీలే వుంటాయి. అంతే కాదు, ఇవి తక్కువ గ్లూకోస్ కలిగి వుంటాయి కనుక శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. దాని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి వుంటుంది.
ద్రాక్ష పళ్ళు : కడుపు నిండి, తక్కువ కేలరీలు కావాలంటే ద్రాక్ష పళ్ళు సరైన మార్గం. ఒక 30 ద్రాక్ష పళ్ళు తినండి, ఎందుకంటే అవి రక్తహీనతను, అలసటను, కీళ్ళ నెప్పులను, కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను, తగ్గించడానికి దోహదం చేస్తాయి, కేవలం 100 కేలరీలు మాత్రమె కలిగి వుంటాయి.
పుచ్చకాయ : పుచ్చకాయలు మంచి డైట్ స్నాక్ గా చెప్పుకోవచ్చు. ఒక పుచ్చకాయలో కేవలం 88 కేలరీలు మాత్రమె వుంటాయి. అవి నీటితో తయారవుతాయి, అందువల్ల చాలా తక్కువ కేలరీలు వుంటాయి.
టమాటో సూప్ : మీకు తినడం ఇష్టం లేకపోతె, టమాటో సూప్ తాగండి, ఎందుకంటే అది చాలా తేలిగ్గా తయారు చేయవచ్చు, కేవలం 74 కేలరీలు మాత్రమె కలిగి వుంటుంది.
చెర్రీ : ఈ చిన్ని రుచికరమైన పళ్ళు పుష్కలంగా విటమిన్లు కలిగి వుంటాయి, తక్కువ కొవ్వు పదార్ధం కలిగి వుంటాయి. 25 చెర్రీలలో కేవలం 100 కేలరీలే వుంటాయి.
బ్లూ బెర్రీలు : ఈ అధ్బుత పదార్ధం ఒక కప్పులో 83 కేలరీలు వుంటాయి. బ్లూ బెర్రీలలో పుష్కలంగా యాంటీ ఆక్సిడేంట్లు వుండి, వార్ధక్య ప్రక్రియను మందగింప చేస్తాయి, మీ గుండెను రకరకాల జబ్బుల నుంచి కాపాడతాయి.
కివీ పండు : ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. రెండు కివీ పళ్ళను సాయంత్రం స్నాక్ గా తీసుకోండి. ఇవి కడుపు నింపుతాయి. వీటిలో కేవలం 58 కేలరీలే వుంటాయి. కాబట్టి సాయంత్రపు స్నాక్ గా దీన్ని తీసుకోండి. అంతేకాక కివి పళ్ళు జీర్ణక్రియకు సాయం చేస్తాయి. స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.

No comments:

Post a Comment