Monday, August 19, 2013

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్
డయాబెటిస్ నియంత్రించాలంటే అందుకు సరైన డయాబెటిక్ డైట్ ను ఫాలో అవ్వాలి. డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి లేదా డయాబెటిస్ నివారించడానికి లేదా డయాబెటిస్ రాకుండా నిరోధించడానికి ఏం తినాలి ఏం తినకూడదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇప్పటికి మీకు డయాబెటిక్ లేకున్నా లేదా ఒక వేళ డయాబెటిక్ లక్షణాలున్నా అది మొత్తం కుంటుంబానికి సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ డైట్ ను ఫాలో చేయడం వల్ల డయాబెటిస్ ను తొలగిస్తుంది. మన ఇండియన్స్ కు డయాబెటిస్ డైట్ నిష్పత్తి 60:20:20 లో పిండి పదార్థాలు లేదా ఫ్యాట్స్ మరియు ప్రోటీనులు ఉండాలి.
డయాబెటాలజిస్ట్ మరియు న్యూట్రీషియన్స్ నుండి 15 డయాబెటిస్ డైట్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలించండి...
ఒక టీస్పూన్ మెంతులను 100ml నీళ్ళలో రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం తాగడం వల్ల డయాబెటిక్ ను కంట్రోల్లో ఉంచడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
టమోటో జ్యూస్ కు ఉప్పు మరియు పెప్పర్ వేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపున త్రాగాలి.
గుప్పెడు బాదంను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, ఆనీటిని తీసుకోవడం వల్ల డయాబెటిక్ ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే డయాబెటిస్ చెక్ చేయడానికి సహాయపుడుతుంది.
తృణధాన్యాలు, వోట్స్, శెనగపిండి, మిల్లెట్స్ మరియు ఇతర అధిక ఫైబర్ ఆహారాలు భోజనంలో చేర్చుకోవాలి. మీకు పాస్తా లేదా నూడిల్స్ తినాలనిపించినప్పడు వాటిని ఖచ్చితంగా వెజిటేబుల్స్ తో లేదా /మొలకలతో చేర్చి తీసుకోవాలి.
శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీనులు రెండింటి కాంబినేషన్ పాలలో పుష్కలంగా ఉంది. కాబట్టి ప్రతి రోజు తగు మోతాదులో పాలను తీసుకోవడం వల్ల ఒక మంచి పద్దతి.
హై ఫైబర్ వెజిటేబుల్స్, పచ్చిబఠానీ, బీన్స్, బ్రొకోలీ మరియు ఆకుకూరలు/గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇంకా ఊక మరియు మొలకులుతో పప్పులు ఒక ఆరోగ్యకరమైన ఎంపిక కాబట్టి ఇవి మీ రెగ్యులర్ డైట్ లో భాగంగా ఉండాలి.
ఇతర కార్బోహైడ్రేట్స్ తో పోలిన ఆహారం కంటే పప్పులు, ధాన్యాలు రక్తంలోని గ్లూకోజ్ మీద ప్రభావంఎక్కవ ప్రభావం చూపెడుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న వెజిటేబుల్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తక్కువ చేస్తుంది మరియు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

No comments:

Post a Comment