దు అంశాలను విడిచిపెట్టి, 'జీవన విధాన' పద్ధతులను పాటిస్తే మూత్రపిండాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు పలువురు వైద్య రంగ నిపుణులు.
దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2-4 లక్షల మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. పదిమందిలో ప్రతి ఆరుగురు క్రానిక్ కిడ్నీ డిసీస్(సికెడి) వ్యాధిగ్రస్తులున్నారు. మరి మూత్రపిండాల వ్యాధులకు దూరంగా ఉండటానికి వదిలేయాల్సిన అయిదు అంశాలు ఏమిటంటే..
మూత్ర పిండాల వ్యాధులకు లేదా సమస్యలకు ఎక్కువగా ఉప్పు, చక్కెర, నిశ్చల జీవనశైలి, మానసిక ఒత్తిడి, ధూమపానం కారణమవుతున్నట్టు నిపుణులు తేల్చి చెబుతున్నారు.
మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నవారంతా యువకులేనని ఐటీ క్యాపిటల్ బెంగళూర్లో ఇటీవల వెల్లడైన కొన్ని సర్వేల సారాంశం. వారంతా వ్యర్థమైన ఆహార పద్ధతులు(జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటివి), అధిక ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగానే మూత్రపిండాల వ్యా«ధులకు గురవుతున్నారని చెబుతున్నారు డాక్టర్లు. అందుకే బెంగళూరులోని ప్రముఖ వైద్యులు, నెఫ్రాలజిస్టులు, కన్సల్టెంట్స్ సహా వైద్యరంగం మొత్తం కిడ్నీ రోగాలకు దూరంగా ఉండాలంటే ఆహారం, జీవన విధానంలో స్పష్టమైన జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం, దేశంలో కిడ్నీ రోగాల బారినపడుతున్న వారి వయసు 20-30 లోపే ఉంటోందట. వారిలో అత్యధిక శాతం సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు ఉండటం గమనించాల్సిన విషయం.
సాఫ్ట్వేర్ ఉద్యోగమంటేనే కుర్చీలో కొన్ని గంటలపాటు కూర్చుని, శరీరాన్ని కదపకుండా చేయాల్సి ఉంటుంది. దానికి తోడు ఐటీ ఉద్యోగుల ఆహారపు అలవాట్లలో ఫాస్ట్ఫుడ్/జంక్ఫుడ్కు ప్రాధాన్యం ఎక్కువ. దాంతోపాటు స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం మూత్రపిండాలు చెడిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. సీనియర్ నెఫ్రాలజిస్టు, మణిపాల్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ సుదర్శన్ బల్లాల్ ఆ విషయం ప్రస్తావిస్తూ 'నా దగ్గరకి వచ్చే కిడ్నీ పేషెంట్లలో 30 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్సే. అది కూడా 30 ఏళ్ల లోపు వారు. వీరి సమస్యలకు డయాబెటిస్, హైబీపీ, ఆహారపు అలవాట్లే ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి' అన్నారు.
సరైన ఆహారం
కిడ్నీ సంబంధ వ్యాధిగ్రస్తులు, ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండాలనుకునే వారూ కింది డైట్ను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.
రెడ్కాప్సికమ్: నిజానికి కాప్సికమ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ రెడ్ క్యాప్సికమ్ మాత్రం కిడ్నీ ఫెయిల్ అయినవారికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాప్సికమ్ రక్తంలోని మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ కిడ్నీ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఉడికించుకుని, రోస్ట్ చేసుకుని ఎలా తిన్నా ఫరవాలేదు.
ఎగ్వైట్: అంటే గుడ్డులోని పసుపు రంగు కాకుండా మిగిలిన తెల్లని పదార్థం. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఫాస్పరస్ తక్కువగా ఉన్న ప్రొటీన్స్ చాలా అవసరం. అలాంటి ప్రొటీన్స్ లభించే ఆహార పదార్థాల్లో గుడ్డుదే మొదటి స్థానం. అందుకే ఎగ్వైట్ను ఎక్కువగా తింటే కిడ్నీ రోగాల బారి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.
కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ను బాగా ఉడికించి తక్కువ మోతాదులో ఉప్పు, కారం చల్లుకుని తినవచ్చు. కాలీఫ్లవర్లో ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్ ఎక్కువగా ఉండటం వలన అది శరీరంలోని శరీరంలోని టాక్సిక్ వ్యర్థాన్ని పూర్తిగా తగ్గించగలుగుతుంది.
క్యాబేజీ: ఇందులో ఫిటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని దెబ్బతీసే 'రాడికల్స్'ను అంతం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది.
చేపలు: చేపలు ఇన్ఫ్లమేటరీ కొవ్వు, ఒమేగా-3ని నియంత్రించే శక్తిని కలిగి ఉంటాయి. అది కిడ్నీల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ప్రొటీన్స్కు కూడా చేపలు ముడిసరుకులాంటివి కనుక వాటిని ఆహారంగా తీసుకోవడం అన్ని రకాలుగానూ మంచిదే.
జ్యూస్: పండ్ల రసాలు, కూరగాయల రసాలు కిడ్నీలు చెడిపోకుండా కాపాడగలుగుతాయి. అయితే రోడ్ల మీద దొరికే రసాలు కాకుండా, ఐస్ వాడకుండా ఇంట్లో తయారు చేసుకున్నవైతేనే ఫలితం ఉంటుంది. కూరగాయలు, పండ్ల రసాలలో ఉండే ఫిటోకెమికల్ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కిడ్నీలనూ రక్షించడంలోనూ సహాయపడతాయి.
ఉలవచారు: శీతాకాలంలో ఉలవచారు ఎక్కువగా తీసుకోవడం, మంచినీటిని వేడి చేసుకుని తాగటం కూడా మూత్రపిండాల భద్రతకు ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment