Sunday, August 18, 2013

నడకతో ఎంత లాభం.. ?



సాధారణంగా నడక అనేది ఒక వ్యాయామం వంటిదే. నడక ఆడవారికైనా మగవారికైన మంచి మేలు చేస్తుంది. అందుకే చాలా మంది ఉదయాన్నే వ్యాయామంగా ఉంటుందని నడుస్తుంటారు. ముఖ్యంగా గుండెవ్యాధులు, మధుమేహరోగులు నడవడం చాలా మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు. కేవలం ఇటువంటి వారే కాదు వయసులో ఉన్న ఆడ, మగవారు కూడా నిత్యం నడుస్తుండం చా మంచిది. చక్కటి ఆరోగ్యానికి నడక ఒక పునాది లాంటిది. అందుకే మనం సాధారణంగా గమనించినట్లయితే పల్లెటూళ్లలో చాలా మందికి నడక బాగా అలవాటు ఉంటుంది. పట్నవాసులు మాత్రం తక్కువ దూరానికి కూడా వాహనాలలో ప్రయాణించి నడకకు దూరమైపోతున్నారు. గ్రామాల్లో ఉన్నవారికి నడవడం అలవాటుంది. కనుకే వారు అన్ని విధాల అరోగ్యంగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పల్లెటూళ్లలో ఉండే వారికంటే పట్నం వాసంలో ఉన్నవారికి అందుకే జబ్బుల బెడద చాలా ఉంది. ప్రస్తుత యాంత్రిక జీవన విధానం గమనిస్తే.. పూర్తిగా హడావుడే. ఒకే సమయంలో ఎన్నోరకాల పనులు. దాని వల్ల చెప్పలేనంత ఒత్తిడి. ప్రశాంతతతో పాటు.. ఆరోగ్యం సొంతం కావాలంటే.. తరహా విధానం సరైన ఆలోచన. దీనిపై హార్వర్డ్కు చెందిన మైండ్బాడీ మెడికల్ఇనిస్టిట్యూట్నిర్వహించిన అధ్యయనమూ ఇంచుమించు విషయాలనే తెలిపింది. ధ్యానంతో కూడిన నడకతో ఒత్తిడి, కంగారు దూరమవుతాయి. మనసుకి లభించే సాంత్వన దీర్ఘకాలం ఉంటుంది. అధిక రక్తపోటు అదుపులో ఉండటం... శ్వాస సంబంధిత సమస్యలు, దీర్ఘకాల నొప్పులుతగ్గడం... సంతాన సాఫల్యం వృద్ధి చెందడం.. లాంటి మరిన్ని ప్రయోజనాలూ సిద్ధిస్తాయి. చేస్తున్న పనిపై ఏకాగ్రతా పెరుగుతుంది. నిటారైన ఆకృతి... కండరాల దృఢత్వం... భుజాలు, కాళ్లకు విశ్రాంతి.. లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగకరమైంది, సులభతరమైనదీను. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని నడక ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఉదయంపూట స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. సూర్యోదయపు నులివెచ్చటి కిరణాలు శరీరానికి తగులుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. మరి నడక వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం.. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: రెగ్యులర్గా నడవటం వల్ల గుండె మంచి సమర్ధ వంతంగా రక్తాన్ని పంప్చేయగలుగులుగుతుంది. శరీరమంతటికీ జరిగే రక్త సరఫరాను మెరుపరచి మనిషిని యాక్టివ్గా వుండేటట్లు చేస్తుంది. రక్తంలో ఉండే, గుండె జబ్బుల్ని కొని తెచ్చే - కొలెస్ట రాల్‌, ట్రైగ్లి జరైడ్స్శాతాన్ని తగ్గిస్తుంది. మరోమాటలో చెప్పాలంటే గుండె జబ్బుల్నించి కాపాడటానికి నడక దివ్యౌషధంగా పనిచేస్తుంది. మీరు ఒక ఆరోగ్యకరమైన శరీరంను ఇస్తుంది: మీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీకు కొన్ని భౌతిక చర్య చేయడానికి సమయం కుదరనప్పుడు, మీరు మీ కొద్ది సమయంలోనే విడిచి విడిచి నడిన మొదలు పెట్టండి. శరీరం ఫిట్ గా ఉంచుకోవాలంటే రెగ్యులర్ వాకింగ్ ఒక సాధారణ మార్గం.

No comments:

Post a Comment