Friday, October 30, 2015

రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..

ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు.
మిల్లెట్ అనే రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల యంటీ ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.
రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది.
రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది.
సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్నేన్ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు

పసుపుతో బ్లాక్‌హెడ్స్ మాయం..!


ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.

• చెంచా దాల్చినచెక్క పొడీ, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, ఆ ప్రాంతంపై దూది ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ దూదిని తొలగించి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. చెంచా వంటసోడా, అరచెంచా నీళ్లూ కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచిది.

• ఓట్స్ మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. చెంచా ఓట్స్‌ని రెండు చెంచా నీళ్లలో ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌పై రాసి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

• గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

Thursday, October 29, 2015

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 10 ఉత్తమ ఆహారాలు.......

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 10 ఉత్తమ ఆహారాలు....... బొప్పాయి బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.దానిమ్మ ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.గ్రీన్ లీఫ్స్ శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది.వెల్లుల్లి శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు. బీట్ రూట్ ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ మరియు క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .ఎండు ద్రాక్ష: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.ఆప్రికాట్ ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.కర్జూరం ఎండుఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్ లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి

Tuesday, October 27, 2015

పెరటి ఔషధ మొక్కలు..!! బొప్పాయి...!

పెరట్లో సర్వసాధారణంగా పెరిగే పండ్ల మొక్క. కాయలను కూరకు కూడా వాడుకోవచ్చు
బొప్పాయిలో అధిక పీచు ఉండటం వలన కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.
ఇందులో కొవ్వును దగ్ధము చేయగల ఎంజైములు ఉండటం వలన గుండె పోటు రాకుండా చేస్తుంది .
బొప్పాయిలోని ఆంటి యాసిడ్లు చిన్న వయస్సులో వృద్ధాప్య చిహ్నాలు రాకుండా కాపాడుతాయి .
బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వలన జీర్ణ కోశం లోని పురుగులు నశిస్తాయి . మలబద్దకం తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది . బొప్పాయి రసం పెద్ద పేగులోని, ముఖ్యంగా కోలన్ ద్వార ఏర్పడిన చీము, జిగరును తొలగించి శుద్ధి చేస్తుంది, కాలేయ వ్యాధులను అదుపులో ఉంచుతుంది.
బొప్పాయి లో తక్కువ శక్తి ,ఇతర విటమిన్లు అధికంగా ఉండటం వలన శరీర బరువును తగ్గిస్తుంది ‘ఎ’ , ‘సి’ విటమిన్లు అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది .
బొప్పాయి తో తయారు చేసిన షాంపూ జుట్టులోని చుండ్రును అదుపులో ఉంచుతుంది .

దానిమ్మతో పదిలం

ఎండబెట్టిన దానిమ్మ తొక్కని పొడి చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకున్న ఇరవై నిమిషాల తరువాత కడుక్కోవాలి. దానిమ్మ తొక్కలో ఉండే యాంటాక్సిడెంట్లు కురుపులు, మొటిమలను కలగజేసే బ్యాక్టీరియాని దరిచేరనీయవు
దానిమ్మపొడిలో పాలుపోసి మెత్తగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని కొద్దిసేపటి తరువాత కడుక్కోవాలి. దీనివల్ల వయసువల్ల వచ్చే ముడతలు, గీతలు పోయి చర్మం బిగుతుగా అవుతుంది.
దానిమ్మ పొడి చర్మాన్ని యువి కిరణాల నుంచి రక్షించే నేచురల్‌ సన్‌స్ర్కీన్‌లా, అలాగే చర్మంపై ఉండే మృతకణాలను, నలుపుదనాన్ని తొలగించే స్క్రబ్బర్‌లా కూడా ఉపయోగపడుతుంది.
దానిమ్మపొడి మాయిశ్చరైజర్‌లాగా కూడా బాగా పనిచేస్తుంది. అందుకే దానిలో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి రాసుకొని కొద్దిసేపటి తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే చర్మం పొడిబారడం తగ్గుతుంది

జిలకరతో ఉపయోగములు

భోజనం రుచించకుంటే ,కడుపు ఉబ్బరంగా ఉండి జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే జిలకర రసం సేవించండి దింతో వెంటనే మీకు జీర్ణక్రియలో మార్పులు సంభవించి ఆకలి బాగా వేస్తుంది.....
జలుబుతో బాధ పడుతుంటే వేయించిన జిలకరను వాసన చూస్తే జలుబుతో పాటు తుమ్ముల నుండి ఉపశమనం కలుగుతుంది ....
ప్రసవానంతరం బాలింత జిలకరను సేవిస్తే గర్భశయం శుభ్రమౌవుతుంది......
జిలకరను మరి ఎక్కువగా తీసుకుంటే వాంతులు వచ్చే ప్రమాదం ఉంది అందుకే మోతాదుగా తీసుకోవాలి . ....
జిలకర ఉదరంలో ఉన్న పురుగులను నాశనం చేస్తుంది అలాగే జ్వర నివారిణిగా పని చేస్తుంది . .....
కొందరికి శరీరం నవ్వతో ఇబ్బంది పెడుతుంటుంది ఇలాంటి వారు జిలకరను ఉడకబెట్టిన నీటితో స్నానం చేస్తే నవ్వ తగ్గి ఉపశమనం కలుగుతుంది . ......
జిలకరను ఉప్పు తో కలిపి రుబ్బిన తర్వాత అందులో తేనె లేక నెయ్యి కలిపి కాస్తా వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తేలు కుట్టిన చోట పూస్తే విషం తొలగి పోతుంది .
అతిసారంతో బాధ పడుతుంటే జిలకర చూర్ణాన్ని ఆరు గ్రాముల పెరుగులో కలుపుకొని సేవిస్తే అతిసారం తగ్గి పోతుంది ......
నడుం నొప్పి తో బాధ పడేవారు జిలకర పొడిని నాలుగు కప్పుల నీటిలో కలిపి దానిలో కొద్దిగా నెయ్యి, బెల్లం జోడించి అది ఒక కప్పు అయ్యేంత వరకు మరగబెట్టి చల్లారిన తర్వాత నడుము నొప్పి బాధితులచేత తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది ........

పెరటి వైద్యం....!! తులసి

తులసి కుండీలలోనైన సులువుగా పెంచగలిగే మొక్క . సర్వ రోగ నివారిణి అని పేరుంది.తులసి ఆకులు సువాసన కలిగి రుచికి చేదుగా, వగరుగా ఉంటాయి. కానీ ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి .
6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్ద నుండి రసం వడగట్టి అర స్పూన్ తేనెతో కలిపి రోజులో రెండు సార్లు 3- 4 చుక్కలుగా తీసుకోవాలి. గొంతు గరగరను తగ్గించి మృదువుగా చేస్తుంది, కఫాన్ని వదిలేస్తుంది .
జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది.
తులసి ఆకులను పరగడపున కొన్నిరోజుల పాటు 2 - 3 ఆకులను నమిలినట్లైతే ముక్కు దిబ్బడ వంటి శ్వాస లోపాలు సవరించబడతాయి, గుండెకు బలాన్నిస్తుంది, వ్యాధి నిరోధకశక్తి కలుగుతుంది.
సుగంధభరితమైన తులసి ఆకు చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది, క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది.
ఇంటిచుట్టూ తులసి మొక్కలు ఉంటే దోమల బాధ ఉండదు.

Sunday, October 25, 2015

మెంతి ఎంతో మేలు ...!

మెంతి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ అంశాలు శ్వాసను తాజాగా ఉంచడంలో బాగా తోడ్పడతాయి. అందుకే ఈ ఆకుల్ని చూయింగ్‌ గమ్‌, మౌత్‌ ఫ్రెష్నర్స్‌, టూత్‌ పేస్ట్‌ తయారీలో ఉపయోగిస్తారు. దీనిలో శ్వాసకోశ వ్యాధులను నిర్మూలించే అంశాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. తులసి కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, జాగరూకతను, ఏకాగ్రతను పెంచుతుంది. శారీరకమైన నీరసాన్ని, నిస్సత్తువులను తొలగించడమే కాదు, మానసికమైన కుంగుబాటును కూడా పారదోలుతుంది. మెంతి రసంలో జీర్ణశక్తిని పెంచే అంశాలు కూడా అపారంగా ఉన్నాయి. ఇందులోని యాంటీ-సెప్టిక్‌ అంశాలు ఆరోగ్యమైన చర్మాన్ని నిలబెట్టడంతోపాటు, మొటిమలు రాకుండా కూడా ఇది కాపాడతాయి. మెంతి, నిమ్మరసాల మిశ్రమాన్ని రోజూ ఒక గ్లాసు తీసుకుంటే శరీరంలోలని మలినాలన్నీ బయటికి పోయి అంత ర్భాగాల్లో ఎక్కడ ఏ వాపులు ఉన్నా తగ్గిపోతాయి.

Saturday, October 24, 2015

షుగర్ వ్యాధి ఉందా ...!! ? అయితే ఈ శుభవార్త మీకోసమే !!!

మీకు లేదా మీ బంధు, మిత్ర, ఆత్మీయులకు ఎవరికైనా..మధుమేహ౦ ఉండి..అది అదుపులోకి రాక...లేదా దాని తీవ్ర ప్రమాదాలు వేధిస్తున్నా.లేదా పిల్లల్లో హింసించే type 1 షుగర్ వ్యాధిఅయినా......షుగర్ వల్ల గాయాలయి అవయవాలు కోల్పోయే ఉపద్రవాల్లో ఉన్నా.....వారిని తప్పక మా 'మధుధ్వంసి ' కాపాడుతుంది. 
ఎలాంటి గందరగోళo లేకుండా ఒకసారి సికింద్రాబాద్ బాద్ లోని మా క్లినిక్ కి కాని ఇతర బ్రాంచెస్ కి కాని రమ్మనండి..రండి.. ఇకనుండి ప్రతి శని, ఆది వారాలు సికింద్రాబాద్ లోఉంటాను....
సికింద్రాబాద్ -పద్మరావునగర్ లోని సర్దార్ పటేల్
( SP ) కాలేజ్ ఎదురుగా, ఇండియన్ ఓవర్సిస్ ( IOB bank ) పక్కన - మా (veeranjaneya ayurveda pharmacy ) ఫార్మసి ఆఫీస్ లోనేఉంటాను...
బుధవారం ఆర్మూర్ నిజామాబాద్
శుక్రవారం జగిత్యాల
శని ,ఆది సికింద్రాబాద్ .
తప్పకుండా మా వెబ్ చూడండి..వారికి చూపించండి... తప్పక షేర్ చెయ్యండి...!!
వివిధ ప్రాంతాలలో మా బ్రాంచీలు :---
1, Veeranjaneya aurveda pharmacy,
Hanuman wada, Kandlapelli road,
( just beside hanuman temple)
Jagitial. CELL 9440 511239
2, Veeranjaneya aurveda pharmacy,
Padmarao nagar, secundrabad
Opp SP college, (IOB BANK NEAR)
CELL 9908289830
3, Veeranjaneya aurveda pharmacy,
Baswa garden, vinayaka nagar.
Nizambad. CELL99496 59864.
4, VANSTHALI PURAM (HYDERABAD)
N.G.Os colony, CELL 9700779200
పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లో..
తప్పకుండా చూడండి పూర్తివివరాలు ఉన్నాయి ...
web ....... http://sugarcure.in/
Twitter ... https://twitter.com/drlaxmanswamy
Facebook .. . https://web.facebook.com/dr.laxmanswamy
Page .. ...... https://web.facebook.com/sugarcurein-233332716814…/timeline/
Youtube .. . https://www.youtube.com/channel/UCF2wZ7LRg9V9ep-zynIBRiw
Goole + .. https://plus.google.com/…/+SimhachalamLaxmanswamyayur…/posts
E MAIL .. dr.laxmanswamy@gmail.com

Friday, October 23, 2015

కరివేపాకుతో జుట్టు సంరక్షణ చిట్కాలు హెయిర్ టానిక్

గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకొని, తాజా కరివేపాకులను కలిపి, ఈ మిశ్రమం నలుపు రంగులోకి మారేవరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని చలర్చండి. ఇపుడు మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఇంట్లో తయారు చేసిన టానిక్ సిద్దంగా ఉందని అర్థం. ఈ మిశ్రమాన్ని నేరుగా మీ తలపై చర్మానికి అద్దండి. ఇలా 45 నిమిషాల పాటూ వేచి ఉండి, గాడతలేని షాంపూతో కడిగి వేయండి. ఇలా తయారు చేసిన టానిక్ ను వారానికి రెండు సార్లు వాడండి. ఈ మిశ్రమం వెంట్రుకల పెరుగుదలను మాత్రమేకాకుండా, చిన్న వయసులో జుట్టు నెరవటాన్ని కూడా నియంత్రిస్తుంది.

చేపలతో గుండెపోటు దూరం


మీ గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినండి. అది కూడా నూనె ఎక్కువగా ఉన్న చేపలను ఆరగించాలి. దీని వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఆరు నుంచి 12శాతం వరకు తగ్గుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. చేపల వినియోగానికి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిపుణులు పరిశోధించారు. ఇందులో భాగంగా ఈ అంశంపై ఇప్పటివరకు జరిగిన 38అధ్యయన ఫలితాలను విశ్లేషించారు. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను తినడం వల్ల గుండె జబ్బులను నిరోధించవచ్చని చివరకు నిర్ధారించారు.

Monday, October 19, 2015

కుంకుమ పువ్వు,

కుంకుమ పువ్వు, పాలు కలిస్తే ముఖం లేతగులాబీలా మెరిసిపోవాల్సిందే. పాలను బాగా కాచి అందులో కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం

షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం మీ ముందుకు వచ్చింది. దీని కోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు.. జస్ట్. . వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు.. మధుమేహం .. మన మాట వింటుందంటున్నారు పరిశోధకులు.
6 కోట్ల 50 లక్షలు.. ఇది ఓ రాష్ట్రం జనాభా కాదు.. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య. మధుమేహం… ఒకప్పుడు పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు పిల్లల్నీ పట్టి పీడిస్తోంది. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు.. జనాన్ని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ చికిత్స తీసుకోవడంతో పాటు.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్లా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందంటున్నారు డాక్టర్లు.
డయాబెటిస్ రెండు రకాలు.. టైప్ వన్.. టైప్ టు.. ప్రపంచంలో 95 శాతం మంది టైప్ టు డయాబెటిస్ తోనే బాధపడుతున్నారు. వీరి శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్లో.. లేదంటే అధికంగా ఉత్పత్తి కావడం వల్లో.. ఈ టైప్ టు డయాబెటిస్ సోకుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తం నుంచి శరీరంలోని కణాలకు అందదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది.
మధుమేహం నియంత్రణకు మహామంత్రం. వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రియన్ లో ప్రచురితమైన ఓ పరిశోధన… వారానికి నాలుగు గుడ్లు తింటే.. మధుమేహ నియంత్రణ సాధ్యమే అంటోంది. గుడ్లలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారానికి నాలుగు కన్నా ఎక్కువ గుడ్లు తినకూడదన్న అభిప్రాయం గతంలో ఉండేది. కానీ, అందులో ఉన్న కొవ్వు మన శరీరానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా టైప్ టు మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుందని గుర్తించారు. ఈస్ట్రన్ ఫిన్ లాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్లపాటు ఈ పరిశోధన సాగింది. వారానికి ఒక గుడ్డు తిన్న వారికంటే.. నాలుగు గుడ్లు తిన్నవారిలో… 37 శాతం మందికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ రీసెర్చ్ లో తేలింది.

Sunday, October 18, 2015

వెలగపండు

• పోషక భరితం..!

మిగిలిన పళ్లలో మాదిరిగానే ఇందులోనూ పోషకాలకూ లోటు లేదు. 100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. 31 గ్రా. పిండిపదార్థాలూ, 2 గ్రా. ప్రొటీన్లు, బీటా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఆక్సాలిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు. వాస్కోడిగామా బృందం ఓసారి కలరా, డయేరియాలతో బాధపడుతుంటే ఈ పళ్ల గుజ్జునే మందుగా ఇచ్చారట.

వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. రక్తహీనత లేకుండా చేస్తుంది. గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికీ మంచిది.

ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. 

అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. 

మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. రాళ్లు కూడా తొలగిపోతాయి. 

బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల కాలేయ సమస్యలనూ నివారిస్తోంది. హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కంటికీ మంచిది.

స్త్రీలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. నోటి పుండ్లనీ తగ్గిస్తుంది. పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది. 

పండే కాదు.. ఈ చెట్టు బెరడూ, పూలూ, వేళ్లూ, ఆకులూ అన్నీ ఔషధభరితమే. కానీ వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలక్కాయని కేవలం పూజాఫలంగా చూస్తామే తప్ప అమృత తుల్యమైన దాని ఔషధ గుణాల్ని అంతగా పట్టించుకోం. ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించం. అందుకే ఇవి చవితి సమయంలో మాత్రమే మార్కెట్లో సందడి చేస్తుంటాయి. కానీ వేసవి వరకూ ఇవి దొరుకుతూనే ఉంటాయి. మరి ఇప్పటికైనా ఈ చెట్లను చేను గట్లమీదా, బీడుపొలాల్లోనూ వేద్దాం.. వెలగపండ్ల రుచుల్నీ ఆస్వాదిద్ధాం!

Friday, October 16, 2015


షుగర్ వ్యాధి ఉందా ...!! ? అయితే ఈ శుభవార్త మీకోసమే !!!



షుగర్ వ్యాధి ఉందా ...!! ?
అయితే ఈ శుభవార్త మీకోసమే !!!
----------------------------------------
మీకు లేదా మీ బంధు, మిత్ర, ఆత్మీయులకు ఎవరికైనా..మధుమేహ౦ ఉండి..అది అదుపులోకి రాక...లేదా దాని తీవ్ర ప్రమాదాలు వేధిస్తున్నా.లేదా పిల్లల్లో హింసించే type 1 షుగర్ వ్యాధిఅయినా......షుగర్ వల్ల గాయాలయి అవయవాలు కోల్పోయే ఉపద్రవాల్లో ఉన్నా.....వారిని తప్పక మా 'మధుధ్వంసి ' కాపాడుతుంది. 
ఎలాంటి గందరగోళo లేకుండా ఒకసారి సికింద్రాబాద్ బాద్ లోని మా క్లినిక్ కి కాని ఇతర బ్రాంచెస్ కి కాని రమ్మనండి..రండి.. ఇకనుండి ప్రతి శని, ఆది వారాలు సికింద్రాబాద్ లోఉంటాను....
సికింద్రాబాద్ -పద్మరావునగర్ లోని సర్దార్ పటేల్
( SP ) కాలేజ్ ఎదురుగా, ఇండియన్ ఓవర్సిస్ ( IOB bank ) పక్కన - మా (veeranjaneya ayurveda pharmacy ) ఫార్మసి ఆఫీస్ లోనేఉంటాను...
బుధవారం ఆర్మూర్ నిజామాబాద్
శుక్రవారం జగిత్యాల
శని ,ఆది సికింద్రాబాద్ .
తప్పకుండా మా వెబ్ చూడండి..వారికి చూపించండి... తప్పక షేర్ చెయ్యండి...!!
వివిధ ప్రాంతాలలో మా బ్రాంచీలు :---
1, Veeranjaneya aurveda pharmacy,
Hanuman wada, Kandlapelli road,
( just beside hanuman temple)
Jagitial. CELL 9440 511239
2, Veeranjaneya aurveda pharmacy,
Padmarao nagar, secundrabad
Opp SP college, (IOB BANK NEAR)
CELL 9908289830
3, Veeranjaneya aurveda pharmacy,
Baswa garden, vinayaka nagar.
Nizambad. CELL99496 59864.
4, VANSTHALI PURAM (HYDERABAD)
N.G.Os colony, CELL 9700779200
పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లో..
తప్పకుండా చూడండి పూర్తివివరాలు ఉన్నాయి ...
web ....... http://sugarcure.in/
Twitter ... https://twitter.com/drlaxmanswamy
Facebook .. . https://web.facebook.com/dr.laxmanswamy
Page .. ...... https://web.facebook.com/sugarcurein-233332716814…/timeline/
Youtube .. . https://www.youtube.com/channel/UCF2wZ7LRg9V9ep-zynIBRiw
Goole + .. https://plus.google.com/…/+SimhachalamLaxmanswamyayur…/posts
E MAIL .. dr.laxmanswamy@gmail.com

* నయనానందం

కొందరికి కళ్ల కింద నల్లటి వలయాలుంటాయి. ఇవి చూడడానికి అస్సలు బాగుండవు. పైగా పెద్దవాళ్లల్లా కూడా కనిపిస్తారు. ఈ నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి.
వాడేసిన బ్లాక్‌ లేదా గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ రెండింటిని అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆతర్వాత వాటిని బయటకు తీసి రెండు కళ్లపై పది పదిహేను నిమిషాలపాటు పెట్టుకొని తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు కొన్ని వారాల పాటు చేయాలి.
తెల్లగుడ్డ ముక్కను చల్లటి నీళ్లల్లో లేదా పాలల్లో వేసి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత ఆ గుడ్డతో కనురెప్పలపై పలుమార్లు అద్దాలి. లేదా... నాప్‌కిన్‌లో కొన్ని ఐస్‌క్యూబ్స్‌ను వేసి మూటలాకట్టి దాన్ని కళ్లపై పెట్టి తీస్తుండాలి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేయాలి.
గుప్పెడు పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఆ పేస్టును కళ్లకింద ఉన్న నల్లటి వలయాలపై రాసుకుని 15-20 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయాలి.
పావు టేబుల్‌ స్పూన్‌ పసుపులో రెండు టేబుల్‌స్పూన్స్‌ మజ్జిగ పోసి బాగా కలిపి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును కళ్లకింద ఉన్న నల్లటి వలయాలపై రాసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కళ్ల భాగాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి.

* అందానికి కలబంద

కలబందలో చర్మసౌందర్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి గుణాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలూ, మచ్చలూ, చర్మం పొడిబారడం, దద్దుర్లు రావడం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. కలబంద గుజ్జుకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి ముఖానికి రాయాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.
• కలబంద ఆకుల్ని నీళ్లలో వేసి కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. తరవాత ఈ ఆకుల్ని మెత్తని పేస్ట్‌లా చేసి కొన్ని చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోయి, ముఖం తాజాగా మారుతుంది.
• చెంచా కలబంద గుజ్జుకి, అరచెంచా చొప్పున కీరదోస రసం, పెరుగూ, కొన్ని చుక్కల గులాబీ నీళ్లూ కలిపి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే ముఖం అందంగా మారుతుంది. చర్మ సంబంధిత సమస్యలూ రాకుండా ఉంటాయి.
• రెండు చెంచాల కలబంద గుజ్జుకి, చెంచా కీరదోస తురుమూ, ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా ఐదు నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.

Thursday, October 15, 2015

బెండ రోజూ తినడం మంచిది ..!

బెండకాయలో విటమిన్‌-సి, యాంటాక్సిడెంట్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలోని అనవసరపు కొవ్వుని కరిగించడంలో కూడా తోడ్పడుతుంది.

ప్రతిరోజూ బెండకాయ తినడంవల్ల పెద్దపేగులో వచ్చే కేన్సర్‌ బారినపడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఉబ్బసం ఉన్నవారు వీటిని తినడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.

బెండకాయలో ఫైబర్‌, విటమిన్‌-సి ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి చాలా మంచిది. దీన్ని ప్రతిరోజూ తినడంవల్ల నీరసం దరిచేరదు. అలాగే బ్లడ్‌షుగర్‌ నియంత్రణకు బెండకాయ బాగా ఉపయోగపడుతుంది.

వీటిల్లో విటమిన్‌-కె ఉండడంవల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. బెండకాయల్ని రోజూ తినేవారిలో కీళ్లనొప్పులు త్వరగా రావు.

* మేతీ పనీర్



• కావలసినవి:
మెంతుకూర(తరిగి), పనీర్‌- పావు కేజీ
నూనె- రెండు టేబుల్‌స్పూన్లు
ఎండుమిర్చి- నాలుగు,
టొమాటో గుజ్జు- అరకప్పు
గరం మసాలా- ఒక టీస్పూను
ధనియాలపొడి- రెండు టీస్పూన్లు
ఉప్పు- తగినంత
• తయారీ
మెంతుకూరలో ఒక టీస్పూను పంచదార, కొద్దిగా నీళ్లుపోసి రెండు నిమిషాలపాటు ఉండికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత టొమాటో గుజ్జు వేయాలి. కొన్ని నిమిషాలపాటు ఉడికాక దానిలో ఉప్పు, గరంమసాలా, ధనియాలపొడి, వేసి తిప్పాలి. ఆ మిశ్రమం నుంచి నూనె పైకి తేతేలే వరకు ఉడికనిచ్చి అప్పుడు మెంతుకూర, పనీర్‌ ముక్కలు వేసి కలపాలి. మూడునిమిషాల తరువాత స్టవ్‌ ఆపేస్తే సరి... మేతీ పనీర్‌ రెడీ..!

Wednesday, October 14, 2015

రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపం

రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎందుకు, ఎప్పుడు వస్తుందో కారణాలు తెలియడం లేదు. ఒకప్పుడు నలభై ఐదేళ్లు దాటితేగానీ మహిళల్లో రొమ్ము కేన్సర్ పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు ముప్ఫై దాటితే చాలు వస్తోంది. మన దేశంలో ఏటా రెండు లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోనూ రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది.
ముఖ్యంగా రొమ్ము కేన్సర్ బాధితులు నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రొమ్ము కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొద్దిపాటి అవగాహన ఉంటే చాలని అంటున్నారు ప్రముఖ బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ సర్జన్ డా.కె.ప్రవీణ్‌కుమార్ దాదిరెడ్డి. ముప్పయ్ ఏళ్ల వయసు దాటితే చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చునని, ప్రాథమిక దశలో గుర్తించినా దాన్ని పూర్తిగా నిర్మూలించుకోవచ్చునని అంటున్నారు. కారణాలు తెలియకపోయినా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుందన్నదానికి ప్రధానంగా కారణాలు లేకపోవచ్చుగానీ, ఎక్కువగా వస్తుందన్నది మాత్రం తేటతెల్లమైంది. దీనికి గల కారణాలు పరిశీలిస్తే...
- కుటుంబ చరిత్ర కారణంగా వచ్చే అవకాశాలున్నాయి.
- పొగతాగడం, మద్యం సేవించే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశం.
- చిన్నవయసులోనే పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది.
- లేటు వయసులో అంటే 40-45 ఏళ్ల మధ్యలో బిడ్డలను కనడం వల్లకూడా వచ్చే అవకాశం.
- కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడమూ ఒక కారణం.
- పీరియడ్స్‌లో భారీగా మార్పులు చోటు చేసుకోవడం.
- ప్రధానంగా ఈస్ట్రొజెన్ కొలెస్ట్రాల్ కారణంగా బ్రెస్ట్ కేన్సర్ వస్తున్నట్టు స్పష్టం.
ఏడాదికో 15 నిముషాలు..
- 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి మామోగ్రఫీ టెస్టు చేయించుకోవాలి.
- ఈ టెస్టు చేయించుకోవడానికి 15 నిముషాలు పడుతుంది. దీనికి రూ.1,500 ఖర్చవుతుంది. దీనివల్ల రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది.
- రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉండే డిజిటల్ మామోగ్రఫీ టెస్టులు వచ్చాయి.
- చంటిబిడ్డలకు తల్లి ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల కొంతవరకూ రొమ్ము కేన్సర్‌ను నివారించుకోవచ్చు.
- ముప్ఫై ఏళ్లు దాటిన మహిళలు తరచూ రొమ్ములో వచ్చే మార్పులను గమనించాలి. గడ్డలు, చర్మం రంగుమారడం, మచ్చలు వంటి మార్పులు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
- దీనివల్ల ప్రాథమిక దశలోనే రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది.
- ప్రాథమిక దశలో ఉన్న రొమ్ము కేన్సర్‌లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెస్ట్‌ను తొలగించకుండా నయం చేసే అవకాశాలున్నాయి.
- బీఆర్‌సీఏ జీన్ టెస్టింగ్ అనే పద్ధతి ఇప్పుడు రొమ్ము కేన్సర్ నివారణలో కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు.
- క్రమం తప్పకుండా మామోగ్రఫీ చేయించుకుంటే రొమ్ము కేన్సర్‌ను సులభంగా గుర్తించడం, నివారించుకోవడం సాధ్యమవుతుంది.

పసుపుతో బ్లాక్‌హెడ్స్ మాయం..!

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
• చెంచా దాల్చినచెక్క పొడీ, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, ఆ ప్రాంతంపై దూది ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ దూదిని తొలగించి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. చెంచా వంటసోడా, అరచెంచా నీళ్లూ కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచిది.
• ఓట్స్ మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. చెంచా ఓట్స్‌ని రెండు చెంచా నీళ్లలో ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌పై రాసి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
• గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

Monday, October 12, 2015

అందం... కలబంద..!

అందం... కలబంద..!
కలబంద అందుబాటులో ఉంటే చాలు, చక్కని ముఖవర్చస్సు మీ సొంతమవుతుంది. ఎలాంటి చర్మానికైనా సరే కలబందతో తగిన ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఫేస్‌ప్యాక్స్ మీ కోసం... రెండు చెంచాల కలబంద గుజ్జు, రెండు చెంచాల చీజ్, రెండు చెంచాల కీర దోసకాయల గుజ్జు, ఐదారు గింజలు తీసిన ఖర్జూరాలు మెత్తగా కలుపుకోవాలి. దీనికి కాస్త నిమ్మరసాన్ని, చిటికెడు పసుపు చేర్చి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. పొడిచర్మం ఉన్న వాళ్లకు కళాకాంతులు వస్తాయి.
రెండు తాజా కలబంద ఆకులను నీళ్లలో ఉడికించండి. తర్వాత వాటిని గుజ్జుగా చేసి, రెండు చెంచాల తేనె, చిటికెడు గంధం పొడి కలపండి. దీనిని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది.
స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.పువ్వులలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక అందమైన పుష్పం మందార లేదా మందారం (Hibiscus) ఒక అందమైన పువ్వుల చెట్టు. మందారం మలేషియా దేశపు జాతీయ పుష్పం.దేవతల పూజలోను...తలలో అలంకారం గాను వాడతారు.మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు. మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. ఇందులో రేఖమందారం, ముద్దమందారం ,ఎరుపు, తెలుపు,పసుపు,ఆరంజ్, చాలా రంగులు ఉన్నాయి. దీనిని ఆహార పదార్థాలతో కలిపితీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. ఇందులో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది.మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందాన్ని, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో చుండ్రును నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గతమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది.అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. కేశాలు తొందరగా తెల్ల బడకుండా చూస్తుంది. చర్మం నునుపుగ ఉండేలా చూస్తుంది.చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది.పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ చేస్తే తొందరగా తగ్గుముఖం పడతాయి..మనకు ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ మందార ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.మరి మందార యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదా రేపు మరొక పుష్పం అందం గురించి, ఉపయోగాలతో రేపు కలుద్దాము..

Sunday, October 11, 2015

అందమునకు ఆయుర్వేదము

నెరసిన వెంట్రుకలు నల్లబడుటకు
కరక్కాయ ,తానికాయ ,ఉసిరికాయ ఈ మూడింటి బెరడు ,నీలి ఆకు ,లోహా చూర్ణము వీటిని సమబాగాలుగా గుంటగలగర నిజరసము జీలకర్ర రసము గొర్రె మూత్రము కలిపి మెత్తగా దంచి రోజు ఉదయం లేక సాయంత్రము తలకు రాసుకుని దట్టముగా లేపనం చేసి 2,3 గంటల తరువాత కుంకుడు శికకాయలతో తలస్నానము చేసిన తెల్లవెంట్రుకలు క్రమంగా తగ్గి పోతాయి.
శరీరము బిగువుగా ఉండుటకు
మేడి పాలు ,మర్రి పాలు నువ్వుల నూనె తో కలిపి కాచి శేరీరానికి మర్దన చేసుకోవాలి.
వెంట్రుకలు ఊడకుండా ఉండుటకు
మినుములు ,మెంతులు ,ఉసిరిక సమంగా తీసుకుని నానబెట్టి రుబ్బి తలకు పెట్టవలెను.ఆరిన తరువాత కుంకుడు రసం తో స్నానం చేయవలెను అలా చేసిన తరువాత 3 రోజుల్లోనే అద్బుత ఫలితం కలుగుతుంది.
అతి బరువు
తులసి ఆకులను పెరుగు లేక మజ్జిగతో వాడిన బరువు తగ్గును.
పులిపిర్లు తగ్గుటకు
ఉత్తరేని ఆకు ,హరిచంధనమును నువ్వుల నూనె తో కలిపి మెత్తగా నూరి పులిపిర్ల పై లేపనం చేయవలెను.
అధిక మాంసం తగ్గుటకు
ఆవనూనెతో మర్దనా చేస్తే అధిక మాంసం తగ్గుతుంది(ex:మోకాలి క్రింద బాగాన..)
జుట్టు తిరుగుటకు
రాత్రి పడుకోబోయే ముందు తలకు ఆముదము రాసి జుట్టును పక్కకు దువ్వాలి ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత పక్కకు తిరిగిన జుట్టును వెనుకకు కూడా దువ్వుకొన వచ్చును.కుంకుడు రసం తోనే తలస్నానం చేయాలి షాంపూ ,సబ్బులు వాడకూడదు.
చుండ్రు
90 వేపాకులు ,9 మిరియాలు కలిపి కొంచెం నీళ్ళు కలిపి మెత్తగా నూరి తలకు ఒంటికి పట్టించుకవాలి సరిపోక పోతే మరికొంత కలుపుకోవచు.ఆరిపోగానే కుంకుడు కాయ రసం తో స్నానం చేయవలెను.వేపాకులు మిరియాల సంక్య కరెక్ట్ గా వుండాలి.
నల్ల మచ్చలు పోవుటకు
ఆముదపు గింజలు 225 తీసుకుని పై పెచ్చులు తీసివేసి ,లోపలి పప్పులో 12gm శొంటి పొడి కలిపి మెత్తగా నూరి ,కుంకుడు గిన్జలంత టాబ్లెట్స్ చేసి ,నిలువ ఉంచుకుని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే 2,3 నెలల్లో నల్ల మచ్చలన్ని నామరూపాల్లేకుండా పొతాయ్.
మొటిమలు
[1].సుగంధి పాల వేళ్ళ బెరడు చూర్ణము ,పెసర పిండి ,హారతి కర్పూరము ఈ 3 సమబాగాలుగా కలిపి ఈ చూర్ణముతో ముకానికి నలుగు పెట్టుకుంటూ వుంటే ,ముకం మీద మొటిమలు ,మచ్చలు హరిన్చిపోతాయ్.
[2].సుగంధపాల వేళ్ళ చూర్ణము వస చూర్ణము ధనియాల చూర్ణము ఈ మూడింటిని సమ బాగాలుగా కలిపి నీటితో మెత్తగా నూరి ముకానికి రాస్తూ వుంటే మొటిమలు మచ్చలు హరించి పొతాయ్.
తల లోని పేలు
సుగంధ పాల వేళ్ళను గో మూత్రములో కలిపి మెత్తగా నూరి తలకు లేపనం చేస్తూ వుంటే తల లోని పేలు హరించి పొతాయ్.
వళ్ళు తగ్గటానికి
వాన నీటిని ఆకాశం నుండి పడేటప్పుడు నెల మేధా పడకుండా పట్టుకుని నిలువ వుంచి రోజు ఉదయం పూట 50gm వాన నీటిలో చిటికెడు మంచి పసుపు కలిపి తాగుతూ వుంటే 3 నెలల్లో స్థూలశరీరం తగ్గిపోతుంది.

Saturday, October 10, 2015

తెలగపిండి ఆకు లేదా కొండపిండి ఆకు

తెలగపిండి ఆకు లేదా కొండపిండి ఆకు అంటారు. కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో ( పప్పు లోకి బాగుంటుంది ) ఆహారంగా 90 రోజులు ( 3నెలలు ) కనుక తీసుకుని ఆతరువాత కిడ్నీల పరీక్ష చేయించి చూడండి. ఆపరేషన్ అవసరం లేకుండానే రాళ్ళు కరిగి పోతాయి. కొండను సైతం పిండి చేయగల శక్తి ఈ ఆకులలో ఉంది. ....!!
ఈ మొక్క నూ తెల్లగా వున్న ఆ పూల గుత్తులను బట్టి ఆనవాలు పట్టవచ్చు....!!


సమూలంగా ఎండపెట్టి పొడి చేసుకొని ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్పూనుడు పొడిని మజ్జిగలో కలిపి త్రాగాలి.

Friday, October 9, 2015

పుదీనా.. ఆరోగ్య ఖజానా..!

పుదినా ఓ దివ్య ఔషధం.. తరుచూ తింటే పలు రకాల జబ్బులను దూరం చేస్తుంది. నోటి దుర్వాసనను మటుమాయం చేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుతుంది.
మామూలు వంటలను సైతం తన సువాసనతో ఘుమఘుమ లాడించే పుదీనాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వంటల్లో వాడేందుకే కాకుండా, వివిధ రకాల జబ్బులను నివారించే దివ్య ఔషధంలా పుదీనా పనిచేస్తుంది. కూరల్లో వేసుకునే వివిధ రకాల ఆకు కూరల్లో పుదీనాకు ప్రత్యేక ఔషధ గుణాలున్నాయని ప్రాచీన కాలానికి చెందిన గ్రీకు, రోమన్లు తొలుత గుర్తించినట్లు చెబుతారు. రోమన్లు సువాసన కోసం పుదీనాను వంటల్లో ఉపయోగించడమే కాకుండా దాని రసాన్ని డైనింగ్ టేబుల్‌పై చల్లుకొని ఆహ్లాదం పొందేవారు. దీని ఆకులు తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారి నమ్మకం. ఎథెన్స్ నగరానికి చెందిన ప్రజలు తమ శరీరం నుంచి వస్తున్న చెమట వాసనను తొలగించేందుకు పుదీనా రసాన్ని స్ప్రేగా ఉపయోగించేవారట!

• పుదీనా ప్రత్యేకతలు..

పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనం చేసే ఔషధంలా పనిచేస్తాయిని పలు పరిశోధనలు నిగ్గు తేల్చాయి. దీని నుంచి తీసే మెంథాల్‌ను తల, గొంతు నొప్పి నివారణకు వాడుతున్నారు.

• దుర్వాసనకు చెక్.. !

పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటి నుంచి వచ్చే దుర్వాసనను నివారించవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టి పడడమే కాక, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ దూరమవుతాయి.
5,480 మైక్రో గ్రాముల విటమిన్లు
పుదీనా ఆకుల్లో సుమారు 5,480మైక్రో గ్రాముల విటమిన్లు జిటా కెరోటిన్ రూపంలో వెలువడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే ఖనిజ లవణాలు ముఖ్యంగా కాల్షియం 200, గ్రంధకం 0.84, భాస్వరం 0.62, మెగ్నీషియం 60, ఇనుము 15.6, మిల్లీ గ్రాముల్లో లభిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో విటమిన్ సీ 33మిల్లీ గ్రాములు ఉంటాయి. ఈ ఆకుల్లో ఉన్న పీచుపదార్థాలు పెద్ద మొత్తంలో ఉన్న మాంసకృత్తులను సైతం సులభంగా జీర్ణం చేసేందుకు దోహదపడతాయి.

• ఇంకెన్నో లాభాలు...

పుదీనా టీలో కొంచెం తేనె కలిపి తాగితే అరగని పదార్థాలు సులువుగా జీర్ణమవుతాయి.
కడుపు నొప్పితో బాధపడుతున్న వారు మరిగించిన పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
వేడివేడి పుదీనా టీ తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
పుదీనా ఆకుల రసాన్ని రోజూ రెండు స్పూన్లు తేనెలో కలిపి పిల్లలకు తాగిస్తే కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోతాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు పుదీనా ఆకులను ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది.

ఖర్జూరం పండ్లలో ఆరోగ్యంగా ఇలా!

శరీరానికి తక్షణ శక్తినిచ్చే 'ఖర్జూరం'!
పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.
ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం.
ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.
ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ 'ఎ' కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి మినరల్స్ ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉండి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా మంచి ఫలితాన్నిస్తాయి.
ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో ముస్లింలు ఈ పండుని ఆహారంగా తీసుకుంటారు. అలాగే ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా!
మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు విటమిన్ 'కె' కూడా ఉంటుంది. ఇందులోని నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన విటమిన్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.
ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది వాటిని తినడానికి భయపడుతుంటారు. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది. కానీ డయాబెటిస్‌తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమవంతు పాత్ర పోషిస్తాయి.
మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంది.

మధుమేహ వ్యాధికి(sugar) వేపను మించిన చక్కటి మందు:


మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినమని చెప్పండి క్రమేనే మోతాదు పెంచుకుంటే సరిపోతుంది అంటా...!!

మనకు షుగర్‌ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం _/|\_
*బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ :-

పురుగులు , కీటకాలు కుట్టిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాసి రుద్ది తే ఎర్రదనం , వాపు తగ్గుతాయి .
కందిరిగా కుట్టిన, పాము కాటు వేసిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుని పేస్ట్ లాగా చేసి పెడితే విశాం విరుగుడు అవుతుంది .
అధెవిధం గా ఫంగస్ వల్ల వచ్చే వ్యాదుల ప్రదేశం లో ఈ బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాస్తే తగ్గుతాయి .

*బిళ్ళ గన్నేరు మొక్క వేరు :-

బిళ్ళ గన్నేరు మొక్క వేరు ని తీసుకొని మట్టి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి .. 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిళ్ళ గన్నేరు వేరు ముక్కలని వేసి సన్నని సెగ పై న పెట్టి కాషాయం లాగా చెయ్యాలి ( ఒక గ్లాస్ నీటికి అర – సగం నీరు వచ్చేంతరవరకు కాయలి ) తరువాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో మూత్రం లో షుగర్ లెవెల్ తగ్గుతుంది . కిడ్నీ లో వాపు , కిడ్నీ వ్యాధులు ఏమిన ఉన్న పోతాయి . క్యాన్సర్ ని రానివ్వధు మరియు షుగర్ వ్యాధి ని రాని వద్దు .

*బిళ్ళ గన్నేరు పువ్వులు :-

బిళ్ళ గన్నేరు పువ్వులని 5 లేక 10 పువ్వులని తీసుకొని నీటిలో వేసి కషాయం ( ఈ కషాయం లేత పచ్చరంగు లోకి రావాలి ) లాగా కాచి వడ పోసి దాంట్లో మిరియాల పొడి కాస్త వేసి తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు క్యాన్సర్ , మరుయు షుగర్ వ్యాధి రానివ్వదూ .మరియు behaviour disorder వారికి కోడా ఉమాయోయగా పడుతుంది .
మరియు చిముతో ఉన్న మొలలు కోడా తగ్గుతాయి . పెద్ద పేగు క్యాన్సర్ అయిన తగ్గుతుంది .

మొలల దగ్గర ఎరపడిన చీము తో పుల్లూ మరియు పగ్గులు లాంటివి ఉంటే ఈ కాషయ౦ లో మిరియాల పొడి వెయ్యకుండ పువ్వుల తో పాటు ఆకులు కోడా వేసి కాషాయం చేసి ఈ నీటి తో కదుకుంటే తగ్గుతాయి

Thursday, October 8, 2015

దగ్గుకు దండోపాయ మార్గాలివే..!



దగ్గుకు దండోపాయ మార్గాలివే..!
వాతావరణంలో కలిగే మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల పలురకాల ఆరోగ్య సమస్యల బారిన పడడం సర్వసాధారణం. వీటిలో దగ్గు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది దగ్గు తగ్గించుకోవడానికి మాత్రలు వేసుకోవడం, దగ్గుమందు తాగడం, గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కిలించడం.. ఇలా దాదాపు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయినా దగ్గు ఏమాత్రం తగ్గకుండా వేధిస్తుంటుంది. ఇలాంటి సమయంలోనే దగ్గుపై ఆఖరి అస్త్రంగా ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు పనికొస్తాయి. ఇవి దగ్గుపై ప్రభావాన్ని చూపి, సమస్య నుంచి సత్వర ఉపశమనాన్నిస్తాయి. మరి అవేంటో తెలుసుకుని మనమూ ఓసారి ప్రయత్నిద్దామా..!
• ఆగకుండా వస్తోందా?
కొంతమంది నిమిషం గ్యాప్ లేకుండా నిరంతరాయంగా దగ్గుతూనే ఉంటారు. ఇలాంటివారు కొద్దిగా అల్లాన్ని తీసుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక కప్పు నీటిలో వేసి కాసేపు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి, ఆ తర్వాత తీసుకోవాలి. దీనికి అవసరమైతే కాస్త తేనె, నిమ్మరసం కూడా కలుపుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు.. దగ్గు తగ్గే వరకు నిర్ణీత వ్యవధిలో కొద్ది కొద్దిగా అల్లం లేదా వెల్లుల్లి ముక్కల్ని నమలడం వల్ల కూడా సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
• పొడిదగ్గుకు..
పొడిదగ్గు చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎవరితోనైనా ఏమైనా మాట్లాడదామని నోరు తెరిస్తే చాలు.. మాటల కంటే ముందు దగ్గు వచ్చేస్తుంటుంది. ఇలా ఎక్కువగా దగ్గడం వల్ల ఛాతిలో మంట కూడా వస్తుంది. ఇలాంటి వారికి పసుపు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పాత్రలో అరకప్పు నీటిని వేడిచేయాలి. నీరు మరుగుతున్న సమయంలో చెంచా పసుపు, పావు చెంచా మిరియాల పొడి, రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి.. కనీసం ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మరిగించాలి. దీన్ని ఒక గ్లాసులో వడకట్టి, గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి చెంచా తేనె కలుపుకొని తాగాలి. లేదంటే గోరువెచ్చటి నీటిలో కాస్త పసుపు, కాస్త తేనె వేసుకుని బాగా కలుపుకొనైనా తాగచ్చు. ఇలా క్రమంగా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్య నుంచి బయటపడచ్చు.. ముఖ్యంగా పొడిదగ్గుతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.
• ఛాతీలో మంటా?
అలాగే నిరంతరంగా దగ్గడం వల్ల ఛాతీలో మంట రావడం సర్వసాధారణం. మరి దగ్గుతో పాటు దీన్ని కూడా తగ్గించుకోవాలంటే కాస్త వేడిగా ఉండే పాలలో కొద్దిగా తేనె వేసి బాగా కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్, పొడిదగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే పరగడుపున ఒక చెంచా తేనె తీసుకున్నా ఫలితం ఉంటుంది.
• మరిన్ని..
* రాత్రంతా నానబెట్టిన బాదంపప్పుల్ని ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం దీనికి ఒక చెంచా వెన్న కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని రోజుకు నాలుగైదు సార్లు సమస్య తగ్గేంతవరకూ తీసుకోవాలి.
* కొబ్బరినూనె, నిమ్మరసం.. కొద్ది మోతాదుల్లో తీసుకుని దానిలో కాస్త తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
* క్యారట్ జ్యూస్ ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. దగ్గునూ తగ్గిస్తుంది. దీన్ని మామూలుగా తాగడం అంత రుచిగా అనిపించకపోతే ఇందులో కాస్త తేనె కలుపుకోవచ్చు.
* పుదీనాతో తయారుచేసిన టీ తాగినా లేదంటే మరిగించిన నీటిలో రెండు మూడు చుక్కల పుదీనా నూనెను వేసి ఆవిరి పట్టినా దగ్గు నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.
దగ్గును తగ్గించుకునే కొన్ని సహజసిద్ధమైన మార్గాలేంటో తెలుసుకున్నారు కదా! అయితే ఈ చిట్కాలన్నీ ప్రయత్నించినప్పటికీ ఒకటి రెండు వారాల వరకు దగ్గు తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

Monday, October 5, 2015

రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..

రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..

ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు.
మిల్లెట్ అనే రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల యంటీ ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.
రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది.
రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది.
సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్నేన్ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు

మధుమేహ వ్యాధికి(sugar) వేపను మించిన చక్కటి మందు:

బిళ్ళ గన్నేరు. అపోసైనేసి కుటుంబానికి చెందిన చిన్న పొద. 
దీని వ్యవహారిక నామం మెడగాస్కర్ పెరివింకిల్,సంస్కృత నామం నిత్య కళ్యాణి,శాస్త్రీయ నామం కథరాంథస్ రోజియస్. 
మధుమేహ వ్యాధికి(sugar) చక్కటి మందు.ప్రతి రోజు 4-6పచ్చి ఆకులు పరగడుపున నమిలి మ్రింగుచున్న రక్త శర్కర(blood sugar) నియంత్రణలో ఉంటుంది అని యోగా గురువులు శ్రీ Raghavanand Mudumba గారు నిన్న స్వచ్చభారత్‌ కార్యక్రమంలో ఒక గ్రౌండ్‌లొ కొన్ని మొక్కలు పొదలు తోలగిస్తుంటే వీటిని గురించి వీటీ విషిస్ఠతగురించి వివరించారు,

వెంటనే వేపను మించిన దివ్య ఔషధం గురించి అందరికి తెలియడం లేదు అని మీ అందరితో షేర్‌ చేసుకోవాలి అని ఈ పోస్ట్‌ పెట్టాను...!! మీరు కూడా మీ ఆత్మీయ శ్రేయోబిలాషులకు తెలిపేలా షేర్‌ చేయండి ప్లీజ్‌ _/|\_

మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినమని చెప్పండి క్రమేనే మోతాదు పెంచుకుంటే సరిపోతుంది అంటా...!!

మనకు షుగర్‌ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం 

Sunday, October 4, 2015

భయంకరమైన వ్యాది పక్షవాతం గురించి పూర్తి వివరణ ( చదివి స్పందించండి )

పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను 'పక్షవాతము' (Paralysis) అంటారు.శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగి పోవడం, కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం, గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతప్రభావం ఉంటుంది.ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది.ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు.మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు.కేవలం 10 శాతం మందికే పక్షవాతంపై అవగాహన ఉంది.దీని వల్ల సగానికి పైగా తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతున్నారు.పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న వరల్డ్‌ స్ట్రోక్‌ డేను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది.ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30 శాతం వరకు చిన్నవయసు వారుంటున్నారు.అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.కళ్ళు తిరగటం, తాత్కాలికంగా దృష్టి మందగించడం, లేదా రెండుగా కనిపించడం, కాళ్ళూ, చేతులు ఉన్నట్లుండి బలహీనంగా అవడం, మాటల్లో తడబాటు వంటివన్నీ పక్షవాతానికి ముందస్తు సంకేతాలు.ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కనీసం గంటలోపు స్ట్రోక్‌ యూనిట్‌ సౌకర్యం ఉన్న వైద్యశాలకు తీసుకురాగలిగితే వారికి త్రాంబోలైటిక్‌ థెరపీ ద్వారా రక్తప్రసరణ పునరుద్ధరించి, మెదడు ఎక్కువగా దెబ్బతినకుండా కాపాడవచ్చు.అయితే దురదృష్టవశాత్తు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల 10 శాతం మంది కూడా గంటలోపు ఆసుపత్రికి రావడం లేదు. కొన్ని వ్యాధుల్లో లక్షణాలు ముందే బయటపడతాయి. వాటిని గుర్తించి త్వరగా చికిత్స తీసుకోగలిగితే నష్టాన్ని నివారించడానికి సాధ్యమవుతుంది. అలాంటి సమస్యల్లో ముఖ్యమైనది పక్షవాతం(స్ట్రోక్). పక్షవాతానికి సంబంధించిన లక్షణాలు కనిపించినపుడు మొదటి మూడుగంటల్లో ఆసుపత్రికి చేరుకోగలిగితే మెదడుకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు.
మెదడుకు రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినపుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాల సమూహాన్ని కలిపి స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడులోని రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడటం మూలంగా రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. రక్తసరఫరా తగ్గడమే కారణం స్ట్రోక్ వచ్చిన వారిలో మెదడుకు రక్తం సరఫరా తగ్గడం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది. రక్తం సరఫరా తగ్గడం వల్ల మెదడుకు ఆక్సిజన్ అందదు. ఫలితంగా మెదడు నుంచి సంకేతాలు అందక కొన్ని అవయవాలు పనిచేయడం మానేస్తాయి.
తిమ్మిర్లు రావడం, ఒక కాలు, చేతిలో శక్తి తక్కువ అయినట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు ఈ లక్షణాలు కనిపించడం జరుగుతుంది.
మాట్లాడలేకపోతారు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోతారు. చూపు మసకబారుతుంది. నడవాలని లేచినపుడు బ్యాలెన్స్ తప్పినట్టు అవుతుంది. తీవ్రమైన తలనొప్పి మొదలవుతుంది.
45 ఏళ్లు పైబడిన వారిలో రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో రిస్క్ మరింత ఎక్కువ.
ఎవరిలో రిస్క్ ఎక్కువ
కుటుంబ చరిత్ర : తల్లిదండ్రులు, అన్నాచెల్లెళ్లు, తాతయ్య, నానమ్మలో ఎవరైనా స్ట్రోక్ బారినపడినట్లయితే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఒకవేళ తండ్రి లేక అన్న 55 ఏళ్లు పైబడకముందే, తల్లి లేక చెల్లె 65 ఏళ్లు పైబడక ముందే హార్ట్ఎటాక్ బారినపడినట్లయితే పిల్లలకు రిస్క్ ఎక్కువే ఉంటుంది.
రక్తపోటు : రక్తపోటు 140/90 కన్నా ఎక్కువున్నా, రక్తపోటు ఎక్కువ ఉందని వైద్యులు ధృవీకరించినా రిస్క్ పెరిగినట్లే.
ధూమపానం : పొగతాగే అలవాటు ఉన్నా జాగ్రత్తపడాల్సిందే.
మధుమేహము : ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 ఎమ్‌జీ/డీఎల్ ఉంటే స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్లే.
కొలెస్ట్రాల్ : కొలెస్ట్రాల్ స్థాయి 240 ఎమ్‌జీ/డీఎల్ ఉన్నా, మంచి కొలెస్ట్రాల్(హెచ్‌డీఎల్) 40 ఎమ్‌జీ/డీఎల్ కంటే తక్కువ ఉన్నా ముప్పు ఉన్నట్లే.
శారీరక వ్యాయామం : రోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయకపోయినట్లయితే స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
అధిక బరువు : ఎత్తుకు తగిన బరువు కన్నా 10 కేజీలు అదనంగా ఉన్నా రిస్క్ ఉంటుంది.
ఆరోగ్య చరిత్ర : గతంలో ఒకసారి స్ట్రోక్ , ట్రాన్సియెంట్ ఇష్కెమిక్ అటాక్ వచ్చింది. కాలి రక్తనాళాలకు సంబంధించిన జబ్బు ఉంది. ఎర్రరక్తకణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సికిల్ సెల్ ఎనీమియా ఉంది. ఒకసారి హార్ట్ఎటాక్ వచ్చింది. ఇలాంటి మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి.
ముఖపక్షవాతం
****************
ముఖ కండరాలకు సరఫరా చేసే ఏడవ క్రేనియల్‌ నాడీకి వచ్చే సమస్యలు (ఇన్‌ఫ్లమేషన్‌) వల్ల మూతి వంకరపోతుంది. ఈ సమస్యనే వైద్య పరిభాషలో బెల్స్‌ పాల్సి అంటారు.చలికాలంలో రాత్రులు బస్సులో ప్రయాణిస్తుంటే కిటిక పక్కన కూర్చున్న వారి చెవిలోకి చలిగాలిపోయి నరంపై ఒత్తిడి తగిలి బెల్స్‌ పాల్సి వచ్చే అవకాశం ఉంది. 'హెర్పస్‌ జోస్టర్‌ వైరస్‌' ఇన్‌ఫెక్షన్‌ కొన్ని సందర్భాల్లో సమస్యగా మారొచ్చు.బెల్స్‌ పాల్సి (ముఖ పక్షవాతం)కి గురైన వారిలో ముఖంలో ఒకవైపు కండరాలు చచ్చు బడిపోతాయి. చెవి దగ్గర కొద్దిగా నొప్పి ఉంటుంది. పెదవుల చుట్టూ తిమ్మిర్లు, కళ్లు ఎండిపోయినట్లు వుండొచ్చు. నాలుక పక్కకు ఉంటుంది. కన్ను మూయలేక పోవడం వల్ల దుమ్ముపడి 'కెరిటైటిస్‌' అనే సమస్య వచ్చి కళ్ల వెంట నీరు కారుతుంది. కుడివైపు ముఖ పక్షవాతం వచ్చినవారు నవ్వినప్పుడు మూతి ఎడమవైపునకు లాగినట్లు వంకరపోయి కనిపిస్తుంది. బెలూన్‌ ఊదలేకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, దవడలో ఆహారం ఉంచుకోలేకపోవడం జరుగుతాయి. మాటలో మార్పు కనిపిస్తుంది. నుదురుమీద ముడతలు ఏర్పడవు. ఈలవేయలేరు. పెదవుల్లో కదలికలు మందగిస్తాయి.
మెదడులో సునామీ
********************
పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32 వేల నాడీ కణాలు చనిపోతాయి.ఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. అదే నిమిషం సమయంలో నాడీకణాల -న్యూరాన్లు- మధ్య జరిగే 14 వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయి. అంతే సమయంలో మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ల దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలను మెదడు నష్టపోతుంది.మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడి, మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోవడమే పక్షవాతానికి మూలం.పక్షవాతంతో మెదడుకు తీవ్ర నష్టం కలిగే అవకాశం నాడీకణాలు మరణించే సంఖ్యపైనే ఆధారపడి ఉండుంది. అందుకే పక్షవాతం లక్షణాలు కనబడిన వెంటనే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతానికి గురైన మొదటి మూడు గంటల్లో రక్తపు గడ్డలను కరిగించే మాత్రలను వేసుకుంటే, దీనివల్ల అవయవాలు చచ్చుబడిపోవడం లాంటి నష్టాలు చాలావరకు తగ్గుతాయని వైద్యుల వివరిస్తున్నారు.శరీరంలోని ఏదైనా అవయవానికి ఇలా రక్తం సరఫరా చేసే నాళంలో అడ్డంకి ఏర్పడితే ఆ అవయవానికి సంబంధించి స్ట్రోక్ సంభవిస్తుంది. స్ట్రోక్స్‌లో గుండెపోటు, పక్షవాతం ముఖ్యమైనవి. తర్వాత ఊపిరితిత్తులు, కాళ్లలో ఇలాగే రక్తం గడ్డకట్టే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటోంది. ఇలా ఒంట్లో ఎక్కడ స్ట్రోక్ వచ్చినా ఆస్పిరిన్ మాత్ర వేసుకోవాలట.ఛాతీలో గుండెనొప్పి వచ్చినప్పుడు ఆస్ప్రిన్ మాత్ర వేసుకుంటే మరణాన్ని తప్పించుకోగలిగినట్లే పక్షవాతం వచ్చిన సందర్భాల్లో కూడా ఆస్ప్రిన్ మాత్ర చప్పరిస్తే తాత్కాలిక ఫలితాలు ఉంటాయి.
కారణాలు
***********
పక్షవాతానికి ముఖ్యమైన కారణాలు:అధిక రక్తపోటు, మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం, పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు, ప్రమాదాలు, వెన్నెముకలలోని కొన్ని లోపాలు మరియు కొన్ని రకాల విష పదార్ధాలు.నిత్యం గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలు, యువతుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికమట.
వైద్యం
******
దీనికి పనిచేసే మందులు:క్షీరబల తైలం, హెపారిన్.న్యూరాలజి చికిత్సతోపాటు ఫిజియోథెరపీ చికిత్స . న్యూరోమస్కులార్‌ ఎలక్ట్రికల్‌ స్టిములేషన్‌తో పనిచేయని కండరాల్లోని శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. కండరాలను ఉత్తేజపరచడానికి థెరప్యూటిక్‌ మసాజ్‌, మాన్యువల్‌ థెరపీ ముఖ కండరాలకు వ్యాయామం చేయిస్తారు. దీని వల్ల ముఖ కండరాల్లో శక్తి పెరుగుతుంది.
రోగి శ్వాస తీసుకోవడం, రక్తపోటు ఎలా ఉంది పరీక్షించాలి.
రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించాలి.
ఆక్సిజన్ అవసరమైతే ఇవ్వాలి. ఈసీజీ, షుగర్ టెస్ట్ చేయించాలి. తరువాత సీటీ స్కాన్ చేయించాలి.
సీటీ స్కాన్‌లో రక్తనాళం చిట్లినట్లయితే తెలిసిపోతుంది. బ్లీడింగ్ లేనట్లయితే రక్తం సరఫరా తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చిందని నిర్ధారణ చేసుకోవచ్చు. హైబీపీ ఉంటే నెమ్మదిగా తగ్గించాలి. అదే సమయంలో మెదడులో ఒత్తిడిని తగ్గించడానికి మందులు ఇవ్వాలి. షుగర్ ఉంటే నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
మెదడులో మైక్రోచిప్‌
********************
నిశ్చలనంగా పడిఉన్న పక్షవాతం రోగుల మదిలోభావాలను గ్రహించి తదనుగుణంగా నాడీవ్యవస్థను చైతన్యపరచే 'మైక్రోచిప్‌'ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు సెంటీమీటరు వెడల్పులో ఉండే ఈ పలుచని చిప్‌ను మెదడులో అమరుస్తారు. రోగి ఆలోచనను పసిగట్టే ఈ మైక్రోచిప్‌... ఆ సంకేతాలను అచేతన అవయవాల కదలికలుగా మార్చేస్తుంది .