మీ గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినండి. అది కూడా నూనె ఎక్కువగా ఉన్న చేపలను ఆరగించాలి. దీని వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఆరు నుంచి 12శాతం వరకు తగ్గుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. చేపల వినియోగానికి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిపుణులు పరిశోధించారు. ఇందులో భాగంగా ఈ అంశంపై ఇప్పటివరకు జరిగిన 38అధ్యయన ఫలితాలను విశ్లేషించారు. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను తినడం వల్ల గుండె జబ్బులను నిరోధించవచ్చని చివరకు నిర్ధారించారు.
No comments:
Post a Comment