Sunday, October 11, 2015

అందమునకు ఆయుర్వేదము

నెరసిన వెంట్రుకలు నల్లబడుటకు
కరక్కాయ ,తానికాయ ,ఉసిరికాయ ఈ మూడింటి బెరడు ,నీలి ఆకు ,లోహా చూర్ణము వీటిని సమబాగాలుగా గుంటగలగర నిజరసము జీలకర్ర రసము గొర్రె మూత్రము కలిపి మెత్తగా దంచి రోజు ఉదయం లేక సాయంత్రము తలకు రాసుకుని దట్టముగా లేపనం చేసి 2,3 గంటల తరువాత కుంకుడు శికకాయలతో తలస్నానము చేసిన తెల్లవెంట్రుకలు క్రమంగా తగ్గి పోతాయి.
శరీరము బిగువుగా ఉండుటకు
మేడి పాలు ,మర్రి పాలు నువ్వుల నూనె తో కలిపి కాచి శేరీరానికి మర్దన చేసుకోవాలి.
వెంట్రుకలు ఊడకుండా ఉండుటకు
మినుములు ,మెంతులు ,ఉసిరిక సమంగా తీసుకుని నానబెట్టి రుబ్బి తలకు పెట్టవలెను.ఆరిన తరువాత కుంకుడు రసం తో స్నానం చేయవలెను అలా చేసిన తరువాత 3 రోజుల్లోనే అద్బుత ఫలితం కలుగుతుంది.
అతి బరువు
తులసి ఆకులను పెరుగు లేక మజ్జిగతో వాడిన బరువు తగ్గును.
పులిపిర్లు తగ్గుటకు
ఉత్తరేని ఆకు ,హరిచంధనమును నువ్వుల నూనె తో కలిపి మెత్తగా నూరి పులిపిర్ల పై లేపనం చేయవలెను.
అధిక మాంసం తగ్గుటకు
ఆవనూనెతో మర్దనా చేస్తే అధిక మాంసం తగ్గుతుంది(ex:మోకాలి క్రింద బాగాన..)
జుట్టు తిరుగుటకు
రాత్రి పడుకోబోయే ముందు తలకు ఆముదము రాసి జుట్టును పక్కకు దువ్వాలి ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత పక్కకు తిరిగిన జుట్టును వెనుకకు కూడా దువ్వుకొన వచ్చును.కుంకుడు రసం తోనే తలస్నానం చేయాలి షాంపూ ,సబ్బులు వాడకూడదు.
చుండ్రు
90 వేపాకులు ,9 మిరియాలు కలిపి కొంచెం నీళ్ళు కలిపి మెత్తగా నూరి తలకు ఒంటికి పట్టించుకవాలి సరిపోక పోతే మరికొంత కలుపుకోవచు.ఆరిపోగానే కుంకుడు కాయ రసం తో స్నానం చేయవలెను.వేపాకులు మిరియాల సంక్య కరెక్ట్ గా వుండాలి.
నల్ల మచ్చలు పోవుటకు
ఆముదపు గింజలు 225 తీసుకుని పై పెచ్చులు తీసివేసి ,లోపలి పప్పులో 12gm శొంటి పొడి కలిపి మెత్తగా నూరి ,కుంకుడు గిన్జలంత టాబ్లెట్స్ చేసి ,నిలువ ఉంచుకుని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే 2,3 నెలల్లో నల్ల మచ్చలన్ని నామరూపాల్లేకుండా పొతాయ్.
మొటిమలు
[1].సుగంధి పాల వేళ్ళ బెరడు చూర్ణము ,పెసర పిండి ,హారతి కర్పూరము ఈ 3 సమబాగాలుగా కలిపి ఈ చూర్ణముతో ముకానికి నలుగు పెట్టుకుంటూ వుంటే ,ముకం మీద మొటిమలు ,మచ్చలు హరిన్చిపోతాయ్.
[2].సుగంధపాల వేళ్ళ చూర్ణము వస చూర్ణము ధనియాల చూర్ణము ఈ మూడింటిని సమ బాగాలుగా కలిపి నీటితో మెత్తగా నూరి ముకానికి రాస్తూ వుంటే మొటిమలు మచ్చలు హరించి పొతాయ్.
తల లోని పేలు
సుగంధ పాల వేళ్ళను గో మూత్రములో కలిపి మెత్తగా నూరి తలకు లేపనం చేస్తూ వుంటే తల లోని పేలు హరించి పొతాయ్.
వళ్ళు తగ్గటానికి
వాన నీటిని ఆకాశం నుండి పడేటప్పుడు నెల మేధా పడకుండా పట్టుకుని నిలువ వుంచి రోజు ఉదయం పూట 50gm వాన నీటిలో చిటికెడు మంచి పసుపు కలిపి తాగుతూ వుంటే 3 నెలల్లో స్థూలశరీరం తగ్గిపోతుంది.

No comments:

Post a Comment