కొందరికి కళ్ల కింద నల్లటి వలయాలుంటాయి. ఇవి చూడడానికి అస్సలు బాగుండవు. పైగా పెద్దవాళ్లల్లా కూడా కనిపిస్తారు. ఈ నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి.
వాడేసిన బ్లాక్ లేదా గ్రీన్ టీ బ్యాగ్స్ రెండింటిని అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆతర్వాత వాటిని బయటకు తీసి రెండు కళ్లపై పది పదిహేను నిమిషాలపాటు పెట్టుకొని తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు కొన్ని వారాల పాటు చేయాలి.
తెల్లగుడ్డ ముక్కను చల్లటి నీళ్లల్లో లేదా పాలల్లో వేసి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత ఆ గుడ్డతో కనురెప్పలపై పలుమార్లు అద్దాలి. లేదా... నాప్‌కిన్‌లో కొన్ని ఐస్‌క్యూబ్స్‌ను వేసి మూటలాకట్టి దాన్ని కళ్లపై పెట్టి తీస్తుండాలి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేయాలి.
గుప్పెడు పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఆ పేస్టును కళ్లకింద ఉన్న నల్లటి వలయాలపై రాసుకుని 15-20 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయాలి.
పావు టేబుల్ స్పూన్ పసుపులో రెండు టేబుల్‌స్పూన్స్ మజ్జిగ పోసి బాగా కలిపి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును కళ్లకింద ఉన్న నల్లటి వలయాలపై రాసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కళ్ల భాగాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి.

No comments:
Post a Comment