Tuesday, October 27, 2015

పెరటి ఔషధ మొక్కలు..!! బొప్పాయి...!

పెరట్లో సర్వసాధారణంగా పెరిగే పండ్ల మొక్క. కాయలను కూరకు కూడా వాడుకోవచ్చు
బొప్పాయిలో అధిక పీచు ఉండటం వలన కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.
ఇందులో కొవ్వును దగ్ధము చేయగల ఎంజైములు ఉండటం వలన గుండె పోటు రాకుండా చేస్తుంది .
బొప్పాయిలోని ఆంటి యాసిడ్లు చిన్న వయస్సులో వృద్ధాప్య చిహ్నాలు రాకుండా కాపాడుతాయి .
బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వలన జీర్ణ కోశం లోని పురుగులు నశిస్తాయి . మలబద్దకం తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది . బొప్పాయి రసం పెద్ద పేగులోని, ముఖ్యంగా కోలన్ ద్వార ఏర్పడిన చీము, జిగరును తొలగించి శుద్ధి చేస్తుంది, కాలేయ వ్యాధులను అదుపులో ఉంచుతుంది.
బొప్పాయి లో తక్కువ శక్తి ,ఇతర విటమిన్లు అధికంగా ఉండటం వలన శరీర బరువును తగ్గిస్తుంది ‘ఎ’ , ‘సి’ విటమిన్లు అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది .
బొప్పాయి తో తయారు చేసిన షాంపూ జుట్టులోని చుండ్రును అదుపులో ఉంచుతుంది .

No comments:

Post a Comment