ఎండబెట్టిన దానిమ్మ తొక్కని పొడి చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకున్న ఇరవై నిమిషాల తరువాత కడుక్కోవాలి. దానిమ్మ తొక్కలో ఉండే యాంటాక్సిడెంట్లు కురుపులు, మొటిమలను కలగజేసే బ్యాక్టీరియాని దరిచేరనీయవు
దానిమ్మపొడిలో పాలుపోసి మెత్తగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని కొద్దిసేపటి తరువాత కడుక్కోవాలి. దీనివల్ల వయసువల్ల వచ్చే ముడతలు, గీతలు పోయి చర్మం బిగుతుగా అవుతుంది.
దానిమ్మ పొడి చర్మాన్ని యువి కిరణాల నుంచి రక్షించే నేచురల్ సన్‌స్ర్కీన్‌లా, అలాగే చర్మంపై ఉండే మృతకణాలను, నలుపుదనాన్ని తొలగించే స్క్రబ్బర్‌లా కూడా ఉపయోగపడుతుంది.
దానిమ్మపొడి మాయిశ్చరైజర్‌లాగా కూడా బాగా పనిచేస్తుంది. అందుకే దానిలో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి రాసుకొని కొద్దిసేపటి తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే చర్మం పొడిబారడం తగ్గుతుంది
No comments:
Post a Comment