కలబందలో చర్మసౌందర్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి గుణాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలూ, మచ్చలూ, చర్మం పొడిబారడం, దద్దుర్లు రావడం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. కలబంద గుజ్జుకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి ముఖానికి రాయాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.
• కలబంద ఆకుల్ని నీళ్లలో వేసి కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. తరవాత ఈ ఆకుల్ని మెత్తని పేస్ట్‌లా చేసి కొన్ని చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోయి, ముఖం తాజాగా మారుతుంది.
• చెంచా కలబంద గుజ్జుకి, అరచెంచా చొప్పున కీరదోస రసం, పెరుగూ, కొన్ని చుక్కల గులాబీ నీళ్లూ కలిపి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే ముఖం అందంగా మారుతుంది. చర్మ సంబంధిత సమస్యలూ రాకుండా ఉంటాయి.
• రెండు చెంచాల కలబంద గుజ్జుకి, చెంచా కీరదోస తురుమూ, ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా ఐదు నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.
No comments:
Post a Comment