రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎందుకు, ఎప్పుడు వస్తుందో కారణాలు తెలియడం లేదు. ఒకప్పుడు నలభై ఐదేళ్లు దాటితేగానీ మహిళల్లో రొమ్ము కేన్సర్ పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు ముప్ఫై దాటితే చాలు వస్తోంది. మన దేశంలో ఏటా రెండు లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోనూ రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది.
ముఖ్యంగా రొమ్ము కేన్సర్ బాధితులు నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రొమ్ము కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొద్దిపాటి అవగాహన ఉంటే చాలని అంటున్నారు ప్రముఖ బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ సర్జన్ డా.కె.ప్రవీణ్‌కుమార్ దాదిరెడ్డి. ముప్పయ్ ఏళ్ల వయసు దాటితే చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చునని, ప్రాథమిక దశలో గుర్తించినా దాన్ని పూర్తిగా నిర్మూలించుకోవచ్చునని అంటున్నారు. కారణాలు తెలియకపోయినా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుందన్నదానికి ప్రధానంగా కారణాలు లేకపోవచ్చుగానీ, ఎక్కువగా వస్తుందన్నది మాత్రం తేటతెల్లమైంది. దీనికి గల కారణాలు పరిశీలిస్తే...
- కుటుంబ చరిత్ర కారణంగా వచ్చే అవకాశాలున్నాయి.
- పొగతాగడం, మద్యం సేవించే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశం.
- చిన్నవయసులోనే పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది.
- లేటు వయసులో అంటే 40-45 ఏళ్ల మధ్యలో బిడ్డలను కనడం వల్లకూడా వచ్చే అవకాశం.
- కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడమూ ఒక కారణం.
- పీరియడ్స్‌లో భారీగా మార్పులు చోటు చేసుకోవడం.
- ప్రధానంగా ఈస్ట్రొజెన్ కొలెస్ట్రాల్ కారణంగా బ్రెస్ట్ కేన్సర్ వస్తున్నట్టు స్పష్టం.

ఏడాదికో 15 నిముషాలు..
- 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి మామోగ్రఫీ టెస్టు చేయించుకోవాలి.
- ఈ టెస్టు చేయించుకోవడానికి 15 నిముషాలు పడుతుంది. దీనికి రూ.1,500 ఖర్చవుతుంది. దీనివల్ల రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది.
- రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉండే డిజిటల్ మామోగ్రఫీ టెస్టులు వచ్చాయి.
- చంటిబిడ్డలకు తల్లి ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల కొంతవరకూ రొమ్ము కేన్సర్‌ను నివారించుకోవచ్చు.
- ముప్ఫై ఏళ్లు దాటిన మహిళలు తరచూ రొమ్ములో వచ్చే మార్పులను గమనించాలి. గడ్డలు, చర్మం రంగుమారడం, మచ్చలు వంటి మార్పులు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
- దీనివల్ల ప్రాథమిక దశలోనే రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది.
- ప్రాథమిక దశలో ఉన్న రొమ్ము కేన్సర్‌లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెస్ట్‌ను తొలగించకుండా నయం చేసే అవకాశాలున్నాయి.
- బీఆర్‌సీఏ జీన్ టెస్టింగ్ అనే పద్ధతి ఇప్పుడు రొమ్ము కేన్సర్ నివారణలో కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు.
- క్రమం తప్పకుండా మామోగ్రఫీ చేయించుకుంటే రొమ్ము కేన్సర్‌ను సులభంగా గుర్తించడం, నివారించుకోవడం సాధ్యమవుతుంది.

No comments:
Post a Comment