Thursday, October 15, 2015

* మేతీ పనీర్



• కావలసినవి:
మెంతుకూర(తరిగి), పనీర్‌- పావు కేజీ
నూనె- రెండు టేబుల్‌స్పూన్లు
ఎండుమిర్చి- నాలుగు,
టొమాటో గుజ్జు- అరకప్పు
గరం మసాలా- ఒక టీస్పూను
ధనియాలపొడి- రెండు టీస్పూన్లు
ఉప్పు- తగినంత
• తయారీ
మెంతుకూరలో ఒక టీస్పూను పంచదార, కొద్దిగా నీళ్లుపోసి రెండు నిమిషాలపాటు ఉండికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత టొమాటో గుజ్జు వేయాలి. కొన్ని నిమిషాలపాటు ఉడికాక దానిలో ఉప్పు, గరంమసాలా, ధనియాలపొడి, వేసి తిప్పాలి. ఆ మిశ్రమం నుంచి నూనె పైకి తేతేలే వరకు ఉడికనిచ్చి అప్పుడు మెంతుకూర, పనీర్‌ ముక్కలు వేసి కలపాలి. మూడునిమిషాల తరువాత స్టవ్‌ ఆపేస్తే సరి... మేతీ పనీర్‌ రెడీ..!

No comments:

Post a Comment