Monday, October 12, 2015

అందం... కలబంద..!

అందం... కలబంద..!
కలబంద అందుబాటులో ఉంటే చాలు, చక్కని ముఖవర్చస్సు మీ సొంతమవుతుంది. ఎలాంటి చర్మానికైనా సరే కలబందతో తగిన ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఫేస్‌ప్యాక్స్ మీ కోసం... రెండు చెంచాల కలబంద గుజ్జు, రెండు చెంచాల చీజ్, రెండు చెంచాల కీర దోసకాయల గుజ్జు, ఐదారు గింజలు తీసిన ఖర్జూరాలు మెత్తగా కలుపుకోవాలి. దీనికి కాస్త నిమ్మరసాన్ని, చిటికెడు పసుపు చేర్చి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. పొడిచర్మం ఉన్న వాళ్లకు కళాకాంతులు వస్తాయి.
రెండు తాజా కలబంద ఆకులను నీళ్లలో ఉడికించండి. తర్వాత వాటిని గుజ్జుగా చేసి, రెండు చెంచాల తేనె, చిటికెడు గంధం పొడి కలపండి. దీనిని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది.

No comments:

Post a Comment