బెండకాయలో విటమిన్-సి, యాంటాక్సిడెంట్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలోని అనవసరపు కొవ్వుని కరిగించడంలో కూడా తోడ్పడుతుంది.
ప్రతిరోజూ బెండకాయ తినడంవల్ల పెద్దపేగులో వచ్చే కేన్సర్ బారినపడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఉబ్బసం ఉన్నవారు వీటిని తినడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.
బెండకాయలో ఫైబర్, విటమిన్-సి ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి చాలా మంచిది. దీన్ని ప్రతిరోజూ తినడంవల్ల నీరసం దరిచేరదు. అలాగే బ్లడ్‌షుగర్ నియంత్రణకు బెండకాయ బాగా ఉపయోగపడుతుంది.
వీటిల్లో విటమిన్-కె ఉండడంవల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. బెండకాయల్ని రోజూ తినేవారిలో కీళ్లనొప్పులు త్వరగా రావు.
No comments:
Post a Comment