భోజనం రుచించకుంటే ,కడుపు ఉబ్బరంగా ఉండి జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే జిలకర రసం సేవించండి దింతో వెంటనే మీకు జీర్ణక్రియలో మార్పులు సంభవించి ఆకలి బాగా వేస్తుంది.....
జలుబుతో బాధ పడుతుంటే వేయించిన జిలకరను వాసన చూస్తే జలుబుతో పాటు తుమ్ముల నుండి ఉపశమనం కలుగుతుంది ....
ప్రసవానంతరం బాలింత జిలకరను సేవిస్తే గర్భశయం శుభ్రమౌవుతుంది......
జిలకరను మరి ఎక్కువగా తీసుకుంటే వాంతులు వచ్చే ప్రమాదం ఉంది అందుకే మోతాదుగా తీసుకోవాలి . ....
జిలకర ఉదరంలో ఉన్న పురుగులను నాశనం చేస్తుంది అలాగే జ్వర నివారిణిగా పని చేస్తుంది . .....
కొందరికి శరీరం నవ్వతో ఇబ్బంది పెడుతుంటుంది ఇలాంటి వారు జిలకరను ఉడకబెట్టిన నీటితో స్నానం చేస్తే నవ్వ తగ్గి ఉపశమనం కలుగుతుంది . ......
జిలకరను ఉప్పు తో కలిపి రుబ్బిన తర్వాత అందులో తేనె లేక నెయ్యి కలిపి కాస్తా వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తేలు కుట్టిన చోట పూస్తే విషం తొలగి పోతుంది .
అతిసారంతో బాధ పడుతుంటే జిలకర చూర్ణాన్ని ఆరు గ్రాముల పెరుగులో కలుపుకొని సేవిస్తే అతిసారం తగ్గి పోతుంది ......
నడుం నొప్పి తో బాధ పడేవారు జిలకర పొడిని నాలుగు కప్పుల నీటిలో కలిపి దానిలో కొద్దిగా నెయ్యి, బెల్లం జోడించి అది ఒక కప్పు అయ్యేంత వరకు మరగబెట్టి చల్లారిన తర్వాత నడుము నొప్పి బాధితులచేత తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది ........
No comments:
Post a Comment