Tuesday, October 27, 2015

పెరటి వైద్యం....!! తులసి

తులసి కుండీలలోనైన సులువుగా పెంచగలిగే మొక్క . సర్వ రోగ నివారిణి అని పేరుంది.తులసి ఆకులు సువాసన కలిగి రుచికి చేదుగా, వగరుగా ఉంటాయి. కానీ ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి .
6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్ద నుండి రసం వడగట్టి అర స్పూన్ తేనెతో కలిపి రోజులో రెండు సార్లు 3- 4 చుక్కలుగా తీసుకోవాలి. గొంతు గరగరను తగ్గించి మృదువుగా చేస్తుంది, కఫాన్ని వదిలేస్తుంది .
జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది.
తులసి ఆకులను పరగడపున కొన్నిరోజుల పాటు 2 - 3 ఆకులను నమిలినట్లైతే ముక్కు దిబ్బడ వంటి శ్వాస లోపాలు సవరించబడతాయి, గుండెకు బలాన్నిస్తుంది, వ్యాధి నిరోధకశక్తి కలుగుతుంది.
సుగంధభరితమైన తులసి ఆకు చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది, క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది.
ఇంటిచుట్టూ తులసి మొక్కలు ఉంటే దోమల బాధ ఉండదు.

No comments:

Post a Comment