* పుచ్చకాయతో మేలైన ఆరోగ్యం!!
అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ
తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడతున్న వారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక
నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే
మలబద్ధకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులు తడిగా ఉంచుతుంది.
పుచ్చకాయలో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి
పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి
ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి.
No comments:
Post a Comment