Thursday, March 14, 2013

మూత్రపిండాలు


మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు... శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలు కావచ్చు.. ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. జీవన శైలి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మంచి ఆహారం తీసుకోవాలి. కిడ్నీకు ఉపయోగపడే కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కడ్నీ సమస్యలను అరకట్టవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. కిడ్నీని పదిలంగా ఉంచే కొన్ని ఆహారాలు మీ కోసం... బెర్రీస్: బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరి ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. మనకు తెలిసినంత వరకూ బెర్రీస్ అత్యధిక న్యూట్రిషన్ కలిగినటువంటి ఆహారం. ఇది బరువును తగ్గించుటలో సూపర్ గా పనిచేస్తుంది. బెర్రీస్ ను తీసుకోవడం ద్వార మూత్రపిండాలను శక్తివంత చేసి ఆరోగ్యం ఉండేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ది చేసి రక్తంలోని హానికర విషపదార్థాలను బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది.


No comments:

Post a Comment